పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ళాల పదని

(గత సంచిక తరువాయి...)

-వాచస్పతి బనకళ

16/0) ర౦౦౧౫౧|౬ 2౯౫ 107602

నూతన పదాల నిష్పాదనకి మాండలికాల వితరణ

18. ఆంగ్లపదాలకి తెలుగు సమానార్థకాల్ని రూపొందించే 'కమంలో మనం సంస్కృతం మీద హెచ్చుగా ఆధారపడుతూ వస్తున్నాం. దీనికొక కారణం మన సాంస్కృతిక వారసత్వం కాగా, ఇంకో కారణం - మన- అంటే విద్యావంతుల బౌద్దిక వాతావరణం దేశి (గ్రామీణ) ప్రజానీకంతో సంబంధాలు కోల్పోయి ఉండడం. మనం ఉండేది నగరాల్లో/ అథవా పట్టణాల్లో ! మనం చదివేది/ మాట్లాదేది ఇంగ్లీషు లేదా ప్రామాణిక (శిష్టవ్యావహారిక) తెలుగు మాండలికం లేకపోతే ఇటు ఆంధ్రవూ, అటు ఆంగృవవూ కానటూవంటి ఒక సంకర తెంగ్లీషు. తద్ద్వారా మనం చాలా కృతక (ఇ/11%6%0) వ్యక్తులుగా మారిపోయాం .

పల్లెపట్లలో చాలా ముచ్చటైన దేశిపదాలు వాడుకలో ఉన్నాయి. వాటిల్లో చాలావణకు ఇంగ్లీషు పదాలకి సమాధానం చెప్పగలవే. అయితే మనకి అవి తెలియకపోవడం. గ్రామీణులకేమో- అవి మనకి, అంటే పదనిష్పావదకులకి అవసరమని తెలియకపోవడం, ఈ కారణాల వల్ల పరస్పర సమాచారలోపం (00౧౧4౧1౦౫0 ్ర్ర&) తీవరించి మనం క్రమంగా అసలైన తెలుక్కి దూరంగా, సుదూరంగా జజీగిపోతున్నాం. “ఇంగ్లీషు పదాలే 0॥01%8, తెలుగు పదాలంటే మక్కికి మక్కి అనువాదాలు (౧/46 1/2091410%), తెలుగంటే సంస్కృతం” అనే అభిప్రాయంలో పడి ఊగిసలాదుతున్నాం. కొన్నిసార్లు కొత్త పదాల్ని నీష్పాదించినవారే వాటిని వాదని పరిస్థితి కూడా లేకపోలేదు.

మాండలికాలు లేకుందా తెలుగు పరిపూర్ణం కాదు. ఆ పదాల్ని ఆయా జిల్లాలకీ, తాలూకాలకీ వరిమితం చెయ్యకుండా శివ్చ్ళవ్యావవోారికంలోకి, సాపాత్య చధాన(న వంతిలోకి తీసుకురాగలిగితే, అందరికీ వాటి వాడుకనీ అలవాటు చెయ్యగలిగితే భాషకి మహోపకారం జరుగుతుంది. అనువాదాలు చేసేటప్పుడు గానీ, నమానార్ధ కాల్ని రూపొందించేటమ్బడు గానీ వున ఖావదారిద్యమూ, పదదారిదబ్యమూ వదిలిపోతాయి. అంతకంటే ముఖ్యంగా సమర్థకాలకి కృత్రిమత్వదవోషం నీవారించబడి సహజ తెలుగుతనపు పరిమళాలు గుబాళిస్తాయి. మూర్త నామవాచశాల్ని (14/46/14 106౧౪) నీ అమూర్త నామవాచకాలు (4091/201010609) గా పరివర్తించడం ద్వారా చాలా బౌద్ధిక పదజాలాన్ని (1౧19॥60- 148 ౪౦౦40౪140౧ నీష్పాదించవచ్చు. ఇందునీమిత్తం మనకి వ్యవసాయంతో సహో వివిధ గ్రామీణ వృత్తుల పదజాలాలు సహకరిస్తాయి. వాటిల్లో కొన్ని ఇప్పటికే సాహిత్యభాషలోకి ప్రవేశించాయి. అవి అలా ఇంకా ఇంకా ప్రవేశించాలనీ సాహిత్యానీకీ, 'ప్రజలకీ మధ్య ఏర్పడిన తెంపు (4190010609 రద్దు కావాలని ఆశిస్తున్నాను. ఉదా:

