పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అభివృద్ది చేశారు. ఈ ఉపకరణాలన్నీ కాల్ట్స్‌ జాలతావు (వెబ్‌ సైటు) లో ప్రజలకు వాడుకోడానికి అందుబాటులో ఉంచారు.

ప్రజల కర్తవ్యం

తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నాా ఏ ఖండంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా తూచ తప్పకుండా తెలంగాణా తెలుగులో జ్ఞానసృష్టి చేయాలి. అందుకు విరివిగా ఈ మాండలికంలో కథలూ, కవితలూ, నవలలూ, సృజనాత్మక సాహిత్యాన్నీ ఎప్పటికప్పుడు అంతర్జాలంలో ప్రకటించాలి. అవి యూనికోడులోనే ఉండాలి. వాటిని అంతర్జాలంలో ఉచితంగా అందుబాటులో పెట్టాలి. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, కోరా, ట్విట్టర్‌, ఇన్నాగ్రామ్‌, టెలిగ్రామ్‌ మొదలైన సామాజిక మాధ్యమాలలో మన భాషలోనే రాయాలి. ప్రపంచమంతా వ్యాపించి ఉన్న తెలంగాణ వాళ్ళందరూ స్వచ్చందంగా జ్ఞానసృష్టి చేయాలి. రచయితలూ కవులూ గాయకులూ కళాకారులూ, విమర్శకులూ, నవలాకారులూ వారి వారి రచనలను, రాతప్రతులను యూనికోడ్‌ లోనే రాయాలి. అవన్నింటినీ కూడా చదువుకోవడానికి ప్రజలు దిగుమతి చేసుకోడానికి అంతర్జాలంలో ఉచితంగా అందుబాటులో ఉంచాలి. అప్పుడే తెలంగాణ తెలుగు అంతర్జాలంలో విశ్వవ్యాప్తంగా కనపడుతుంది, వినపడుతుంది. అలా ఉంచిన వాటిని సమయానుసారంగా అంతర్జాలం నుండి భాషాశాస్రజ్ఞులు, భాషానిపుణులు సాలెగూళ్లలో ఉన్న సమాచారాన్ని దిగుమతి చేసుకొని భాషానిధిని అఖివృద్ధి చేస్తుండాలి. ఇదొక నిరంతర ప్రక్రియ. ఒక యంత్రాంగం ఈ ప్రక్రియ పై ఎల్లప్పుడూ పనిచేస్తుండాలి. అప్పుడే తెలంగాణ భాషానిధిని నిర్మించగలము.

చేయాల్సిన పరిశోధనలు

తెలంగాణ భాషా స్వరూపం, వర్ణనాత్మక వ్యాకరణాలనూ, నిఘంటువులనూ కూర్చాల్సిన ఆవశ్యకత ఉంది. ఇతర భాషల ప్రభావం మొదలైన వాటిపై మరింత విస్తృతస్థాయిలో పరిశోధనలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వాటితో పాటు తెలంగాణ తెలుగును అన్ని రంగాలకు విస్తరించి అమలు చేయడానికి ఒక శాస్రీయ అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. మన భాషపై మనకు అమితమైన ప్రేమాభిమానాలు, గౌరవం, అనుబంధం, ఇష్టం ఉండడం వేరు శాస్రీయ దృక్పథంతో భాషని అధ్యయనం చేయడం వేరు. ఎందుకంటే ఇంకా నేడు ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల ప్రభావం చేత అనేక భారతీయ భాషలు (గిరిజన, లిపిలేని భాషలు, అల్పసంఖ్యాక భాషలు కోకాల్లలు) అంతరిస్తున్న సమయంలో మన భాషనూ కాపాడుకోవాలంటే, అన్ని రంగాలలో భాషను తప్పకుండా అమలు చేయాలి. అందుకు తెలంగాణా భాషపై ఒక సమగ్ర అధ్యయనం జరగాలి. దాని కోసం ముందుగా కావాల్సింది భాషానిధి. దీన్ని నిర్మించుకోవడానికి ఒక పక్కా కార్య ప్రణాళికను తయారుచేసుకొని దానికి అనుగుణంగా నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ ఒక భాషకు భాషానిధి సమకూర్చడం వ్యక్తిగతంగా చేసేపని కాదు, అందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమాచార సాంకేతిక విభాగం వారు ఆర్థిక సహాయం అందించే ఏర్పాటు చేయాలి. వాటితోపాటు తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ, ఐటి శాఖ, తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం లాంటివారి అర్ధిక సహాయం, ప్రోత్సాహం కూడా ఉండాలి. కారణం భాషానిధి సమకూర్చడం అనేది ఒక పెద్ద ప్రక్రియ. మనం పైన చెప్పుకున్నట్టుగా తెలంగాణా భాషపై కొన్ని అధ్యయనాలు జరిగినాయి కానీ ఇప్పటి వరకు తెలంగాణా భాషానిధి సేకరణ మాత్రం జరగలేదు. తెలంగాణ తెలుగుతో పోల్చుకుంటే ప్రామాణిక తెలుగులో భాషానిధి సేకరణ విస్తృత స్థాయిలో జరిగిందని చెప్పాలి.

