పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అత్తవారింటియందైనను భర్తయాస్తిపై భార్యకు హక్కులేదు. “రెంటికి చెడిన రేవడి మాదిరి ఏనైవు జూచినను స్త్రీలు నిరాధారులైయున్నారు. పుత్ర సంతతిలేక భర్త చనిఫోయెనేని ఆస్తి వారసులకు చెల్లును. స్వయముగ కనిపెంచిన కుమార్తెలకు హక్కులేదు. వేరే మరియొక బాలుని దత్తత గైకొనిన యెడల ఆస్తి యంతయు వాని పరము చేయుటకు వీలున్నది. క్రైస్తవులలో ఐరోపీయులకు భర్త చనిపోయిన తరువాత ఆస్తి భార్యకు చెల్లును. తదనంతరము ఆస్తి కుమారులకు కూతుళ్లకు సమానముగా పంచి యివ్వబడును. బౌద్దమతమునందుకూడా యటులే జరుగుచున్నది. హిందూ సంఘమునందు మాత్రమే స్త్రీకి ఆస్తిపై హక్కులేదు. పై హక్కులేని లోపము వలన స్త్రీ బానిసకంటె అధమము. బానిసలా పెంచబడి, బానిసను వివాహము చేసెకాని, బానిసకు బిడ్డలై జనించినపుడు, పురుషులు బానిసలు గాకుండుటకు సాధ్యమా? వర్ణ వివక్షత లేక స్తీ పురుషులు హక్కులలో లోపములేక యుండినటువంటి బౌద్దమతమునుగాని, వేదమతమునుగానీ అవలంబించియున్నప్పుడు మన దేశము పరాధీనము కాలేదు.” (మరపురాని అన్నపూర్ణ, పద్మాముద్రాక్షరశాల, మద్రాసు,పు 162-63) ఆస్తిహక్కు లేకపోవడం వల్ల స్రీలు వివక్షకు గురౌతున్నారని చెబుతూ “తల్లిదండ్రులు కొమారులతోబాటు కొమార్తైెలను గౌరవముగ చూచుటలేదు. తగినంత ద్రవ్యమును వెచ్చించి విద్య నేర్పించరు. కొమార్తెలకు పెట్టిన ఖర్చంతయూ వృథాయని భావించెదరు.... ఇన్నిటికిని కారణము స్రీలకు ఆస్తిహక్కు లేకపోవుటయే” అని విశ్లేషించింది. “అస్తి విషయమందు స్త్రీలకు హక్కు గలిగిన నాడే సర్వహక్కులు వచ్చినట్లు భావించవచ్చును” అని ఘంటాపథంగా చెప్పింది. దత్తత విషయంలోనూ, సంరక్షకత్వం విషయంలోనూ స్త్రీలకు పురుషులతో సమానంగా హక్ములుండాలని బలంగా కోరుకుంది అన్నపూర్ణమ్మ.

1920ల చివరినుండీ ఆంధ్రస్త్రీలు విడాకుల సమస్యపై చర్చించడం మొదలుపెట్టారు. 1928లో హరిసింగ్‌ గౌర్‌ కేంద్ర శాననసభలో HINDU MARRIAGE DISOLUTION BILLని ప్రవేశపెట్టాడు. మొదటినుండీ విడాకుల చట్టానికున్న తీవ్ర విరోధుల కారణంగా గౌర్‌ తన బిల్లును వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. 1931-33 మధ్య పలుమార్లు మళ్ళీ ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ వ్యతిరేకత కారణంగా చట్టరూపం దాల్బలేకపోయింది. తర్వాత జి.వి.దేశ్‌ముఖ్‌ విడాకుల బిల్లును ప్రవేశపెట్టాడు. అప్పటికీ, అంటే 1932లోనే స్వదీశీ సంస్థానమైన బరోడాలో విడాకులను చట్టబద్దం చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రస్త్రీలలో కొంతమంది విడాకుల చట్టాన్ని స్వాగతిస్తుండగా అనేకమంది తీవ్రంగా వ్యతిరేకించేవారు. కడప రామసుబ్బమ్మ లాంటి మహిళా మేధావులు విడాకుల చట్టాన్ని “దారుణాస్త్ర” మనీ, దాన్ని ఆహ్వానించడం “కొరివితో తలగోకుకోవడమే” ననీ వాదించేవారు. 18 నవంబరు 1934లో మదనపల్లెలో గుమ్మడిదల దుర్గాబాయమ్మ అధ్యక్షతన జరిగిన ఎనిమిదవ “ఆంద్ర రాష్ట మహిళాసభ "లో విడాకుల చట్టానికి సంబంధించిన తీర్మానం చర్చకు రాగా కడప రామసుబ్బమ్మ దాన్ని త్మీవంగా వ్యతిరేకించింది. మెజారిటీ సభ్యులు ఆమెను బలపరచారు. దాంతో ఆ తీర్మానం వీగిపోయింది. దీంతో ఆంధ్రలో విడాకుల చట్టానికున్న వ్యతిరేకత మనకు స్పష్టమవుతుంది.

