పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విద్య 'పైపూతలు పూసుకాని గర్వంతో తల ఎగరవేసుకుంటూ తిరుగుతుంటాం. మన వాస్తవ జీవితంతో వాటికెటువంటి సంబంధమూ వుండదు. అనాగరిక, అటవిక ప్రదేశాల రాజులు లేదా నాయకులు గాజు ముక్కలు మొదలైన చవకబారు విదేశీ వస్తువులను శరీరంలో అక్కడక్కడా తగిలించుకొని సభ్య సమాజం అపహాస్యం చేస్తుందని గమనించని విధంగా మనం కూడా తళుకు బెళుకుల విదేశీ విషయాలు నేర్చుకొని విర్రవీగుతూ వుంటాం.

విదేశీయుల గొప్ప గొప్ప భావాల్ని అనవసరంగా, సందర్భ రహితంగా ప్రయోగిస్తూ వుంటాం. మన అజ్ఞానం వల్ల ప్రపంచాన్ని నవ్వించే ఒక విచిత్ర నాటకం ఆడుతున్నామని గ్రహించలేం. మనయీ చేష్టలకి ఎవరయినా నవ్వుతూ వుంటే యూరపు చరిత్రనించి గొప్ప గొప్ప ఉదాహరణలు తీసి వారి ముందుంచటానికి తొందరపడుతూ వుంటాం. బాల్యం నుండి మన బాలలకు భాషాజ్ఞానంతో పాటు, భావబోధన కూడా కలిగిస్తూ వుంటే అవి జీవితంతో మేళవించి, దైనీక జీవితంలో ఒక భాగంగా మారి మన శీలంపై సరైన ప్రభావాన్ని కలిగిస్తే మన జీవితమంతా నిజమైన అనుకూలత ఏర్పడుతుంది. భాష భావం, తగు పాళ్లల్లో మేళవిస్తాయి.

ఏ భావాలతో ప్రభావితమై లేదా ఏ రీతిగా, ఏ పద్దతిలో జీవితం గడపాలో దానికి అనుకూలంగా మన విద్య లేదనీ మనం బాగా ఆలోచించి చూస్తే తెలుస్తుంది. మనకు కావాల్సిన గృహ సుందర చిత్రమేదీ మన పాఠ్యపుస్తకాలలో లేదు. మనం జీవితం గడపాల్సిన సమాజం కోసం ఉన్నత ఆదర్శమేదీ మన పాఠ్యాంశాలలో దొరకటం లేదు. మన తల్లిదండ్రులను, సోదరీ సోదరులను, బంధువులను వాటిలో స్పష్టంగా చూడలేక పోతున్నాం. మన దినచర్యకు దానిలో స్థానం లేదు. మన అందమైన ప్రభాతాలు, సుందర సంధ్యా సమయాలు, పచ్చగడ్డి మైదానాలు వీటిలో కనిపించవు. దీన్నిబట్టి మన చదువుకీ జీవితానికి ఎటువంటి సంబంధం లేదని తెలుస్తోంది. రెండిటి మధ్య ఒక పర్వతం అద్దంగా వుంది. యీ చదువు మన జీవిత అవసరాలను ఎప్పటికీ పూర్తి చేయలేదు. మన జీవితానికి ఎన్నో గజాల దూరంలో చదువు వర్పిస్తోంది. ఈ స్థితిలో అన్ని ఆటంకాలను తప్పించుకుంటూ కొంత ధార మనదాకా చేరుకున్నా అది మన జీవితంలోని నీరసతను తొలగించటానికి, జ్ఞానతృష్టను తీర్చటానికి చాలినంతగా వుండదు. జీవితమంతా వెచ్చించి నేర్చుకుంటున్న చదువు గుమాస్తాగా లేదా మరొక నౌకరీ చేసుకోవడానికి మాత్రం యోగ్యులుగా తయారుచేస్తోంది.

యింతకంటే ఎక్కువ మేలు దీనివల్ల కలగటం లేదు. మనం ఆఫీసుకు పోవడానికి గుడ్డలు మదత పెట్టి పెట్టుకునే అలమరాలోనే మన చదువును కూడా మూత పెడుతున్నాం. దానిని నిత్య జీవితంలో ఏమాత్రం ఉపయోగించటం లేదు. యిదంతా నేటి విద్వా ప్రణాళిక పెట్టిన భిక్ష దీనికి విద్యార్థులను దోషులు అనటం అన్యాయం. యిందులో వారి పాత్ర ఈసంతైనా లేదు. కారణం వారి చదువు ఒక వైపు, జీవితం మరాక వైపు వున్నాయి. రెండింటి మధ్య వర్ణమాల, పదకోశం, వ్యాకరణం అనే వంతెన వుంది. అందువల్లనే పాశ్చాత్య విజ్ఞానంతో ప్రవీణుదైన వ్యక్తి నీచమైన, అవమానకరమైన సంస్మారాలను, విధానాలను, మిధ్యాధోరణులను నిలబెట్టుకోవాలనీ ప్రయత్నించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఏ వ్యక్తి ఉపన్యాసాలతో స్వాతంత్ర్రపు ఉన్నత భావాలను, ఆదర్శాన్ని ప్రచారం చేస్తాడో అతడే పరాధీనత లేదా దాస్యత శృంఖలాలనే సాలెగూళ్ళలో తాను, తనతోపాటు యితరులు ఛిక్కుకునేలా చేసి బలహీనుడై పోతున్నాడు.

