Jump to content

పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-డాక్టర్‌ షేఖ్ మహబూబ్‌ బాషా, 951579705

మహిళాచైతన్య కెరటం దరిశి అన్నపూర్ణమ్మ

ఇరవయ్య వశతాబ్టి ప్రథమార్థంలో సంఘసంస్మరణోద్యమం ముమ్మరంగా నడిచింది. పురుష సంఘసంస్మర్తలతో పాటు అనేకమంది మహిళాసంఘసంస్కర్తలు సంస్కర ణొద్యమంలో పాలు పంచుకొని ఉద్యమాన్నిముందుకు నడిపించారు. ఒకవైపు ఉద్యమంలో క్రియాశీలకంగా పాలు పంచుకుంటూనే ఇంకోవైపు సంస్మరణోద్యమ సాహిత్యాన్ని సృష్టించారు. అలాంటి మహిళా సంఘసంస్మర్తల్లో ప్రముఖురాలు దరిశి అన్నపూర్ణమ్మ (1907-1931). సంఘసంస్కర ణొద్యమంలోనూ, మహిళోద్యమంలోనూ అన్నపూర్ణమ్మ పోషించిన పాత్రను, ఆమె రచనల్నీ పాఠకులకు పరిచయం చెయ్యడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.

గదర్‌పార్టీ సంస్థాపకుల్లో ప్రముఖుడైన దరిశి చెంచయ్య మొదటి భార్య అయిన అన్నపూర్ణమ్మ 1907వ సంవత్సరంలో బళ్ళారిలో జన్మించింది. ఆమెతల్లి సంస్కరణ దృక్పథం కలది. తన రెండవ కుమార్తెను రజస్వల అయ్యేంతవరకు ఆపి, మదనపల్లె కళాశాలలో చదివించింది. అన్నపూర్ణమ్మను సంస్మరణభావాలుకల చెంచయ్యకిచ్చి వివాహం చేసింది. “వైశ్వకులములో రజస్వలానంతర వివాహమును ప్రారంభించింది అన్నపూర్ణమ్మగారి తల్లియేననుట సత్యదూరమని పించుకొనజాలదు” అని 1.1. 1932నాటి “గృహలక్ష్మి” (స్త్రీల పత్రిక) ప్రశంసించింది. అన్నపూర్ణమ్మ బళ్ళారి కాన్వెంటులోను, తిరువళిక్మేణి బాలికల టైనింగ్‌ కాలేజీలోనూ, గుంటూరులోని శారదా నికేతనంలోనూ విద్యాభ్యాసం చేసింది. 15 సంవత్సరాల వయస్సులో దరిశి చెంచయ్యను వివాహమాడింది. బాల్యవివాహాలు విస్త్రృతంగా ప్రాచుర్యంలో ఉండిన నాటి పరిస్థితులదృష్ట్యా అన్నపూర్ణమ్మ ఆలస్యంగానే పెళ్ళి చేసుకొందని చెప్పుకోవాలి.

