Jump to content

పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సంప్రదాయం - సాధికారత

డా! పి. శివరామకృష్ణ 'శక్తి ' 944147977

అమ్మనుడికి పట్టం కట్టిన ఎ.కె.రామానుజన్‌

ఉద్యోగ, సాహిత్యరంగాలు మారినా వలసవాసన వదలలేదు

ఆంగ్ల భాషను బోధించే అట్టపతి కృష్ణస్వామిరామానుజన్‌, తను చిన్ననాటి నుండి విన్న తమిళ కన్నడ జానపద సాహిత్యానికి చికాగో విశ్వవిద్యాలయానికి వెళ్లి, ఆంగ్లంలోకి చేసిన అనువాదం Folktales from India ఈ కథా సంకలనమే కాక జానపదుల భారతీయుల దృక్పథాన్ని ప్రత్యేకతను విదేశీ విచార ధారతో పోలుస్తూ అతడు రాసిన వ్యాసాలను సమీక్షిస్తూ ప్రసిద్ధ పాశ్వాత్య పండితులు. రాసిన పరిచయంతో విజయ్‌ ధార్వాడ్ కర్‌ తెచ్చిన సంకలనం The collected eassays of A.K.Ramanujan. ఇలా మన జునపద సంప్రదాయాలకు అంతర్జాతీయ ప్రాసంగికత తెచ్చిన రామానుజన్‌ ధన్యుడు. ఈ సాహిత్యం సాహిత్యగాళ్ళకు వినీపించకపోవచ్చు, కానీ ఈ సంప్రదాయాలు రూపం మార్చుకుంటూ కొనసాగుతూనే ఉన్నాయి.

' Is there Indian way of thinking ' లో జానపదుల జ్ఞానం దేశకాల సాపేక్షమని వివరించిన తీరు, చరిత్ర పరిశోధకురాలు రమేలా థాపర్‌. మన చారిత్రక స్పృహను స్పష్టం చేసిన తీరును గుర్తు తెస్తుంది. Where mirrors are windowsలో, కథ చెపితే బరువు దించుకున్నంతగా మనసు తేలికౌాతుందని, విన్నవారికి తమను బంధించిన గోడలు కూలిపోతాయనే ఓదార్చు దొరుకుతుందని (ఈ వ్యాసం కొంత ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసంలో ద్రావిడ విశ్వవిద్యాలయం లో ఇంగ్లీష్‌ ఆచార్యులు బి.తిరుపతిరావు అనువదించారు) Food for thought వివిధ సందర్భాలలో మన వంటల గూర్చి మెదడుకు మేత, జానపదులవి కోరదేవతలని, నాగరికులవి స్తన దేవతలని అతడు విడమరిచి చెపుతాడు. మరోవ్య్వాసం పట్టణం, గ్రామం,మన్యంలలో వైవిధ్యాన్ని వైరుధ్యాన్ని రూపిస్తుంది.. జానపద రామాయణ ,భారతాలను, మనం బి.రామరాజు సేకరించిన సాహిత్యం, వ్యాసాలలో కూడా చూడొచ్చు. దీనిలో మూడు వందల రామాయణాలు వ్యాసాన్ని రచయిత్రి సత్యవతి గారు అనువదించగా హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. పాశ్చాత్య సాహిత్య విమర్శలో చర్చించే ఈడిపస్‌ భావనలు భారతీయ కథలలో ఎలా కనిపిస్తున్నాయో వివరించటం ఒక విశిష్టమైన వ్యాసం. ఈ వ్యాసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన చదువుకుంటే నేను విన్నాను. ఆయన ఆంగ్లంలో చాలా కవితలు రాసారు.వాటితో పాటు, ఇటువంటి జానపద సాహిత్యంమీద రామానుజన్‌ వ్యాసాలు ఆంగ్ల సాహిత్యవేత్తలు ఎంత బోధిస్తున్నారో తెలియదు కాని ఆయన మీద ఇటీవల ఒక పుస్తకం రాసిన స్పానిష్‌ యువకుని ప్రసంగం హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌లో విన్నాను. రామానుజన్‌ రచనలు తెలుగులో వస్తే తెలుగు జానపద సాహిత్యాన్ని విశ్లేషించే పద్ధతులకు, ఎంతో ఉపయోగపడుతుంది.

సమష్టి నుండి వ్యక్తినిస్టంగా మారిన రచనలు..

అయితే జానపద సాహిత్యంలో భారత కథలు సమష్టిచేతనను మేలుకొలుపుతుంటే, భారతం మీద ఇరావతి కారే భైరప్ప ప్రతిభా రే. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ రచనలు, పాత్రలు, ముఖ్యంగా ద్రౌపది చుట్టూ వ్యక్తినిష్టంగా, ఐదుగురితో ఆమె కోరికల మధ్య తిరుగుతాయి. ద్రౌపది, ఆనాటి దాసీవ్యవస్థలో స్త్రీలను ఒక వస్తువుగా చూసే పురుషాధిపత్యాన్ని ధిక్కరించటానికి, అన్ని పరిస్థితులను, షరతులను తట్టుకుని, ఒప్పుకుని, తిక్మన చిత్రించినట్లు 'రక్మసి తాల్మితో “చిచ్చాడింగట్టినయట్లు, బతుకుబండిని నెట్టుకొచ్చి జాతికొక హెచ్చరికగా నిలిచింది. మృచ్చకటికంనుండి రాయలసీమలో జరిగే గంగజాతరలో తనను బలవంతంచేసే దొరను, వాడి మారువేషాలను కనిపెట్లి వెంటాడే గంగ,మహిషాసురుని నవరాత్రులలో సంహరించిన దుర్గను తలపిస్తుంది. ఆ

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

41