పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుట్టించవచ్చు” అని విడమరచినాను.

“ఎందుకనో ఈ మాటలను నేను ఒప్పుకోలేకపోతున్నాను. మాట మొదటి వ్రాత(అక్షరం)ను తీసుకొని దానిని చేర్చు అనడం ఒప్పుదల కాదేమో” అన్నాడు నారాయణ.

“అవునవును, ఎందుకు ఒప్పుదల అవుతుంది? అన్నయ్య చెప్పింది తెలుగుమాటల గురించి కదా! అదే సంసుక్రుతం గురించి అయితే అన్నయ్యేమిటి, నేను చెప్పినా ఒప్పుదల అవుతుంది. “నీవు నేర్పిన చదుయే నీర్పుగంటి” అన్నట్లు, 'జన్మ 'లోని తొలిసడి అయిన 'జ 'ను తీనుకౌని సంనుక్రుతంలో మాటలను పుట్టించినట్లె తెలుగులోనూ చేసినాడు అన్నయ్య. ఇందులో తప్పిదం ఏముంది, ఒప్పుదల కానిది ఏముంది? తాను చేస్తే కాపురం, ఇంకాకర్తి చేస్తే రంకు అన్నదట వెనకటికి ఒకావిడ. అట్లాగుంది నువ్వు చెప్పేది” అని నారాయణను వెక్కసమాడినాడు చిన్నయ్య.

“చిన్నయ్యా ఎంత చక్కచేసినా కుక్కతోక వంకరే అన్నట్లు ఎంత చెప్పినా నీ తెలివి తేటగిల్లడం లేదు. నారాయణ మీద ఎందుకలా విరుచుకుపడుతావు” అని చిన్నయ్యను కసరినాను.

“కుట్టినమ్మ కుదురుగా ఉంది, అరిచినమ్మ తెరువుకెక్కింది అన్నట్లు, తెలుగునీ నిన్నూ అగడుగా మాట్లాడే నారాయణేమో మంచివాడు, నేనే చెడ్దవాడినయ్యాను” నొచ్చుకాంటూ అన్నాడు చిన్నయ్య.

“చిన్నయ్యా, నువ్వు కూడా నొచ్చుకొంటే ఎట్లా? కాత ఉండే మానుకే రాతిదెబ్బలు. నలుగురు మనల్ని తెగడుతున్నారంటే మన దగ్గర ఏదో సరుకు ఉండబట్టే కదా! మనం ఈ పూటకి ఇక ఎన్నువ మాటల్ని వక్కన పెట్టి ఎసిదిమాటలను గురించి ముచ్చటించుకొందాం సదేనా” అన్నాను. -

“చిన్నయ్యా, నన్ను మన్నించు. ఇదివరకటిలాగా కాదు, నేనూ కొంత మారినాను. ఇంకా మారుతాను. నాకు కూడా తెలుగంటే మక్కువే” వేడుకొంటున్నట్లుగా అన్నాడు నారాయణ. ఆ మాటతో చిన్నయ్య హాయిగా నవ్వేసినాడు.

“ఏదయినా ఒకమంచి చేర్చును గురించి చెప్పు అన్నయ్యా” అన్నాడు నారాయణ.

“చెపుతాను వినండి. “అరవ” అనే చేర్చు గురించి మాట్లాడుకొందాం. దీనిని “అరం” అని కూడా రాసుకోవచ్చు. ఈ

1 తోలు + అరం = తోలరం డ్రైవింగ్
2 నడుపు + అరం = నడుపరం కండక్టింగ్‌ నిర్వహణ అంటున్నారు.
౩ తోము + అరం = తోమరం క్లీనింగ్‌
4 మర + అరం = మరవరం ఇంజనీరింగ్‌
5. నీటి + అరం = నీటరం ష్లంబింగ్‌
6 మిను + అరం = మిన్నరం ఎలక్ట్రికల్‌ వర్క్‌
మిను అంటే ఎలక్షానిక్‌. మించు అంటే ఎలక్టిసిటీ.
7 పసను + అరం = పసనరం పెయింటింగ్‌
పసను అంటే రంగు. రంగులు వేయడం.
8 పొల్లు + అరం = పొల్లరం టైలరింగ్‌
పొల్లు అంటే కుట్టడం.కుట్టరం అని కూడా అనవచ్చు.
9 ఉడిగ + అరం = ఉడిగరం సర్వింగ్‌
ఉడిగం అంటే సేవ.
10. కరవు + అరం = కరపరం టీచింగ్‌
కరపు అంటే నేర్పడం.
11. జరుపు + అరం = జరుపరం మేనేజింగ్‌
దీనిని కూడా నిర్వహణ అంటున్నారు.
12. కూర్చు + అరం = _ కూర్చరం. ఎడిటింగ్‌...
సంపాదకత్వం అంటున్నారు.
13. మార్పు+ అరం = మార్పరం. టాన్స్‌లేషన్‌..
అనువాదం అంటున్నారు.
14. వళుకు+ అరం = వళుకరం. అద్వొకసీ
వళుకు అంటే వాగ్వాదం.
15. కనుగాపు +అరం = కనుగాపరం సూపర్వైజింగ్‌
కనుగాపు అంటే బాగా చూసుకోవడం. పర్యవేక్షణ అంటున్నారు.