అన్నమార్ణమ్మ మొదటినుండీ సంస్కరణభావాలు కలదైనప్పటికీ, పెళ్ళి తర్వాత వాటికి మరింత సానబెట్టి తనవంతు ప్రోత్సాహమందించారు చెంచయ్య. అన్నపూర్ణమ్మ 1920లో జరిగిన వితంతు పునర్వివాహోద్యమం దరిశి చెంచయ్య నడిపిందే. భర్తతో కలిసి అన్నపూర్ణమ్మ వైశ్య బ్రాహ్మణ, కమ్మ, విశ్వబాహ్మణ మొదలైన కులాల్లో మొత్తం 18 వితంతు పునర్వివాహాల్ని జరిపించింది. 19వ శతాబ్దంలో ఏ విధంగా కందుకూరి వీరేశలింగం -రాజ్యలక్ష్మమ్మలు వితంతు పునర్వివాహోద్యమానికి వెన్నెముకగా నిలిచారో అదేవిధంగా 1920ల్లో దరిశి చెంచయ్య -అన్నపూర్ణమ్మలు వెన్నెముకగా ఉండినారు. “మా ఇంట్లో (వితంతువులైన) వధువులెందరో వుంటూండేవారు. నాభార్య అన్నపూర్ణమ్మ వారినెంతో ప్రేమగా చూచుకొనేది. ఇలాంటి సంఘసేవ చేయాలనే ఆశతోనే ఆమె నన్ను వివాహం చేసుకొన్నది. సంఘసంస్మరణొద్యమాలంటే ఆమెకెంతో సంతోషం. వధువులతో ఆమె చాలా చనువుగా వుండేది. వారు వరుసలతో పిలుచుకొనేవారు.... భార్యల సహాయం లేనిదే స్త్రీల ఉద్యమాలను పురుషులమెంత శ్రమపడినా జయప్రదం చెయ్యలేము. నా ప్రథమ భార్య అన్నపూర్ణమ్మకు స్తీ ఉద్యమాలయందు ఎంతో ఉత్సాహముండేది. ఎందరో స్రీలు మా యింట్లో ఉండేవారు. వారందరిని ప్రేమతో ఆవరించేది అన్నపూర్ణ. వారు అన్నపూర్ణమ్మను ఎంతో ప్రేమించేవారు. జయాపజయాలు, ఫలితాలు మా యిద్దరివీని. ("నేనూ నాదేశం,”పు. 231-238). ఒకరకంగా అన్నపూర్ణమ్మ వితంతు పునర్వివాహోద్యమానికి తన జీవితాన్ని బలి పెట్టిందని చెప్పవచ్చు. 1931 నవంబరులో బందరులో ఒక వితంతు పునర్వివాహాన్ని నిర్వహించి వచ్చిన తర్వాత తీవ్రంగా అనారోగ్యానికి గురై నవంబరు 28న పాతిక సంవత్సరాల పిన్న వయస్సులోనే అన్నపూర్ణమ్మ చనిపోయింది.

అన్నపూర్ణమ్మ అభిప్రాయంలో వితంతువులకు పునర్వివాహం మాత్రమే పరిష్కారం కాదు విద్యకూడా చాలా అవసరం. అందుకే 12 మంది వితంతువులను విద్వార్దన దిశగా ప్రోత్సహించింది. వారికోసం ఉపకారవేతనాల్ని యేర్పాటు చేసింది. ఈ విధంగా వితంతువుల విద్యాభివృద్ధికి తోడ్పడింది. అమె 'పోత్సాహాన్నందుకున్న అనేకమంది వితంతువులు విద్వావంతులై జీవితాల్లో స్థిరపడ్డారు. 1927-1928 ప్రాంతంలో ఒకరోజు తన స్నేహితురాలు తుర్లపాటి రాజేశ్వరమ్మతో కలిసి విజయవాడలో రైవన్‌ కాలువగట్టున షికారుకెళ్ళింది అన్నపూర్ణమ్మ. ఎవరో వితంతువు శిశువును కని గొంతునులిమి పారవేయగా కాకులు పొడుచుకు తింటూండటం చూచిన యిద్దరూ ఏడుస్తూ యింటికొచ్చారు. ఈ విషయమై ఏదైనా చేయాలని దరిశి చెంచయ్యతో కలిసి ఆలోచించి " వితంతు శరణాలయాన్ని” స్థాపించారు. ఇందులో అన్నపూర్ణమ్మ కార్యనిర్వాహక సంఘ సభ్యురాలుగా పనిచేసింది. “ఆంధ్రపత్రిక " ఈ శరణాలయం గూర్చి బాగా ప్రచారం చేయడంతో అనేకమంది గర్భిణులైన వితంతువులు అక్కడికి రావడం మొదలుపెట్టారు; వీడ్ణల్ని కని అక్కడ వదిలి వెళ్ళేవారు. అలా సుమారు 60 మందికి ఆ శరణాలయం

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

29