పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఫొటోజర్నలిస్ట్‌ శ్రీనివాసరెడ్డికి

అమెరికన్‌ ఎక్సెలెన్సీ అవార్డు

అమెరికా నుంచి ఆహ్వానం - తెలుగు రాష్ట్రాల్లో ప్రప్రథముడు

ఫాటోగ్రఫిలో విశేషంగా కృషిచేస్తూ అంతర్జాతీయంగా జరిగే పోటీలలో పాల్గొంటూ అత్యున్నత అవార్డులు పొందినవారి గుర్తిస్తూ అందించే అవార్డు ఈ ఏడాది మన తెలుగు ఆర్టిస్టుని వరించింది. ప్రపంచంలోనే పేరుగాంచిన ఫొటోగ్రఫి సొసైటీ ఆఫ్‌ అమెరికా ప్రతినిధులు 2020 సంవత్సరానికి అవార్డులను ప్రకటించారు. ఎక్సెలెన్సీ ఫొటోగ్రఫి సొసైటీ ఆఫ్‌ అమెరికా అనే అత్యున్నతమైన అవార్డుని ప్రముఖ ఫొటోజర్నలిస్ట్‌ టి. శ్రీనివాసరెడ్డిని ఎంపికచేసి ఈ మేరకు ఆహ్వానం పంపించారు. 1997 సంవత్సరంలో ఈ సంస్థలో శ్రీనివాసరెడ్డి సభ్యుడిగా చేరి అంతర్జాతీయంగా జరిగే పోటీల్లో క్రమం తప్పకుండా పొల్గొంటూ పలుమార్లు బంగారు పతకాలు సాధించారు. నలుపు తెలుపు, కలర్‌, నేచర్‌, వైల్డ్‌ లైఫ్‌, ఫొటో ట్రావెల్స్‌ ఫొటోజర్చలిజం అనే ఆరు అంశాల్లో గత రెండు దశాబ్దాల కాలంలో 67 దేశాలలో జరిగిన ఫాటోగ్రఫి పోటీలలో పాల్గోని వీరు తీసిన 4236 ఛాయాచిత్రాలు ఎంపికై ప్రదర్శింపబడ్డాయి.

ఆంధ్రప్రదేశ్‌ ఫొటోగ్రఫి అకాడమికి ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి 1986 నుండి పలు పత్రికలకు ఫొటోజర్నలిస్ట్‌గా పనిచేశారు. అత్యధిక కాలం ఇండియాటుడేకి మనరాష్ట్రం నుండి ఫొటోజర్నలిస్ట్‌గా పనిచేశారు. తన అభిరుచి మేరకు ఫొటోగ్రఫిలో ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌లతోపాటు ఆఫ్రికా, టాంజియానా, కెన్యాలోని గిరిజనుల జీవనశైలి పై ప్రత్యేక ఫొటో డాక్యుమెంటరీలు చిత్రీకరిస్తూ వారి పరిశోధనలతో ఇప్పటివరకు 16 పుస్తకాలు రచించారు. పలు అంతర్జాతీయ ఫొటోగ్రఫి పత్రికల్లో పలు వ్యాసాలు రాశారు. జాతీయ, అంతర్జాతీయ ఫొటోగ్రఫి పోటీలలో గత రండు దశాబ్దాలుగా న్యాయనిర్లేతగా కొనసాగుతున్నారు. ఉమ్మడి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎం.ఎ. రహీమ్‌ ఫొటోజర్నలిస్ట్‌ అవార్డుని 2010 సంవత్సరంలో అందుకున్నారు. 2008 సంవత్సరంలో రామ్‌నాథ్‌ గోయంకా మెమోరియల్‌ అవార్డుతో పాటు పలుమారు కేంద్ర ప్రభుత్వం ఫాటోడివిజన్‌ అందించే అవార్డులతో పాటు, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిస్సా, ఢిల్లీ లలితకళా అకాడమి అవార్డులను ఫొటోగ్రఫిలో శ్రీనివాసరెడ్డి పొందారు. జాతీయ, అంతర్జాతీయ ఫొటోగ్రఫి పోటీలను విజయవాడ కేంద్రంగా నిర్వహించి ఎంతో మంది బెత్సాహికులను ప్రోత్సాహించారు. అమెరికాలోని ది ఇమేజ్‌ కొలీగ్‌ సొసైటీకి ఛైర్మన్‌గాను, ఇండియా ఇంటర్నేషనల్‌ ఫొటోగ్రాఫిక్‌ కౌన్సిల్‌కి జర్నలిజం విభాగంకు ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. గతంలో బ్రిటిషు రాయల్‌ ఫొటోగ్రాఫిక్‌ సొసైటీనుండి అసోసియేట్‌ షిప్‌ హానర్‌ను గత ఏడాది ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫొటోగ్రఫి సంస్థ నుండి మాస్టర్‌ ఆఫ్‌ ఎఫ్‌.ఐ.సి అవార్డుని దేశంలోనే తొలివ్యక్తిగా అందుకున్నారు. వీరిప్రతిభను గుర్తించి రాష్ట ప్రభుత్వం అందించే అత్సున్నత కళారత్న హంస అవార్డుని 2015 సంవత్సరంలో శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేసి సత్మరించింది.

అమెరికాలోని సౌత్‌ డకోటా రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే ఫొటో ఫెస్టివల్‌ మరియు అంతర్జాతీయ సమావేశంలో ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా ఫొటోగ్రఫి సొసైటీ ఆఫ్‌ అమెరికా సంస్థ ఈ మేరకు ఆహ్వానం పంపింది. ఈ అవార్డుని ఉభయ రాష్ట్రాలలోని తొలి తెలుగు వాడిగా పొందటంపట్ల పలు ఫొటోగ్రఫి సంస్థలు శ్రీనివాసండ్డికి అభినందనలు తెలియజేశారు.

ఉఎపపపపపపపపపపపపపపపపపపపపపపపపపపపపపపపపపపపపపపపపపపపపపుపపుు

తెలుగు మొబైల్‌ యాపులూ వికీ వ్వాసరచనల పోటీ

నాలుగు లక్షల రూవాయల బహుమతులు యాపుల పోటీకి, వ్యాసరచన పోటీకి ఇప్పటి వరకు తమ యాపులను, వ్యాసాలను పంపిన వారికి ధన్యవాదాలు. ఆశించిన సంఖ్యలో పోటీదార్లు పాల్గొననందున పోటీ గడువు తేదీని జూలై 31,2021కి పొడిగించటమైనది. వ్యాసరచనకు కావాల్సిన నాణ్యతా మార్గదర్శకాలను ౧౧3:/1914960012306/202200౬1%0%)/2. 0109౧01 00) వలపేజీకి వెళ్ళి చూడగలరు.పోటీ విజేతలకు బహుమతి ఆగష్టు 29 నాటి తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో అందజేస్తాము. తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆ-౯౭/: 1600282001 9 ౧౭|.00౧) ఫోన్‌: 94980 35658.