Jump to content

పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాజిక పరిణామాన్ని స్పష్టంగా నిరూపిస్తోంది.

వెబ్‌ పత్రికలు వచ్చాక కథానిక పేజీల సంఖ్య పేరుతో వున్న పరిమితుల్ని అధిగమించగలిగింది. 2019 వచ్చేసరికి వెబ్‌ పత్రికల సంఖ్య పెరిగింది. వెంటనే పాఠకుల స్పందననికూడా తెలుసుకోగలిగే అవకాశం దొరికింది. అయితే ఇంకా వెట్‌ పత్రికల్లో దొరికిన యీ స్వేచ్చను కథానిక చెప్పుకోదగినంతగా వుపయోగించుకోలేదు.

2010 (ప్రాంతంలో కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్మారాలను ప్రారంభించింది. ముప్పయి అయిదు సంవత్సరాల్లో ఉన్న యువ రచయితలకు పురస్మారాలనివ్వసాగింది. ఐతే ప్రారంభించిన 4,5 సం॥లలో తెలుగులో ఈ యువప్రాయంలో రాసే రచయితలు దొరకలేదు. సాహిత్య సృజనకు అంతరాయం వస్తుందేమోనన్న భయంకూడా కలిగింది. సరిగ్గ అప్పుడే చాలామంది విద్యాధికులు యిటు స్వదేశంలోనూ అటు అమెరికాలోనూ వున్న వాళ్లు, ఐటీ రంగంలో ఉన్నవాళ్లు, కథలు రాయడం ప్రారంభించారు. బాగా పనివుండే ఉద్యోగాల్లో ఉన్న ఆ రచయితల కథానికలపైన వాళ్ల జీవిత స్వభావపు ప్రభావం బాగా కనబడుతుంది. కథను వేగంగా, క్లుప్తంగా, స్వష్టంగా చెప్పడానికింత 'ప్రాముఖ్యతను “రచన " నివ్వలేకపోయారు.

సరిగ్గా అదే సమయంలో విద్యాధికులైన చాలా మందికి, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగాలకు, పత్రికల్లో పనిచేస్తున్న యువ సంపాదకులకు సినిమా పరిశ్రమలో వెళ్లాలనే కోరిక పెరిగింది. అదే పనిగా సినిమాను చూడ్డం, సినిమాలకవనరమైన స్క్రిప్టు రాయడం, నాటకీయమైన కథల్ని యెక్కువగా చదవడం ప్రారంభమైంది. అందుకే వాళ్ల కథానికలపైన సినిమాటొగ్రఫీ పడసాగింది. యిలా యితర కథల ప్రభావం సాహిత్యం పైన పడటం కౌత్తేమీకాదు. శిల్పాన్ని కల్పనా సాహిత్యం అన్ని కళలనుంఛి నేర్చుకొంది. సంగీతము, చిత్రలేఖనాలతో మొదలుపెట్టి ఆధునిక కళారూపమైన సినిమా వరకూ అన్ని కళల సంపర్మంతో సాహిత్యం వెలిగిపోతూనే వుంది. అయితే 2010 తరువాతి రోజుల్లో సినిమాటోగ్రఫీ ప్రభావంలో పడిన రచయితల కథలుమాత్రం పురోగమనంలో వుండలేక పోయాయి. యీ ప్రభావం శైలిలోగూడా కనబడుతోంది. చకచక నడిచే చిన్న చిన్న సంభాషణలతో పంచ్‌ డైలాగులు అని కొత్తపేరు పెట్టుకున్న సంభాషణా చాతుర్యాలతో నడిచే యీ కథల్ని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు కేవలం సంభాషణలతోనే నడిపిన కథలతో పోల్చి చూసినప్పుడు తేడా స్పష్టంగా వెల్లువడుటుంది.

గత సంవత్సరంగా ప్రపంచానంతా పట్టి వేధిస్తున్న కరోనా 'ప్రభావంకూడా కథానికా శిల్చ్బంపైన పడింది. దాదాపుగా యింటికే పరిమితమ్టైపోయిన చాలామంది విద్యాధికులకు యిది కొంత తీరికనిచ్చింది. బాగా పనుల్లో పెడి విసిగిపోయే ఉద్యోగులు వినోదంకోసం వెతుక్కో సాగారు. ఈ సమయంలో వీళ్లందరికీ “ఫేస్‌ బుక్‌” అనే అంతర్జాలపు వేదిక అనుకూలమైన మాథ్యమంగా మారింది. దానికి పరిమితులూ, నియమాలూ, నిబంధనలూ ఏమీ లేవు. యెప్పుడు యేది తోస్తే అది రాసుకోవచ్చు. ఎవరికి కావలసిన పాఠకులు వారికి దొరుకుతారు. యిందులో వున్న విపరీత ధోరణులను పక్కనపెట్టి, మంచినే వెతుక్కోవచ్చు. కొందరు యువ కథకులు “ఫేన్‌ బుక్‌”లో కథామాలికల్లాంటి తన అనుభవాల్ని రాసుకున్నారు. కొందరు అనుభవాల్ని తరువాత పుస్తకాలుగాకూడా తీసుకొచ్చారు. వీళ్లల్లో కొందరు అవి కథలో కావో తెలియదని, ప్రక్రియ లక్షణాల్ని తెలుసుకొని ఆ పరిమితుల్లో తాము రాయలేదని వినయంగా చెప్పుకున్నారు. “నా యిచ్చయేగాని నాకేమి వెరపు” అనే వీళ్ల రచనల్ని చదివి ఆనందించే “యిన్‌స్టెంట్ " పాఠకలోకమూ వచ్చింది.

సాహిత్యమూ, మానవజీవితంలాగే ఒక సజీవ స్రవంతి. ప్రవహించడం దాని స్వభావం. పరిణామశీలంగా మారడం దాని లక్షణం. అయితే ఎలా మారడం అవసరమో, ఎలా మారడం తిరోగమనమో తెలుకోవడం మరీ కష్టమేమీ కాదు. సాహిత్య స్వభావమూ, దాని ప్రయోజనము యేమిటో తెలుసుకున్నప్పుడు వివేకవంతులైన సృజనశీలురు అప్రమత్తంగానే వుంటారు.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

48