ద్వీపంలోని ట్రింకోమలిలో పుట్టింది. జావా దండయాత్ర అనంతరం భార్యతో భారత దేశానికి వచ్చాడు. 1815 నాటికి భారత దేశానికి సర్వేయర్ జనరల్ గా పదోన్నతి పొందాడు. అనంతరం 1817 నాటికి కలకత్తా చేరాడు. చివరికి 1821 మే 8న కలకత్తాలోనే 68వయేట తుది శ్వాస విడిచాడు. సౌత్ పార్క్ సిమెట్రీలో ఆయన సమాధి నేటికీ ఉంది. 1783 సెష్టెంబర్ 23న భారతదేశంలో అడుగు పెట్టిన తర్వాత తిరిగి తన మాతృదేశం వెళ్ళలేదు. జీవితమంతా భారతదేశానికే త్యాగం చేసిన మహాఘనుడు మెకంజీ. మెకంజీ సేకరించిన సంకలనాలు మెకంజీ సేకరించిన గ్రంధాలు, స్థానిక చరిత్రలు, శాసనాలు, నాణాలు, శిల్పాలు మొదలయిన అపురూప సంపదను సేకరించి భద్రపరిచాడు. ఆయన సేకరించిన వాటిల్లో 14 భాషల్లో 16 లిపులలో ఉన్న 1568 గ్రంథాలు, 264 సంపుటాల్లో ఎక్కించిన 2070 స్థానిక చరిత్రలు, 77 సంపుటాల్లో సంకలనం చేసిన 8076 శాసనాలు, 6218 ప్రాచీన నాణాలు, 2630 శిల్పాలు, కొన్ని చిత్రాలు, 106 విగ్రహాలు, 79 పురాతన భవన రూపాలు 40 పురాతన శిధిలావశేషాలు మొదలయిన వాటిని భద్రపరిచాడు. మెకంజీ రాసిన అతికొద్ది వ్యాసాలు మాత్రమే లభిస్తున్నాయి. వీటిల్లో శ్రీశైలంలోని ఆలయ విశేషాలు, అమరావతి స్తూప వివరాలు, దక్షిణ భారతదేశంలోని జైన, బౌద్ద స్థానాలు, ఆనెగొంది రాజుల చరిత్ర చెప్పుకోదగిన వాటిల్లో ఉన్నాయి.
మెకంజీ జీవించివున్న కాలంలోనే తన స్వగ్రామమైన స్టోర్షవే గ్రామంలో తన ఇల్లు పునర్నిర్మించడం కోసం కొంత డబ్బు పంపాడు. మెకంజీ చెల్లి మేరీ అన్నయ్య మరణానంతరం ఆయన విల్లు ద్వారా వచ్చిన డబ్బుతో “ఐ” అనే ప్రదేశం దగ్గరే ఉన్న సెయింట్ కొలంబా చర్చ్ సమీపంలో ఒకస్మారక భవనం కట్టించింది. అక్కడ కొన్ని అపురూపమైన శిల్పాలు, శాసనాలు స్టానిక చరిత్రలు భద్రం చేసింది. ఈ వివరాలన్నీ ఆరుద్ర స్వయంగా 1983లో చూసి వచ్చి ఛాయచిత్రాలు సమగ్రాంధ్ర సాహిత్యంలో ప్రచురించాడు.
మెకంజీ సంకలనాలు, సేకరణ, గ్రామ చరిత్రల తయారి మొదలయిన వివరాలు సేకరించిన తెలుగు పండితులు కావలి వెంకట బొర్రయ్య, కావలి లక్ష్మయ్య వివరాలు తరువాత సంచికలో.
