పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొత్తమాట

స.వెం.రమేశ్‌

కొత్తమాటల పుట్టింపు


“అన్నయ్యా, నిన్ను ఒకమాట అడగాలనుకొంటున్నాను. అయితే నా అడక(ప్రశ్న)కు నీ తిరువు(జవాబు) దురుసుగా ఉంటుందేమో అని జంకుతున్నాను” అన్నాడు నారాయణ. “అదే నారాయణా వద్దనేది. పెరనుడుల మీది తగులం (వ్యామోహం)తో తెలుగును ఈసడించుకొనేది నువ్వ. 'తెలుగు అనే పులుగుకు, సంసుక్రుతం ఇంగ్లీసు అనేవి రెండు రెక్కలు, ఏ రెక్క తక్కువయినా తెలుగు ఎగరలేదు” అనింది నువ్వు. “ఆనిమిమాటల పుట్టింపుకు తెలుగు చేవలేనిదీ చేతకానిదీ అని వెక్కసమాడింది నువ్వు నీ కరకుమాటలకు మారుపలుకుతున్నాడు అన్నయ్య. అవి నీకు దురునుగా అనిపిస్తున్నాయా?” అంటూ గయ్యిమనీ లేచినాడు చిన్నయ్య.

“చిన్నయ్యా, జరిగిపోయిన పెళ్లికి మేళమెందుకు ఊరకుండు. నారాయణా, చిన్నయ్య మాటల్ని పట్టించుకోకు. తెలుగుమీద మాకెంత అక్మరా అనుగూ ఉందో నీకూ అంతే ఉందని నేనెరుగుదును. నువ్వు నడచివచ్చిన దారి వేరు, నేను నడవమంటున్న దారి వేరు. ఈ గజిబిజి నుండి బయటపడుతావులే. ఇంతకీ నువ్వు అడగాలనుకాన్నది ఏమిటో అడుగు” అన్నాను నేను కలిపించుకాంటూ.

"ఏమీ లేదు అన్నయ్యా. తామరపువ్వుకు తెలుగులో, తామర, తమ్మి వంటివి రెండో మూడో పేర్తున్నాయి అంతేకదా! అదే సంసుక్రుతంలో అయితే జోలెడుమాటలు కనబడుతాయి. అంబుజ, అబ్జ, ఉదజ, కంజ, జలజ, తోయజ, నీరజ, పంకజ, పయోజ, వనజ, వారిజ, సరసిజ, సరోజ వంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. అట్లాంటప్పుడు సంసుక్రుతం కన్నా తెలుగు గొప్పనుడి ఎట్లా అవుతుంది?” అని అడిగినాడు నారాయణ.

“నారాయణా నువ్వు బాగా బాగా గుర్తుంచుకోవలసినది ఏమిటంటే, నేను ఎన్నడూ కూడా సంసుక్రుతం కంటే తెలుగు గొప్పది అనలేదు. అట్లాగే తెలుగుకంటే సంసుక్రుతమూ గొప్పది కాదు. దేని గొప్పతనం దానిది. సంసుక్రుతం దాదాపు వెయ్యేళ్లు బారతనాడులో 'పెననుడిగా ఉండేది. పలునుడులు ఉండే నాడుల్లో ఎసిదానిమి (శాస్త్రసాంకేతిక) అక్కరలకు ఒక పెననుడి కానే కావాలి. మన బారతనాడులో పాళీ, సంసుక్రుతం నుడులు ఎక్కువతావుల్లో ఎక్కువతరిలోనూ, పారసీకం తక్కువ తావుల్లో తక్కువ తరిలోనూ పెననుడులుగా ఉన్నాయి. ఇటీవల రెండు మూడు వందలేళ్ల నుండి ఇంగిలీసు మన నాడుకంతా పెననుడిగా ఉంది. ఇంగిలీసు, పారసీక నుడులలో వెలువడిన ఎసుడు(శాస్త్రా )లన్నీ బయట నుండి వచ్చినవే. పాళీ సంసుక్రుతాల్లో వచ్చిన ఎసుడులు అప్పటంగా ఈనేలవి. బారతనాడులో పలునుడులకు చెందిన ఎసిదరులు కనిపెట్టినవన్నీ పెననుడి అయిన సంనుక్రుతంలో వెలువడినాయి. మచ్చుకు మనికిమినుకు(ఆయుర్వేదం)నే తీసుకొందాం. పలునుడుల ఎసిదరులు ఒకచోట కూర్చుని ఒక మొక్క గురించి మాట్లాడుకోవాలి. తమిళంలో దాని పేరు 'తొట్టాచినంగి, తెలుగులో 'అత్తిపత్తి. తెలుగులో కూడా అత్తిపత్తి, సిగ్గురొడ్డ, లజ్జటాలు, ముడుగుతామర అని తావుతావుకూ దాని పేరు మారుతుంది. ఏ పేరుతో ఆ మొక్కను పొడక(రికార్డ్‌) చేయాలి? అందుకోసమే పెననుడి కావాలి. ఆ పెననుడిని తెలివరులు అందరూ నేర్చుకొంటారు. మననాడులోనే పుట్టిన మనికిమినుకు వంటి ఎసుడులన్నీ సంసుక్రుతంలో ఉండడానికి కతము ఇదే.”