మళజో ఉదాహరణ - తూర్పుగోదావరి జిల్లాలో కొన్నీ ప్రాంతాల్లో వాడే “కిట్టింప్పు” అనే పదాన్ని తీసుకుందాం. లెక్కలో వచ్చే హెచ్చుతగ్గుల్ని సరిపెట్టదానికి ఈ పదాన్ని వాడతారు. ఇది ప్రధానంగా బళ్ళలోను ట్యూషన్లలోను వినపడే పదం. ఎలాగైనా సరే ఇ౪4/6/ వచ్చేలా చెయ్యడమన్నమాట. ఇది సానుకూలార్థం (009106 ౧౧౪౬౧-

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఉ ఫిబ్రవరి-2021 |

1౧8) లో వాదే పదం మాత్రం కాదు. ఇది కిట్టింపు ఎందుకయిందంటే కిట్టు = సరిపోవు

కిట్టుబాటు = గిట్టుబాటు

కిట్టించు = సరిపోయేలా చేయు ఈ రకమైన కిట్టింవు (౧4౧|061410% 6 20006119) నీ మనం సత్యం కంపెనీ కుంభకోణంలో గమనించాం. మన పాత్రికేయులెవజ్రైనా ఈ పదం వాడతారేమోనని చూశాను. ఎక్కడా కనీపించలేదు. దాన్ని బట్టి చూస్తే మనం (ఆలో చనాపరులం) ప్రజలకి నేర్పాల్సినదాని కన్నా వారినుంచి నేర్చుకోవాల్సిందే ఎక్కువ ఉందనీపిస్తోంది. సంస్కృతం మీద అతి-అధారపాటు (0౪/6-6606% 66౧06)

19. మన పదాల చరిత్ర ఇప్పటిదాకా ఎలా ఉందో టూకీగా సమీక్షించుకుందాం. ఇంగ్లీషు పదాలకి ప్రతిగా మనం ఇలా అనేక సంస్కృత శబ్టాలతో, సమాసాలతో తెలుగుని నింపేయడం, అవి జనానీకి నోరు తిరక్క్మపోవడం, పైగా అవి ఆదాన అనువాదాలు (10%) 1209314009) అనే దృష్టితో వాటిని ప్రజలు చిన్నచూపు చూడ్డం, చులకనగా మాట్లాడ్డం, వాళ్ళు ఆదరించడం లేదనీ మనం బాధపడడం తఅచయింది. దాని బదులు ముచ్చటైన, పలకడానికి సులభమైన, తక్కువ అక్షరాలు గలిగిన తెలుగు ప్రత్యామ్నాయాలు దొరికినప్పుడు వాటినే వాడడం మంచిది. సంస్కృతపదాల కంటే అవి త్వరగా ప్రచారంలోకి వస్తాయి. సంస్కృతపదాల్ని విచ్చలవిడిగా తెలుగులోకి దిగవేయడం (64౧01౧9) లో ఉన్న ఇబ్బందుల గుటించి కాస్త తెలుసుకుందాం.

1. చాలా సందర్భాల్లో ఇలా దిగవేయబడదే పదాలు అర్ధరీత్వా తెలుగుపదాల కంటే గొప్పవి కావు.

2. కానీ వాటికివ్వబదే అనవసరమైన గౌరవం వల్ల అవి తెలుగు పదాల్నీ నీచపణుస్తాయి (66౧౪8౫౫1౧8). అంటే అవి తెలుగులోకి వచ్చినాక వాటి తెలుగు నమార్ధకాల్ని నీచార్థంలో వొాడడఠ6 మొదలుపెడతారు పండితులు. వాళ్ళని చూసి పామరులు కూడా తెలుగుపదాల్ని నీచార్థానికే వరిమితం చేస్తారు. ఉదాహరణకి 'క్రిందిపదాల్ని గమనించండి.

మట్టి = మృత్తిక

చచ్చిపోయారు = మరణించారు

కంసాలి = విశ్వకర్మ

కంపు = వాసన

బడి = పాఠశాల ఊరు = పట్టణం చెట్టు = వ్బక్షం

ఇలా ఎన్నైనా చెప్పొచ్చు. కనుక ఇలా దిగవేయడం తెలుగు (ప్రాధాన్యాన్ని తగ్గించడమే బెకుంది తప్ప అభివృద్ది చెయ్యడం అవ్వదు. 3. దిగవేసిన ప్రతి సంస్కృత పదంతోపాటు అనేక సంస్కృత ప్రత్యయాల్ని ఉపసర్గల్ని కూడా దిగవేయాల్సి వస్తుంది. ప్రత్యయాలూ, ఉపసర్గలూ మన తెలుగువాళ్ళకి తెలిసినవి కావు. వాటి అర్జమూ తెలియదు, వాటినీ ఎక్కడ ఎలా అతకాలో కూడా వాళ్ళకి తెలియదు.