పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళినందున 20, 25 సంవత్సరాల నుండి ఆయన దర్శనం కాలేదు. “వంగ దర్శనం” దూతగా మారి కృష్ణుడిని మళ్ళీ బృందావన ధామానికి తీసుకొచ్చింది. ఆ సమయంలో మన యిళ్ళలో, సమాజంలో, మన మనస్సులో ఒక కొత్త వెలుగు ప్రసరిం ఛింది. యీ వెలుగులో మన మనస్సులు ప్రకాశించాయి. మనం స్త్రీలను 'సూర్యముఖి 'గా, 'కమలకమణి'గా చూడగలిగాం. మనదేశ వాసులైన 'చంద్రశేఖర్‌ 'ను, 'ప్రతాప్ 'ను మన భావ సింవోసనంపై కూర్చోపెట్టాం. మన దైనందిన జీవనం వెలుగుతో నిండి అద్భుతమైన దృశ్యాలు కనబడసాగాయి.

వంగ దర్శనం సాటిలేని నవ్వ రసాస్వాదన చేసి బెంగాల్‌ లో విద్యావంతులైన వారు బెంగాలీ భాషలో తమ భావాలు వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. ఆంగ్ల భాష వ్యావహారికంగా ఉపయోగపడుతుంది గాని వ్యక్తిగత భావాలను వ్యక్తం చేయటానికి యీ భాష తగదు అని వారు తెలుసుకున్నారు. ఎంతో పరిశ్రమతో చిన్నప్పటి నుంచి అంగ్ల భాష నేర్చుకుంటున్నప్పటికీ వర్తమాన సాహిత్యం (చిరకాలం ఉంటుందని ఆశించేది) బెంగాలీ భాషలోనే వెలువడింది. భారతీయులు ఆంగ్లభాషలో తమ భావాలను వ్యక్తం చేయగలందుకు తగినట్లు మనసును ఆ భాషతో మేళవించలేకసోవటమే దీనికి ముఖ్యకారణం. ఒకవేళ అంగ్ల భాషతో చక్కని సంబంధం ఏర్పరచుకున్నప్పటికీ భారతీయ భావాలను స్పదేశీ భాషలో వ్యక్తం చేయగలిగినంత అందంగా అంగ్ల భాషలో చేయలేరు. మన మనసులకు ప్రేరణ కలిగించే విషయాలను, భావాలను విదేశీ భాషలలో బాగా స్వతంత్రంగా ప్రకటించలేం.

మన విద్యావంతులైన యువకులు తమని తాము వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేసేటప్పుడు, దానికి మాతృభాషను ఆశ్రయించేటప్పుడు ఒక అలజడికి గురి అవుతున్నారు. యింత కాలం నించీ పొందిన నిరాదరణను, మానహానిని మరచి, పిలచిన వెంటనే విద్యాగర్వంతో మిడిసిపడేవారి ఎదుట తన సమస్త సౌందర్యంతో, గరిమతో చేతులు కట్టుకుని నిల్చొదు మన స్వభాష,

మీ స్వభాష వైభవాన్ని అర్ధం చేసుకోగలరా? దీని రహస్యాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేశారా?

