Jump to content

పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అత్మకథ

కన్నడ మూల: డా.చంద్రప్ప సోబటి; తెలుగుసేత: రంగనాథ రామచంద్రరావు 90597 79289


13-14 శతాబ్దాలలో జరిగిన శైవ, వైష్ణవ ధార్మిక ఘర్షణల పరిణామంగా ఏర్చడిన పరిస్థితుల వల్ల శ్రీశైలం కొండ నుంచీ ఈనాటి కర్నాటక ప్రాంతానికి వలస వచ్చినవారు. ఈ దూర ప్రయాణ సమయంలో వీరికి కాయ్యబొమ్మలాటతో పరిచయం ఏర్పడింది. ఆసక్తితో ఆ ఆటను —నేర్చుకుని అందులో నైపుణ్యాన్ని సాధించారు. అప్పటి నుంచి కాయ్యబొమ్మలాట ప్రదర్శిస్తూ కర్ణాటకలోని వివిధ గ్రామాలలో తిరిగి ఈనాటి కుందగోళ రెడ్డేర నాగనూరు గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. అప్పటికే గ్రామగ్రామాల్లో వీళ్లు కాొయ్యబొమ్మలాట ప్రదర్శనతో ధనవంతులయ్యారు. పేరు ప్రఖ్యాతులు కలిగాయి. ఆ కారణంగా అక్కడికి వచ్చి స్థిరపడిన కొంత కాలంలోనే వారికి ఊరి గౌడ పదవి దొరికింది. ఆ కారణంగా అదే గ్రామంలోని మూల నివాసులకు, వలస వచ్చినవారికి మధ్య ఘర్షణ మొదలైంది. కాలక్రమంలో వాళ్లు హావేరి జిల్లాలోని రాణిబెన్నూరు తాలూకా అంతరవళ్ళి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు.

“గొంబెగౌడ పూర్వీకులు తెలుగే మాట్లాడేవారట. ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న రెడ్డిలింగాయతుల్లో ఇప్పటికీ 'తెలుగు” వాడుక ఉంది. బళ్ళారి, చిత్రదుర్గ జిల్లాలలో ఈ 'తెలుగు భాష ' వాడకం ఎక్కువ ఉనికిలో ఉంది. సరిహద్దు ప్రాంతాలతో పోలిస్తే 'మధ్య కర్నాటక 'లో ఈ తెలుగుభాషా ప్రభావం తక్కువ. సుమారు నాలుగైదు తరాల నుంచి తెలుగు వాడకపు గురుతులు వీళ్ళల్లో లేవు. వీరి వంశంలో కొయ్యబొమ్మలాట వృత్తి చరిత్ర సుమారు 600 సంవత్సరాల కన్నా ఎక్కువగానే ఉంది. వీరి గొప్పదనాన్ని మెచ్చుకున్న విజయనగర రాజులు వీరికి రాగి శాసనాలు కానుకగా ఇచ్చారు. అప్పటి నుంచి: వీరి పూర్వీకుల ఇంటి పేరు 'జీవనగౌడ”' అన్నది మరుగై 'గొంబె 'గౌడ అనే ఇంటిపేరు ముందుకొచ్చింది. ఇది వీరి కళానైపుణ్యాన్ని తెలియజేస్తుంది.

నేనొక కాయ్యబొమ్మల కళాకారుడిని. వయసు అరవైయారు. పదమూడేళ్ళ వయసు నుంచి ఈ బొమ్మల ఆటలో నిమగ్నమయ్యాను. మా ఊరు అంతరవళ్ళి. ఇది హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకాలో ఉంది. మా నాన్న హనుమనగౌడ. అమ్మ కమలమ్మ. 1947 మార్చి 1న నేను పుట్టిన రోజు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సంవత్సరంలోనే నేను పుట్టాను. ఇది నా అద్భష్టం కాదా? మా కులం రెడ్డి లింగాయత. ఇంటిపేరు జీవనగౌడ అని. జీవన గౌడ అన్నది మా వంశంలోని ఒక పేద్దాయన పేరు.