ఇలాంటి చారిత్రక సందర్భంలో దరిశి అన్నపూర్ణమ్మ విడాకుల చట్టాన్ని మనసారా స్వాగతించింది. స్త్రీలు స్వలాభమును గోరి (విడాకుల) చట్టము కొరకు పోరాడుచున్నారనుట కేవలము సంకుచితాభిప్రాయము” అని నిశ్చయముగా తెలిపింది. “భార్యను జూడగనే మండిపడు పురుషుడును, భర్తను జూచి మూతి విరుచు భార్యయును, హృదయములు కోసినను మచ్చుకైన అనురాగము కాన్సీంచక, నామక: భార్యాభర్తలని వ్యవహరింవబడుచు యమలోక మనుభవించుటకంటే విడాకులిచ్చి ఎవరికి వారు స్వతంత్రులగుట ఉత్తమము కాదా? భార్య వ్యభిచరించుట తెలిసియు భార్యగా పరిగ్రహించుటయు, భర్త వ్యభిచారియైనను భర్తగ నెంచుటకంటెను విడిపోవుట సుఖముగాదా? న్యాయము గాదా?” అని సూటిగా ప్రశ్నించింది. విడాకులనేవి పాశ్చాత్యులనుండి నేర్చుకొన్న పద్దతి కాదనీ, పూర్వం నుండీ భారతదేశంలో ఉన్న పద్ధతేననీ “ఏ.కారణముల వలననో” ఈ పద్దతి కొన్ని కులాల్లో ఉండిపోయి కొన్ని కులాల్లో లేకుండా పోయిందనీ వివరించింది. విడాకుల చట్టం వచ్చినంత మాత్రాన ప్రతీ స్త్రీ విడాకులిస్తుందని భావించడం “హాస్యాస్పద”మని తెలియజేస్తూ విడాకులకు అవకాశం వున్న క్రైస్తవ, మహమ్మదీయ, బ్రహ్మసామాజికుల్లో “వెయ్యింటికొకరు మాత్రమే విడాకులిచ్చుకొనుట సంభవించుచున్నది” అని వాస్తవ పరిస్థితిని తెలియజేసింది. నిజమైన అనురాగము గల భార్యాభర్తలు విడాకులు తీసుకోరనీ “స్త్రీలకు ఉరిత్రాడు అయినటువంటిన్ని పురుషులకు మానహీనమైనటువంటిన్ని అనారోగ్యకరమైనటువంటిన్ని జారత్వము, బహుభార్యత్వమును మాన్సుట, క్రూరులగు భర్తలిడు బాథలను సహింపజాలక వంధలమంది స్త్రీలు నుయ్యిల గొయ్యిల పాలగుచుందుట నడ్డుపెట్టుటకే” విడాకుల చట్టం కావలసి వచ్చిందని విశ్లేషించింది. “పురుషులకు బానిసలుగ నుండుటకు బ్రహ్మ వారిని (స్త్రీలను) విధించినట్లును, స్త్రీలను అణగదొక్కి హింసించుటయే మగవారి కర్తవ్యమైనట్టును పురుషులు భావించుచు ”న్నారనీ, పురుషుల హింసనుంచి స్త్రీలను రక్షించడానికి విడాకుల చట్టం అత్యవసరమని ఘంటాపథంగా చెప్పింది.

కేవలం ఆంధ్ర, సంస్కృత భాషల్లో పాండిత్యం కలిగిన పండితులు, పీఠాధివతులు, పురోహితులు మొదలైనవారు సంఘ సంస్కరణొద్యమానికి అడ్డుతగులుతున్నారనీ, “పూర్వాచారపరాయణులు” రజస్వలానంతర వివాహాల్ని వితంతు వివాహాల్నిఅస్పృశ్యతా నిర్మూలనా కార్యక్రమాల్నీ విదేశీయాత్రల్నీ అంతర్వర్ణ భొజనాల్నీ అంతర్వర్ణ వివాహాల్నీ వ్యతిరేకిస్తూ సామాజిక మార్పును అడ్డుకొంటున్నారని విమర్శించింది అన్నపూర్ణమ్మ. స్త్రీలపట్ల పురుషుల కర్తవ్యాన్నీ గుర్తుచేన్తూ “స్రీలకు హక్కులనిచ్చి గొప్పవారినిగాజేసి గౌరవించినందున పురుషులు తమ తల్లులను, అక్మచెల్లెండ్రను, కుమార్తెలను బాగుచేనిన వారగుదురు.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

31