పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోరిక కలిగింది. ఇది యిలా ఉండగా ఉద్యోగ రీత్యా మెకంజీ పటాలంతో కలిసి వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడేది. దీనికి తోడు కుంఫిణీ వారు కొత్తగా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలు సర్వే చేసి దానిపై ఒక నివేదిక తయారుచేసే బాధ్యతకూడా మెకంజీ పై పడింది. ఇది మంచి అవకాశంగా భావించి తన సత్తా నిరూపించుకున్నాడు. నెల్లూరు నుంచి ఒంగోలు, పదమటి కనుమలకు మార్గాలు సర్వే చేస్తున్న సమయంలో స్థానికులను కలిసి విషయ సేకరణ ప్రారంభించాడు. అక్కద చినబళ్ళ ఫకీరు చెప్పిన కంభం కైఫీయతు రాసుకున్నాడు. నెల్లూరు పే మాస్టర్‌ కచేరిలో ఉండే కాగితాలన్నీ చదివి హైదరు చరిత్రను సమకూర్చుకున్నాడు. గుంటూరు సర్మారును స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ ప్రాంతాలన్నీ సర్వే చేసి సమగ్రంగా ఆ చరిత్రలను సేకరించాడు. ఇవన్నీ ఆ తన స్వంత ఖర్భ్బులతోనే కొనసాగించాడు. 1783లో దిండిగల్లు కోయంబత్తూరులలో సైన్య విభాగంలో ఇంజీనీరుగా పనిచేశాడు. ఆ తరువాత నుంచి 1790 వరకూ కంపెనీ వారి స్థానిక సుల్తానుతో జరిగిన యుద్దాలలోనే నెల్లూరు నుంచి తూర్పు కనుమల ద్వారా రాయలసీమ ప్రాంతాలకు, ఒంగోలుకూ రహదారి మార్దాలద్వారా నమూనాలతో దేశ పటాలాలను తయారు చేశాడు. మెకంజీ శక్తి సామర్థ్యాలను గుర్తించిన అధికారులు 1790లో గుంటూరు సీమను సర్వే చేయడానికి అనుమతి యిచ్చారు. మెకంజీకి ఈ సర్వే ఎంతో ఆనందాన్నిచ్చింది. ఐతే అది ఎంతోకాలం నిలవలేదు. 1792లో శ్రీరంగ పట్టణం కోట ముట్టడి సందర్భంలో టిప్పుసుల్తానుతో జరిగిన యుద్దంలో ఆనాటి రాజప్రతినిధి కారన్‌ వాలిస్‌ నేతృత్వంలో పనిచేయవలసి వచ్చింది. ఆ తర్వాత మెకంజీ ఏలూరుకు బదిలీ అయ్యాడు. రాయలసీమ, నెల్లూరు, గుంటూరు సీమలను సర్వే చేసి పట్టణాలు రహదార్లు నదులు చూపే నైసర్గిక పటాలను తయారు చేశాడు. దీనికి తోడు సూరు ప్రాంత పరిధిని నిర్గేశిస్తూ కొలతలు తీయించే పనికూడా చేపట్టాడు. ఈ కాలంలోనే త్రిభుజాలద్వారా సర్వే చేసే విధానం (Triangulation)తో పాటు topographical surey of Mysore నికూడా ప్రారంభించాడని Surey of India ol.IX Title Sheet లో స్పష్టంగా ఉంది. మొదటగా దక్కన్‌ ప్రాంతానికి సర్వే జరగటమే కాకుండా రాయలసీమ, నెల్లూరు, గుంటూరు నైసర్గిక పటాలు కూడా తయారు చేశాడు. పై అధికారులు మెకంజీ చేస్తున్న కృషిని గుర్తించి 1788 మే 16వ తేదిన ఇంజనీరింగ్‌ శాఖలో ద్వితీయ సహాయ అధికారిగా (Second Lieutenant) పదోన్నతి కలిగించారు. ఆపై 1789కే సేనాని(కల్నల్ )గా ఉద్యోగోన్నతి పొందాడు. ఆ తరువాత మద్రాసు, నెల్లూరు, గుంటూరులో పనిచేశాడు. ఈలోగా మైసూరు ముట్టడిలో నందిదుర్గం, సావంత దుర్గం ఆక్రమించడంలోనూ, శ్రీరంగ పట్టణం యుద్దంలో పాల్గొని తన ప్రావీణ్యం, శక్తియుక్తులన్నీ ప్రయోగించి గెలుపు గుర్రానెక్కాడు. దీనివల్ల పై అధికారుల మెప్పు, ప్రశంశ పొంది పై స్థాయికి ఎదిగే అవకాశం కలిగింది. ఇక్కడో విషయం ప్రస్తావించాలి. ఈ పర్యటనల్లో కూడా తన సేకరణ అయిన స్థానిక చరిత్రలు, ఆయా మార్దాల సర్వేలు, స్థానిక పటాలు తయారు చేయడం మాత్రం ఆపలేదు. కల్నల్‌ గా నియమితుడయాక మెకంజీ కడప, కర్నూలు జిల్లాల్లో పర్యటించాడు. కృష్ణానది పరిసర ప్రాంతాలు నల్లమల శ్రేణులు సర్వే చేశాడు. ఈకాలంలోనే అమరావతి శిల్పసంవదను గూర్చిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రస్తావించాడు. అమరావతి 17వ శతాబ్లాంతంలో మాగల్లు సీమలో రూపెత్తి జ్ఞాతుల రాజ్యాలయిన రాఘవపురం, చింతలపాడు జమీలు కలిసి విస్తరించిన వాసిరెడ్డివారి సంస్థానంలో వెయ్యిగ్రామాలుండేవి. ఆనాటి పేష్మషు (పన్ను ద్వారా వచ్చే ఆదాయం) ఏడు లక్షల పైచిలుకు. 1802లో వాసిరెడ్డి వెంకటాద్రి నాయని పేర మనోవర్తి ఉండేది. పేష్మషు బకాయికింద 1846-49లో కొనుగోలు చేయబడింది. ఆ పై వారికి భరణం కూడా యిచ్చారు.