చుట్టుపక్కలున్న పల్లెల జనం మమ్మల్ని “గొంబే గౌడ (గొంబే అంటే బొమ్మ అని అర్థం) ని పిలుస్తారు. ఈ పేరు మా వంశానికి సుమారు నాలుగు వందల సంవత్సరాల నుంచీ వాడుకలో ఉందని మా నాన్న చెప్పేవారు. మా వంశంలోని ఒక పూర్వీకుడు ప్రదర్శించిన బొమ్మల ఆటను చూసి మెచ్చుకున్న విజయనగరం రాజులు తామ్ర శాసనం ఇచ్చారంట. ఆ తామ్ర శాసనాన్ని పూనా విశ్వవిద్యాలయం పరిశోధకులొకరు వచ్చి తీసుకునిపోయాడు. తిరిగి తెచ్చి ఇవ్వనే లేదు. మా వంశంలో పారంపర్యంగా వస్తున్న కొయ్యబొమ్మల ఆట గురించి ఉన్న ముఖ్యమైన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాం. ఇలాంటివి చేయకూడదన్న అవగాహన విద్వాంసుల్లో ఉండాలి. సరే, మా వంశానికి విజయనగరం కాలం నుంచి 'గొంబె గౌడ” అనే పేరు వాడుకలో వచ్చివుండొచ్చనే అనుమానం నాది.

మా తల్లితండ్రులకు పెళ్ళయి పన్నెండేళ్ళు గడిచినా పిల్లలు కాలేదంట. అంటే నేను, మా అన్న , తమ్ముడు, చెల్లెలు, ఎవరూ పుట్టలేదు. మమ్మల్ని కనటానికే మా అమ్మ కనిపించిన దేవతలందరికీ మొక్కుకుందట. ముడుపులు కట్టిందట. మా కులదైవం వీరన్నకైతే అనేక ముడుపులు కట్టి వాటిని తీర్చిందట. 'గొడ్రాలు” అనే సూటిపోటీ మాటల నుంచి విముక్తి పొంద వలసిందేనన్నది అమ్మ గొప్ప కోరికట.

నాన్న కొయ్యబొమ్మల ఆట చూసి మెచ్చుకున్న గ్రామీణులు ఆయనను మెచ్చుకుంటున్నప్పుడూ, మాటల్లో మా నాన్నకు పిల్లలు లేకపోవటం గురించి ప్రస్తావించేవారట. అది మరింత బాధ కలిగించేదట. ఈ ఆటలు ప్రదర్శిస్తుండటం వల్లనే తమకు ఎక్కువ అవమానం కలుగుతోందని నాన్న అమ్మ దగ్గర కూర్చుని ఏడ్చేవారట. రోజు ఇదే బొమ్మలాట వల్లనే కీర్తిమంతుడినీ, అవమానితుడినీ అవుతున్నానని కుమిలిపోయేవారట.

కీర్తి తెచ్చిన బొమ్మల వల్లనే అవమానం నుంచి విముక్తి పాందాలని అనుకుని ఇంట్లో ఉన్న కొయ్యబొమ్మలనే పూజించటం ప్రారంభించారు. ఆ బొమ్మలనే దేవుళ్ళుగా నమ్మారు. వాటిలో గొప్పదైన బొమ్మ 'శ్రీకృష్ణుడు ' అని మా తాతయ్య అప్పుడప్పుడు చేప్పేవారు. నాన్నయితే కృష్ణుడి బొమ్మను చాలా ఇష్టపడేవారు .మా అమ్మకూ అంతే. కృష్ణుడి బొమ్మ అంటే ఎక్కడా లేని ప్రేమ, భక్తి, గౌరవం. శ్రీకృష్ణుడే మా బతుకుబండి సారధి అని నా నమ్మకం. ఈ “నమ్మకమే” మా బతుకుకు స్ఫూర్తి అయ్యింది. ఈ “నమ్మకం” అనే గుణం నాన్న నుంచి నాకు వచ్చింది. నా పిల్లల్లోనూ అదే 'నమ్మకం”

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

38