మీరు మిల్‌, స్పెన్సర్‌ (18వ శతాబ్దపు ఆంగ్ల తత్వవేత్తలు) రచనలు అధ్యయనం చేశామని, పెద్ద పెద్ద డిగ్రీలు, సర్టిఫికెట్లు పొంచామని అనుకుంటూ వుండవచ్చు. అందువల్ల స్వతంత్రంగా ఆలోచించి అర్థం చేసుకునే యోగ్యత కలవారమని, పరిపూర్ణ విద్వాంసులమని భావించవచ్చు. దురదృష్టవశాన బహు పుత్రికలకు జన్మనిచ్చి ఆ భారంతో అణిగిపోయిన తల్లిదండ్రులు తమ కూతుళ్ళను, కోరినంత ధనాన్ని తెచ్చి మన యింటి ద్వారాల వద్ద మోకరిల్లినట్లే నిరక్షరాస్యులైన గ్రామీణుల అతి తక్కువవయిన దేశభాష మీ సంకేతమాత్రం చేత మీ శరణుజొచ్చి తన జీవితాన్ని సఫలం చేసుకుంటుందని మీరు భావిస్తున్నారు. జీవితమంతా ఆంగ్లభాషను నేర్చుకొని కూడా మాతృభాషలో రాయటానికి పూనుకున్నామంటే, ఆంగ్లభాషలో తేలికగా లభ్యమయ్యే ప్రతిష్టను తిరస్కరించి, ఉన్నత అమూల్యమైన తమ భావ ముత్యాలను యూ స్వదేశీ భాషపై ఎంతో విశాల హృదయంతో ఎంతో సాహసంతో వెదజల్లటానీకి తత్పరత చూపిస్తున్నామంటే యీ భాష భాగ్యమేనని అనుకుంటారు. మహారాజు విచ్చేయడం చూసి అత్యంత గౌరవంతో దారి తొలగి నిల్బొన్న నిర్ధనుడిలా తమ మార్గంలో వచ్చే అడ్డంకులు, కష్టాలు కూడా భయపడి తమ ముందు నుంచి తొలగి ఒక పక్క నిలబదడతాయనుకొంటారు. “దేశవాసులారా! ఒక్క క్షణం ఆలోచించి చూడండి, మేం మీ మీద ఎంత దయచూపుతున్నామో! మేం మీకు రాజకీయ ఆర్థిక సమస్యల గురించి ఎన్ని విషయాబైనా చెపుతాం. భూగోళం గురించి మేం నేర్చుకొన్న దాన్ని ఆది నుండి అంతం దాకా వినీపిస్తాం. ఏదీ దాచటానికి ప్రయత్నం చేయం, యితర దేశ భాషలలోని ప్రసిద్ధమైన, అవగాహనకు కఠినమైన పుస్తకాల నుండి ఆలోచించదగిన విషయాలు సంక్షిప్తంగా చెప్తుతాం. అనేక చారిత్రకమైన విదేశీ సాహిత్యంపై విద్వాంసులు, విమర్శకులు ఎటువంటి అభివ్రాయాలు వ్యక్తం చేశారో అదీ చెపుతాం. కానీ యీ నీ గ్రామభాష నీ స్వభాష ఆజ్ఞాపించగానే మా ఎదురుగా నిలబడక పోతే ఆ భాషలో ఒక్క శబ్దం కూడా రాయం. మేం ప్లీడరీ చేస్తాం, 'హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు అవ్వగలం, పోలీసు సూపర్నెంట్స్‌ న్యాయాధీశులు, డిప్టీ కలెక్టర్‌ ఏదైనా కాగలం. నచ్చితే ఆంగ్లపత్రికల్లో వ్యాసాలు రాస్తాం. కానీ స్వభాష పేరైనా ఎత్తం. ఆలోచించండి. దీనీ వల్ల ఎంత హాని జరుగుతుందో!” అని అంటారు.

ఇదంతా మన దేశదౌర్భాగ్యం కాకపోతే మరేమిటి? మన మాతృభాష ఆంగ్లభాషామోహితులైన యీ నవయువకులను గౌరవించదు. యీ యువకులు తమ మిధ్యా గర్వాన్నీ వదలి మాతృభాషతో మమేకం కావటానికి ప్రయత్నం చేయరు. వీరు కనీసం మాతృభాషలో ఒక ఉత్తరమైనా రాయరు. తమ మిత్రులను, ఆత్మీయులను కలుసుకున్నప్పుడు సాధ్యమైనంతవరకు ఆంగ్లంలోనే మాట్లాడతారు. స్వదేశీ భాషా గ్రంథాలను తమ యింటిలోకి కూడా రానీవ్వరు. దీన్నే చిన్నతప్పుకు పెద్దదండన అంటారు.

బాల్యంలో మనకు నేర్పే విద్యలో భాషాజ్ఞానంతో పాటు భావాలలో శిక్షణను ఇవ్వరు. సమయం మించిపోయిన తరువాత దానికి విరుద్దంగా జరుగుతోంది. భావాలు ఉత్పన్నమయ్యే సమయానికి మన వద్ద భాష వుండదు.

భాషాజ్ఞానంతో పాటు భావస్స్ఫూర్తిని కలగచేసే విద్య నేర్చడం లేదని ముందుగానే చెప్పాను. అందువల్లనే మన భావాలు, పాశ్చాత్య భావాల మధ్య సమానత వుండడం లేదు. యీ రోజు చాలామందివిద్యావంతులు పాశ్చాత్య విషయాలపట్ల విముఖత చూపుతున్నారు. అలా అని వారు తమ మాతృభాషలో సన్నిహిత పరిచయం ఏర్పరచుకోలేక పోతున్నారు. తమ స్వభాషకు కూడా వారు చాలా దూరమై పోయారు. తమ భాషపట్ల వారి మనస్సుల్లో అవహేళనాభావం చోటుచేసుకుంది. కానీ వారు తమకు మాతృభాషాజ్ఞానం లేదని కూడా ఒప్పుకోవటం లేదు. ప్రతి భావాన్ని వ్యక్తం చేసే శక్తి మన మాతృభాషకు ఉందా? అని ప్రశ్నిస్తూ యీ స్వభాష విద్యావంతులకు పనికిరాదు అని చెప్పి తమ బలహీనతను కప్పి పుచ్చుకుంటారు. అందని ద్రాక్షపండ్లు పుల్లన అన్నట్లు ఉంది ఇది. మనశక్తికి అలవికాని పనిని ప్రశంసించటానికి బదులు నిందించటం మొదలుపెడతాం.

తరువాయి 28 వ పుటలో.......

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

17