వీరి మూలపురుషుడు సదాశివయ్య. ఈయన అసాధ్యమైన సాహస కార్యాలు చేసినందువల్ల రెడ్డి రాజుల మొప్పుపొంది వాసిగాంచి వాసిరెడ్డి అనే పౌరుష నామం ఏర్పడిందని ఆచార్వ తూమాటి దొణప్ప ఆంధ్ర సంస్థానములు సాహిత్య ఫోషణములో వివరించారు.

వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తన భవన నిర్మాణానికి దీపాల దిన్నెఅనే దిబ్బను తవ్వించి నాపరాళ్ళనూ, బండరాళ్ళను ఉపయోగించాడు. ఆనాటి చెక్కడపురాళ్ళను పరిసరాల ప్రజలు పెరట్లో మెట్టుగాను, సరిహద్దు రాళ్ళుగా, బట్టలుతికే బండలుగా ఉపయోగించారు. ఆనాటి శిల్చ సంపదను గుర్తించిన మెకంజీ 1796లో అమరావతి శిల్ప సంపదను గుర్తించి దుర్వినియోగం కాకుండా భద్రపరిచాడు. అవి ప్రపంచ దేశాలకు తరలి వెళ్లాయి. మనకు అతి కొద్దిగా ఉన్నవి మ్యూజియంలో లభిస్తున్నాయి. ఆపై 1792 నుంచి 1799 వరకూ హైదరాబాదు ఇంజనీర్ల విభాగానికి అధిపతిగా నియమితుడయ్యాడు. ఈ కాలంలోనే నిజాము రాజ్యాల భూగోళ పట రచన ప్రారంభించాడు. ఈ సమయం లోనే ఖనిజాల గురించి, వజ్రాల గురించి వివరాలు సేకరించాడు. విలువైన గనులు ఎక్కడున్నాయో వాటి వివరాలు సమగ్రంగా తెలుసుకున్నాడు. ఎక్కడ ఏ వివరాలు సేకరించినా తనతోపాటు భారతీయ పండితులను స్థానిక పండితుల సహాయం స్వీకరించాడు. భారతదేశ చరిత్రకు కావలసిన సామాగ్రిని, దక్కను పీఠభూమి ప్రాంతాల్లో సేకరించవచ్చనే నిర్ణయానికి వచ్చాడు. ఖమ్మం కర్నూలు ప్రాంతాలు పర్యటించినప్పుడు తాను తయారు చేసుక్ను దినచర్య ఆధారంగా పెన్న కృష్ణ మధ్య ప్రాంతం, సరిహద్దులు, కనుమల సర్వే అని రాసుకున్నాడు. 1799లో శ్రీరంగ పట్టణం ముట్టడి జరిగి, టిప్పుసుల్తాన్‌ మరణించిన తర్వాత మైసూరు రాజ్యం నుంచి లభించిన ప్రాంతాల సర్వేలకు మెకంజీ అధికారికంగా నియమితుడయ్యాడు. 1809 నాటికి మద్రాసు రాజధాని సర్వేయర్‌ జనరల్‌గా నియమితుడయినప్పుడు దత్తమండల సర్వే నిర్వహించాడు. అనంతరం 1811లో జావా సాహస యాత్రలో చేరాడు. జావా ద్వీపం దండయాత్రలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది. మెకంజీ అరవయ్యో సంవత్సరం జావాలో పెట్రోనెల్లాజోకి మీనా బారెల్స్‌ అనే డచ్‌ వనితను పెళ్ళి చేసుకున్నాడు. ఈమె సింహళ

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

27