ఉత్తమ భావాలుగల సాహిత్యాన్ని పరిపూర్ణ స్వేచ్చతో అధ్యయనం చేసి కూడా తన భావాలను ఉన్నత శిఖరాలకు చేర్చలేక పోతున్నాడు. వారి జీవితం మరింత అధోగతిలో వుంది. కేవలం డబ్బు సంపాదనలో, లౌకిక బెన్నత్యాన్నీ పొందడంలో లీనమై వున్నాడు. అటువంటి వ్యక్తుల జ్ఞానానికి లౌకిక వ్యవహారానికి మథ్య ఎంతో వ్యత్యాసం కనబడుతోంది. తత్ఫలితంగా రెండూ సంయోగం చెందలేవు, పరస్పర వైరుధ్యం వుంటూ వుంటుంది. దీని పరిణామంగా రెండు వైపులా విరోధం పెరిగిపోతూ ఉంటుంది. మనకు లభించిన జ్ఞానానీకీ, మన లౌకిక వ్యవహారాలకూ మధ్య యుద్దం జరుగుతూనే వుంటుంది. అందువల్ల అటువంటి చదువుమీద ప్రారంభం నుండీ నమ్మకం, విశ్వాసం వుండవు. ఆ చదువు భ్రమాస్పదంగా ఉంటుంది. అదే పాశ్చాత్య సభ్యతకంతకూ ఆశ్రయమని అనుకుంటాం. చదువు మనకు మార్గం చూపుతున్న ఆ వైపు సభ్యత అనే విశ్వాసఘాతకురాలైన భయంకర దెయ్యం రాజ్యం చేస్తోంది. ఆ వైపు పోవటం మనకు హానికరం కానీ దురుదృష్టవశాత్తు మన దౌర్చాగ్యంవల్ల, ఇతర కారణాలవల్ల ఈ చదువు మనకు హానిచేస్తోందని తెలుసుకోవటం లేదు. పైగా విద్యలోనే సహజ దోషముందని పొరబడుతున్నాం.

మనం విద్యను ఎంతగా నిర్లక్ష్యం చేస్తే మన అవిశ్వాసం కూడా అంతగా పెరిగిపోతుంది. మన విద్య కూడా మన జీవితం నుండి, అవసరాల నుండి వెనక్కి మళ్ళి నిర్లక్ష్యధోరణి కూడుకున్న దవుతోంది. మన శీలంమీద, మన వ్యావహారిక జీవితం మీద ఎటువంటి ప్రభావమూ యీ చదువు కలగచేయటం లేదు. అంటే మన చదువుకూ జీవితానికీ మధ్య అంతరాలు, అగాధాలు పెరిగి పోతున్నాయి. యీ రకమైన అపూర్ణ జ్ఞానం, అపూర్ణ జీవితం దయవల్ల భారతీయుల జీవితం ఒక నాటకంలా, అనుకరణమాత్రంగా తయారవుతోంది.

మనం జీవితంలో మూడింట ఒకవంతు భాగం కేటాయిస్తున్న చదువుకూ మన జీవితానికీ మధ్య పొంతన లేనప్పుడు, మరొ విద్యను ఆర్జించటానికి కూడా అవకాశం కల్పించనప్పుడు మనం ఏవిధంగా పైకి రాగలమో చెప్పండి. మన చదువుకూ జీవితానికి మధ్య సమానత్వం ఏ విధంగా కలగచేయగలం అని ఆలోచించవలసిన, అత్యవసరమైన ప్రశ్న మన ఎదుట ఉంది. మన మాతృభాష, మాతృభాషా సాహిత్యమే అటువంటి సమానత్వాన్నీ నెలకాల్పగలవు. స్వర్గీయ బాబూ బంకిమ్‌ చంద్ర ఛటర్జీ “వంగ దర్శనం” నవ ప్రభాతంలా ఉదయించినప్పుడు వంగదేశంలో యీ చివరి నుండీ ఆ చివరిదాకా ఆనందం వెల్లివిరిసింది. యూరోపు విజ్ఞానంలో, ఆలోచనా ప్రవాహంలో, చరిత్రలో దొరకని నూతనాంశమేదైనా *'వంగ దర్శనంలో వుందా? 'వంగ దర్శనంలో అదేమీ లేదు. కాని ఒక ఉన్నత శ్రేణి రచయిత “వంగ దర్శనం ద్వారా అంగ్లభాష బోధనవల్ల ఏర్పడిన అగాధాన్ని నింపివేయగలిగాడు. దూరదేశాలకు వెళ్ళిన మన యింటి మనిషిని మళ్ళీ యింటికి తెచ్చి ప్రసన్నతను, ఆనందాన్ని కలగచేసాడు. తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021 |