17న పుట తరువాయి....... ఆంగ్ల విద్య
ఏ దృష్టితో చూసినా, ఏవైపు నుంచి చూసినా మన భావాలకు, భాషకు మన జీవితానికి మధ్య పరస్పర సమానత లేదన్న విషయం వాస్తవం. యీ మూడింటిని సంఘటితం చేయటానికి మనం నోచుకోలేదు. వెనకటికి ఒక కథలో ఒక బికారి వుండేవాడు. వాడు చలి కాలంలో బిచ్చమెత్తి వస్త్రాలు కొనుక్మోగలిగే సమయానికి ఎండాకాలం వచ్చేసేదట. అలాగే ఎండాకాలంలో పలచని వస్త్రాలు కొనుక్కునే తాహతు వచ్చేనరికి చలికాలం వచ్చేసేది. ఏదో దేవత వాడి దీనావస్థకు దయతలచి వరమివ్వబొతే అతడు ఈ విధంగా అడిగాడు: “నాకు మరేమీ అక్కర్లేదు. యీ తారుమారు అంతం చెయ్యి. ఎండల్లో చలి దుస్తులు, చలికాలంలో వేసవి దుస్తులు తొడుక్కుంటున్నాను. యీ గందరగోళం నుంచి తప్పించావంటే ధన్యుడిని.”
నేను కూడా భగవంతుడినీ యిదే ప్రార్థిస్తున్నాను. భాషకు, భావానికి మధ్య యీ విభేదం తొలగిపోతే మనం ధన్యులమవుతాం. మనకు చలిలో వేడిని కలిగించే దుస్తులు, వేసవిలో చల్లని దుస్తులు లభించటం లేదు. యిదే మన దరిద్రానికంతటికీ మూలకారణం. అందువల్లనే మనం నిరాదరణ అనే గోతిలో పడి కొట్టుకుంటున్నాం. లేకపోతే మనకు ఏవస్తువుకు లోటుంది? “అకలితోపాటు అన్నం, చలితోపాటు వస్త్రం, భాషతోపాటు భావం, విద్యతో పాటు జీవితం ఒకేచోట కలగచేయమని, ఒక దానితో ఒకటి కలపమని' భగవంతుడిని వరమడుగుతున్నాను.
నీటిలో వుండీ చేపకు దాహం తీరలేదు అన్నట్టు ఉంది మన పరిస్థితి. యిది విని ఎవ్వరికీ నవ్వు రాకుండా ఉండదు. మనవద్ద నీరు వుంది కానీ మనం దాహంతో కొట్టుకుంటున్నాం, యిది చూసి లోకం నవ్వుతోంది కానీ మన కళ్ళనుండి కన్నీళ్ళు కారుతున్నాయి. నీటి దగ్గర వుండీ నీటికి నోచుకోలేదు, అవి తాగి మన దాహం తీర్చుకోలేకపోతున్నాం. ———————————————————————————————————————————————————————————————————————————————————————————————————— “మంచి పుస్తకం” సంస్ధ ప్రచురించిన 'విద్య ' అనే పుస్తకంలో గల నాలుగు వ్యాసాలలో ఇది ఒకటి. నాలుగూ రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలే. విద్యకు సంబంధించి రవీంద్రనాథ్ ఠాగూర్ వెల్లడించిన అభిప్రాయాలు ఎంతో పాతవైనా, అప్పటికంటె ఇప్పుడవి మనకు మార్గదర్శకాలుగానే ఉన్నాయి. “ఇంగ్లీషులో భాషాబోధన ఉండాలా వద్దా అనే జటిలమైన ముడి” విప్పటానికి రవీంద్రనాథ్ టాగూర్ ఆలోచనలు ఒకింత తోడ్పడగలవన్న నమ్మకంతో దీన్ని ప్రచురించినట్లు ప్రచురణకర్త పేర్ళొన్నారు. ఈ వ్యాసాన్ని 'అమ్మనుడి'లో ప్రచురణకు అనుమతించినంధుకు వారికి ధన్యవాదాలు -సం.
త్వరలో పుస్తకంగా వెలువడుతుంది
14 నెలల పాటు అమ్మనుడి పత్రికలో ధారావాహికగా మీరు చదివిన నవల త్వరలో పుస్తకంగా వెలువడనుంది. కావలసినవారు అమ్మనుడి పత్రికను సంప్రదించండి. ఫోన్లు: 98480 16136, 94929 80244
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021
28