పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“మచ్చుకు ఈ కొద్దిమాటలను చెప్పినాను. మన అక్కరలకు కావలసినన్ని అనిమి మాటలను ఈ 'అరం "తో పుట్టించుకోవచ్చు” అని ముగించినాను.

“నాకొక అరగలి(సందేహం) అన్నయ్యా, కొంగొత్త పనులకు “అరం” చేర్చుతో తెలుగుమాటలను పుట్టించినాం కదా, ఆ పనులతో పాటు పనులను చేసేవారికి కూడా తెలుగుమాటలు ఉండాలి కదా, ఎందుకంటే, నువ్వు డైవింగ్‌ కు తోలరం అన్నావు. ఆమాటకు తెలివరులు పేరు పెట్టలేదు కానీ, డ్రైవర్ 'కు “చోదకుడు” అని పేరును పెట్టున్నారు మన నుడివరులు” నారాయణను ఓరకంట చూస్తూ అన్నాడు చిన్నయ్య.

చిన్నయ్య మాటలకు నారాయణ నవ్వుతూ, “చిన్నయ్యా, ఇప్పుడిక నీ మాటలకు నేనేమీ ఉడుక్కొనులే” అని చిన్నయ్యతో అని, నావైపు చూసి, “అన్నయ్యా, కుమ్మరం చేసేవాడు కుమ్మరి, మేదరం చేసేవాడు మేదరి, కమ్మరం చేసేవాడు కమ్మరి కదా. ఈ మాటల్లోని “అరి ఇక్కడ చేర్పు అవుతుంది కదా” అన్నాడు.

నాకు ఎంతో ఎలమి (సంతోషం) కలిగింది. “నువ్వు సరిగ్గా తలపోస్తున్నావు నారాయణా. '“అరితో కాత్త మాటలను పుట్టిద్దాం పట్లు” అన్నాను. ముగ్గురమూ కలిసి ఓ పట్టు పట్టినాం.

1. తోలు + అరి = తోలరి డ్రైవర్‌
2. నడుపు + అరి = నదుపరి కండక్టర్‌
౩. తోము + అరి = తోమరి క్లీనర్‌
4. విరుగు + అరి = విరుగరి డాక్టర్‌ విరుగు అంటే చికిత్స.
5 మర + అరి = మరవరి ఇంజనీర్‌ మర అంటే ఇంజిన్‌.
6 వళుకు + అరి = వళుకరి అడ్వొకేట్‌
7 తీర్చు +అరి = తీర్చరి జడ్జ్‌
8 తోడు +అరి = తోడరి హెల్పర్‌
9 నీటి +అరి = నీటరి ప్లంబర్‌
10. పొందు + అరి = పొందరి కన్యామర్ పొందేవాడు. గ్రాహకుడు అని వాడుతున్నారు.
11. ఈవి + అరి = ఈవరి సబ్‌పై సైబర్‌ ఇచ్చేవాడు చందాదారుడు అని వాడుతున్నారు.
12. మిను + అరి = మిన్నరి ఎలక్ట్రీషియన్‌
13. పసను + అరి = పసనరి పెయింటర్‌
14 పాట +అరి = పాటరి సింగర్‌ గాయకుడు అంటున్నారు.
15. ఆట + అరి = ఆటరి స్పోర్ట్స్‌మేన్‌ క్రీడాకారుడు అంటున్నారు.
16. ఈదు + అరి = ఈదరి స్విమ్మర్‌
17. పరుగు + అరి = పరుగరి రన్నర్‌
18. ఉరుకు + అరి = ఉరుకరి రేసర్‌
19. పొల్లు + అరి = పొల్లరి టైలర్‌
20. ఉడిగం + అరి = ఉడిగరి సర్వర్‌
21. జరుపు + అరి = జరుపరి మేనేజర్‌
22. చేత + అరి = చేతరి సెక్రెటరీ
23. ఉబుసు + అరి = ఉబుసరి మెసెంజర్‌ ఉబుసు అంటే మెసేజ్‌
24 కరపు + అరి = కరపరి టీచర్‌ ఉపాద్యాయుడు అంటున్నారు.
25. చదువు + అరి = చదువరి రీడర్‌ పాటకుడు అంటున్నారు.
26. కూర్చు + అరి = కూర్పరి ఎడిటర్‌ సంపాదకుడు అంటున్నారు.
27. చనవు + అరి = చనవరి ఆఫీసర్‌ చనవు అంటే అదికారం. అదికారి అంటున్నారు.
28. మార్చు + అరి = మార్చరి ట్రాన్స్‌లేటర్‌
29. కనుగాపు+ అరి = కనుగాపరి సూపర్‌వైజర్‌ పర్యవేక్షకుడు అంటున్నారు.
30. తిరుగు + అరి = తిరుగరి టూరిస్ట్‌ పర్యాటకుడు అంటున్నారు.
31. అనుపు + అరి = అనుపరి కలెక్టర్‌ అనుపు అంటే పన్ను (టాక్స్‌). పన్నులను కలెక్ట్‌ చేసేవాడు. కరగ్రాహి అనే
పేరును పెట్టినారు.
32. అలము + అరి = అలమరి సంచారి అలము అంటే తిరగడం. ఈ మాట చిన్నమార్పుతో అలబరిగా నెల్లూరు తావున :వాడుతున్నారు.
33. దొమ్ము + అరి = దొమ్మరి యోదుడు దొమ్ము అంటే కొట్లాట లేదా పోరాటం.
34. మాటాట+ అరి = మాటాటరి. లెక్చరర్‌ మాటాట అంటే ప్రసంగం లేదా లెక్చర్‌. ఉపన్యాసకుడు అంటున్నారు.
35. పలుకు + అరి = పలుకరి స్టూడెంట్‌ పలుకు అంటే విద్య. విద్వార్తి అంటున్నారు.

"చాలు చాలన్నయ్యా, అబ్బ ఎన్నిమాటలో” అరుదు(ఆశ్చర్యం)పడుతూ అన్నాడు చిన్నయ్య. “మన తెలుగునుడి చేవ అటువంటిది చిన్నయ్యా” అంటూ ముగించినాను నేను.(తరువాయి వచ్చే సంచికలో...)

భాషలు మసకబారినప్పుడు ప్రపంచ సాంస్కృతిక వైవిధ్యం కూడా మసకబారుతుంది.మనవైన అవకాశాలూ సంప్రదాయాలూ చారిత్రిక నైపథ్యం, మనకే సొంతమైన ప్రత్యేక ఆలోచనా సరళీ విలువైన మానవ వనరులూ కనుమరుగైపోతాయి. -యునెస్మో