చేర్పు వెనుక చాలా మెలన(చరిత్ర) ఉంది. ఇది తెల్లం లేని వట్టి చేర్చు మట్టుకే కాదు. ఇది తెల్లమున్న మాట. తెలుగు నుడిగంటలకు ఇంకా ఎక్కనిమాట. ఎక్కించుకొని తీరవలసినమాట. అరం అంటే, డ్యూటీ లేదా దర్మం. తమిళ నుడిగంటులలో ఈ మాట కనపడుతుంది. దర్మం అనే సంసుక్రుతపు మాటకు తమిళమాటగా ఉంటుంది. దీనిని చూసిన వెంటనే మన పెద్దలు, ఇది తమిళమాట అని చాటేస్తారు. నిక్మానికి ఇది తెలుగుమాట. తెలుగునుండే తమిళానికి వెళ్లి ఉండాలి. ఎందుకంటే తెలుగువాళ్లం వాడినంత ఎక్కువగా తమిళులు ఈ మాటను వాడడం లేదు. వాడుక తమిళంలో ఈ మాట లేనేలేదు. కానీ వాళ్లు నుడిగంటులకు ఎక్కింది, మనం పట్టించుకోలేదు, అంతే.

బారతనాడులోని అన్ని నుడిగుంవులలో తెలుగువాళ్లే మునుముందుగా కనుబడి (ఉత్పత్తి) మట్టుకు ఎదిగిన వారు అని చెప్పే ఆనవాళ్లలో ఒకటి ఈ అరం. టిండిని వెతుక్కొాంటూ ఎడువుకొాంటూ (సేకరించుకొంటూ) అచ్చోటా ఇచ్చోటా తిరిగే మట్టునుండి, తిండిని పండించుకాంటూ ఒకచోటున కుదురుకొనదాన్నే కనుబడిమట్టు అంటారు. ఈ మట్టులో పని పంపకం జరుగుతుంది. నేర్చరితనంతో కూడిన పనినే అరం అంటాం. ఎవరైనా ఎప్పుడైనా చేయగలిగేది 'పని* బాగా నేర్చుకొని నెరతనం పొందినాక చేసేది అరం. ఇంగ్లీసులో వర్క్‌ డ్యూటీ అనే మాటలకు ఉన్న వేరిమే ఈ రెండు తెలుగువూటల నడుమనా ఉంది.

అరంతో కూడిన మాటలు తెలుగులో చాలా ఉన్నాయి. కుమ్మరం, కమ్మరం, మేదరం, నేతరం, కంచరం, వడ్డరం, కాలరం వంటివి వాటిలో కొన్ని. ఇట్ల పలుపనులకు ఒకటే చేర్చుతో మాటలు ఉండడం ఒక్క తెలుగులోనే చూడగలం. అంటే తెలుగువాళ్లు అంత నేటుగా పనులను పంచుకొన్నారు. కనుబడిమట్టుకు తొట్టతొలిగా రావడం వల్లనే ఇటువంటి మాటలు పుడుతాయి. ఇంకొకరిని చూసి నేర్చుకొని కనుబడిలోకి వచ్చినవారిలో ఉమ్మడిచేర్చులతో మాటలు ఉండవు. వేలయేళ్ల కిందటనే తెలుగువాళ్లు కనుబడిమట్టుకు చేరుకొన్నారు అని “అరం” నొక్కి చెపుతూ ఉంది. మనం కూడా అరంతో ఎన్నో కౌంగొత్త ఎసిదానిమి మాటలను పుట్టించవచ్చు” అంటూ మాటల పుట్టింపును మొదలిడిదినాను.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

19