“అన్నయ్యా, నారాయణ అడిగినదానికీ నువ్వు చెబుతున్నదానికి పొంతన కుదరడం లేదు. నారాయణ తామరకు చెప్పిన సంసుక్రుతం మాటలన్నీ ఎసిదానిమి మాటలే అంటావా?” నడుమన దూరినాడు చిన్నయ్య.

“అక్కడికే వస్తున్నాను కాస్త ఆగు చిన్నయ్యా, పెననుడిగా మారిన నుడి ఎసిదినుడిగా మట్టుకే కాదు, ఎన్నువ(కళ)నుడిగా కూడా ఎదుగుతుంది. ఎన్నువకు చెందిన నెన్నొడికూడా అందులో ఏర్పడుతుంది. అల్లిక(రచన) అనేది ఒక ఎన్నువ కదా. పాతతరిలో అల్లికలంతా పడిక(పద్యం} లుగా ఉండేవి. ఆ పాడికలు అల్లడానికి కొలువడి(చందస్సు)ఉందేది. ఆ కొలువడికి తగినట్లుగా మాటలు కావలసి వచ్చేవి. అల్లికరు(రచయిత)లు కొంగొత్త మాటలను ఎన్నో కొలువడికి తగినట్లు పుట్టించేవారు. ఇదంతా సంనుక్రుతంలో పెద్దయెత్తున జరిగింది. అట్లా పుట్టిన మాటలే పైన నారాయణ చెప్పినవి. దానినే పలుకొడమి(పదసంపద) అంటాం. తెలుగులో అల్లిక మొదలయ్యే నాటికి, సంసుక్రుతంలో పలుకొాడమి ఎంతో ఎదిగి ఉండేది. తెలుగు అల్లికరులు ఆ మాటలనే తీసుకొని వాడేసినారు. కొత్త మాటల పుట్టుకకు పూనుకొన్నవారు కొద్దిమందే. వాళ్లు కూడా చాలా పొడవయిన మాటలనే ఎక్కువగా పుట్టించినారు. ఎన్నువ నెన్నొడిని కూడా తెలుగులో పుట్టించి పెంపొందించవచ్చు. ఆ పని కూడా జరుగవలసిందే. ముందు ఎసిది నెన్నాడిని పుట్టించి, వాటిని బడిలో నేర్పుతూ ఉంటే, ఎన్నువమాటలను పుట్టించేవారు వారంతట వస్తారు. సంసుక్రుతంలో “జన్మ” అనే మాటలోని 'జ ' సడికి “పుట్టుక " అనే తెల్లంను కల్సించి ; అంబు, ఉద, జల, కం, తోయ, నీర, పంక, వన, పయ, వారి, సరసి, సరో వంటి కుదురులకు, 'జ 'ను చేర్చుగా చేర్చి బోలెడు ఎన్నువమాటలను పుట్టించినారు కదా. అట్లాగే “కను, కనుబడి, కలిమి” వంటి పుట్టుకకు చెందిన తెలుగుమాటలలోని తొలిసడి అయిన 'క 'ను చేర్పుగా చేర్చి తెలుగులో తామరకు కొంగొత్త ఎన్నువమాటలను పుట్టించవచ్చు. అడుసుక, అవుసుక, ఈరుక, ఊటుక, ఏటిక, కుళంక, కొలకుక, కొలనుక, కొళముక, కొళ్ళుక, కోడుక, చదుకుక, చింకక, చిత్తడిక, చెర్వుక, చెల్మక, జౌకుక, జేడక, టెంకిక, దొనక, దొర్వుక, నీరుక, నీర్క నీళుక పడియక పడ్యక, బురదక, మడుగుక, మడువుక, లట్టుక, లొండుక, వెంచక, వెళ్లక, వెల్లక, రొంపిక, సెలక.... ఇట్ల పుట్టించుకొంటూ వెళ్లవచ్చు. అట్లాగే 'పడయు, పడతి, పడుపు వంటి మాటలలో పుట్టుకకు చెందిన తెల్లం కనబడుతున్నది కదా, వాటిలోని 'ప ' సడిని కూదా చేర్చుకొని తామరకు మరిన్ని మాటలను పుట్టించవచ్చు. 'పుట్టు, పుట్టుక, పుట్టుగు, పుట్టుబడి, పుట్టువ 'లలోని 'పు 'ను తీసుకొని ఇంకొన్ని మాటలను

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

18