పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బౌద్ధభిక్షువులకు నిలయమై, ఉపాసక, ఉపాసికల సందర్శనతో నిత్యం కళకళలాడింది. రానురాను అదరణ కోల్పోయిన బౌద్దచేజర్త, అనుకోకుండా బ్రాహ్మణీయ చేజర్లగా మారిపోయింది. 1917-18 సం॥లో,ఏ. హెచ్‌. లాంగ్‌హరిస్ట్‌, చేజర్ల పురాతన కట్టడాలను పరిశీలించి, క్రీ.శ 7వ శతాబ్ధిలో బౌద్దచైత్యాలయం, శివాలయంగా మార్చబడిందని తెలియజేశాడు. ముందున్న విజయనగర కాలపు ప్రవేశ (ద్వార) గోపురమండపంనుంచి లోనికెళ్లి కపోతేశ్వరాలయాన్ని చూశాను. ఒక్కసారి చుట్టూతిరిగొచ్చాను. ఆలయ సముదాయంలో, 78చారిత్రక ఆనవాళ్లున్నాయి.

వీటిలో 25 దేవాలయాలు, 26లింగపీఠాలు, 4 నాగస్థంభాలు, 18చిన్నరాతి శిల్పాలు, 5 శాసన స్థంభాలు,కొత్తగా బయల్పడిన 4 ఇటుకరాతి ఆలయాలు కనిపించాయి. శాసనాల్లో చేజర్ల, కందరపురమని, కపోతపురమని, కందరకపోతపురమని, చెరుంజెర్ల అని పిలువబడింది.

ఒక్కో చారిత్రక ఆనవాలూ, ఒక్కో రాజవంశాన్ని ఒక్కో రాజును, ఒక్కో సందర్భాన్ని గుర్తుకుతెస్తున్నాయి. ఇక్ష్వాకుల అనంతరం చేజర్లను రాజధానిగా జేసుకొని పాలించిన ఆనంద గోత్రిస రాజుల్లో, క్రీ.శ.310-15మధ్య పాలించిన దామోదరవర్మ శాసనాల్లో తాను బౌద్దోపాసకుణ్ణని, సంయక్సంబుద్ధస్య పాదానుద్వాతుడనని చెప్పుకొన్నాడు. శాతవాహన కాలంనాటి రెండువందల ఏళ్ల తరువాత వుంది. చేజర్ల చైత్యానికి మరమ్మత్తులు చేయించాడు. గత వైభవాన్ని పునరుద్ధరించాడు. తరువాత వచ్చిన పల్లవులు శైవంవైపు మొగ్గుజూపగా చేత్యాలయం కాస్తా కఫోతేశ్వరాలయంగా మారింది. ఒకవైవు పల్లవులూ, మరోవైపు విష్ణుకుండినులు, బౌద్దంకుత్తుకపై కత్తినుంచి, త్యాగశీలాన్ని ప్రబోధించిన శిబిజాతక మహోన్నతాశయాన్ని అపహాస్యంచేస్తూ, బౌద్దజాతక కథను స్థలపురాణంతో కప్పి, బుద్ధభగవానుని నీడలో ఈశ్వరుణ్ణి ప్రతిష్టించినవైనం నా మనసును కలచివేసింది. పరమబౌద్దుడైన అశోకుడుకూడా ఇతర మతాలను గౌరవించి సమాదరించమని తన శాసనాల్లో చెప్పుకున్నాడు. ఇక్కడ మాత్రం ఆధిపత్యధోరణికి బౌద్ధం మౌనాంగీకారాన్ని తెలపటం తప్ప ఏమీ చేయలేకపోయింది. ఆనందగోత్రినుల చివరిరోజుల్లో జాతకంమారిన చేజర్ల, విష్ణుకుండిన, తొాలీపల్లవ, తూర్పుచాళుక్య, యాదవ, కాకతీయ, రెడ్డి గజపతి, విజయనగర రాజుల కాలంలో శైవక్షేత్రంగా విరాజిల్లింది. ఆలయం వెనుక, లోపలి మరో మండపంలోనూ ప్రవేశద్వారం దగ్గర ఉన్న బౌద్దఆనవాళ్లను చూస్తూ నిర్లిప్తంగా ఉన్న నన్ను శ్రీనివాస్‌ పలకరించాడు. సార్‌ నిజంగా చేజర్ల బౌద్దక్షేత్రమా అని అడిగాడు. ఆలయంపేరు కపోతేశ్వరుడుకదా మీరు అలా అంటారేమిటన్నాడు. అతనికి జరిగిన చరిత్ర చెప్పాను. మతమార్పిడి మనకు కొత్తకాదన్నాను.