భాషానిధి నిర్మాణం: ఉపయోగాలు

తెలంగాణా తెలుగుపై ఒక సమగ్రమైన అధ్యయనం చేసి తెలంగాణ తెలుగుకు వర్ణనాత్మక, సంగణాత్మక వ్యాకరణాలు, నిఘంటువులూ, భాషానిధులూ, పదనిధులూ, పదజాలితలూ (వర్డ్‌నెట్ ), సాంకేతిక భాషోపకరణాలు లేక వనరులు లేదా సంగణాత్మక వనరులు అఖివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత భాషాస్టితిగతులని తెలుసుకోవడానికి భాషానిథి ఎంతగానో ఉపకరిస్తుంది. భాషలలో ఉన్న భిన్నత్వంలోని ఏకత్వాన్ని నిరూపించడానికి ఉపయోగపడతాయి. నిఘంటు నీర్మాణం, పాఠ్యపుస్తకాల తయారీ, నూతన పదాల సేకరణ, పదస్థాయిలో ఉన్న పదవిశ్లేషిణి, పదజనకం, భాషాభాగాల గుర్తింపు, వాక్య విశ్లేషణి, యంత్రానువాదం, భాషాసాంకేతికత, సమాంతర భాషానిధులు, వ్యాకరణ రచన, థేసరస్‌, రిఫరెన్స్‌ గ్రామర్‌, ప్రథమ లేక ద్వితీయ భాషాబోధన, పదప్రయోగ కోశాలు, పదజాలికలు, సమాచార వెలిపరపు (ఇన్ఫరమేషన్‌ రిట్రీవల్‌ మొదలైనవి. దీనితో పాటు వివిధ రంగాలలో తెలంగాణ తెలుగును విస్తరించేలా చేయాలి. దానీతోపాటు తెలంగాణ తెలుగును సాంకేతిక రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ అధునిక యుగంలో సాంకేతికంగా అభివృద్ధి చెందని భాషలను వెనుకబడిన భాషలుగా పరిగణిస్తారని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. సాంకేతికంగా అభివృద్ధి చెందని భాషలు కొన్ని సంవత్సరాలలో అపన్న భాషల జాబిజాలో చేరడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదు. అందుకే తస్మాత్‌ జాగ్రత్త! అందరం నడుం కట్టి తెలంగాణ తెలుగులో విజ్ఞానాన్ని సృష్టిద్దాం, అంతర్జాలంలో, సామాజిక మాధ్యమాల్లో విరివిగా తెలంగాణ తెలుగులో రాద్దాం. అప్పుడే మన తెలంగాణ తెలుగులో మనం వెలుగులను చూడగలం. ఆ వెలుగులే మనందరికీ సోపానాలు అవుతాయి. దానీతో మన తెలుగు అభివృద్ది చెందుతుంది.

జి. ప్రవీత, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి, 8179407778.

పి.ప్రకాష్‌ హైదరాబాదు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 000000


మాతృభాషలో చదివిన పిల్లలు, ఇతర భాషలో చదివిన పిల్లలకంటే మెరుగుగానూ, త్వరగానూ నేర్చుకొంటారు.ఇంటి భాషలో చదివిన పిల్లలు, తర్వాత పాఠశాలలో పరీక్షలలో పనితీరు బాగుంటుంది. ప్రతిభా నైపుణ్యాలకు మించి ప్రయోజనాలతోబాటు మెరుగైన ఆత్మనిర్భరత, ఆత్మగౌరవం, ఆత్మధైర్యం అలవడతాయి-యునెస్మో

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

11