నిజమే చేజర్ల శివలింగంపేరు కపోతేశ్వరుడు. బౌద్ద జాతక కథల్లో కిరాతుని నుంచి పావురాన్ని రక్షించి తూనికలో శిబిచక్రవర్తి తన తొాడనుకోసి, పావురమంత మాంసాన్ని దానం చేయటానికి పూనుకాన్న ఇతివృత్తంగా బోధిసత్వుని త్వాగనిరతిని అనుకరిస్తూ ఈ శివాలయం రూరుదిద్దుకుంది. అయినా ఏనుగు వెనుకభాగాన్నీ గుర్తుకుతెచ్చే విధంగా నిర్మించిన చైత్యాలయం బౌద్దధమ్మవీచికలను వెదజల్లుతూనే ఉంది.ఆలయంలోపలి మహామండపంలోనున్నబౌద్ద శిలామండప స్తంభాలు, బౌద్దానికి మూలస్తంభాలైన శీల సమాధి, ప్రజ్జల్లో శీలానికి ప్రతీకలుగా ఇంకా నిలచి,బౌద్దాన్ని పూర్తిగా మార్చాలనుకున్న వారి అవివేకం పట్ల జాలిపడుకునే ఉన్నాయి.

ఆలయం వెనుక, బౌద్దారామ ఆనవాళ్లతోపాటు పల్నాటి సున్నపురాతి స్తంభం, దానిపైన ఇక్ష్వాకుల కాలపు ప్రాకృత శాసనంలోని అందమైన అక్షరాలు, మళ్లీ ఇక్కడ బౌద్దం పల్లవిస్తుందన్న ఆశను ఊరిస్తున్నాయి. భారత వురావస్తు సంస్థ రక్షిత కట్టడాల జాబితాలో చేరిన ఈ సముదాయంలో, చాళుక్యుల నమూనా ఆలయాలు, పల్నాటి సున్నపురాతి రెండుచేతుల గణేశుడు, సూర్యుడు, రాష్ట్రంలోని మొదటిదైన వేయిలింగాల శిలాఫలకం, చాళుక్య సంప్రదాయంతో తీర్చిదిద్దిన నంది, సహజసిద్ధ మాతృత్వానికి ప్రతీకలైన సప్తమాతలు, రకరకాల శివలింగాలు, ఒకటేమిటి తరతరాల వాస్తుశిల్ప ప్రదర్శన శాలను తలపించింది- చేజర్ల.

అన్నీ బాగానే ఉన్నాయి గానీ, వంచనకుగురైన పంచశీల గుర్తుకొచ్చి చరిత్రకు జరిగిన హాని నా గుండెల్లో గునపంలా గుచ్చుకుంది.

చేజర్లలో ఇక్ష్వాకుల కాలపు ప్రాకృత శాసనంకాక, ఉన్న తొమ్మిది శాసనాల్లో తూర్పుచాళుక్యరాజైన విషమసిద్ధి క్రీ.శ. 7వ శతాబ్ది తెలుగుశాసనం, తేదీలేని రెండు కన్షరపుర వరజనపదపతి శాసనాలు, క్రీ.శ 9వ శతాబ్ధి తెలుగుశాసనం,క్రీ.శ 1140 నాటి బఱయనాయకుని గొట్టెల దానశాసనం, క్రీ.శ. 1163, 1165, 1174 నాటి తాడూ కేతిరెడ్డి శాసనాలు, క్రీశ 1247 నాటి నాలుగు తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021 |