Jump to content

పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రయాణం చేస్తూ సుందర తెలుగు పాటపాడుకోవాలMటూ పద్యం రాశాడు. తెలుగోడి గొప్పతనానికి 16 వ శతాబ్దిలోనే సంస్కృత పండితుడు అప్పయ్య దీక్షితులు కీర్తిస్తూ వందల ఏళ్లు తపస్సు చేస్తే గానీ తెలుగు వాడిగా పుట్టడం సంభవించదు. అని లోకానికి చాటిచెప్పారు. ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్‌ చంద్ర తన నవలలో నాయికను అందమైన ఆంధ్ర చీరకట్టులో ఉందనీ అభివర్ణించారు. ఇలా ఎంతో మందిని తెలుగు భాష, సంస్కృతి ఆకట్టుకున్నాయి.” కాసేపు ఆగి పక్కనే ఉన్న గాజుగ్గాసులోని నీళ్లు తాగారు.

'కులం, మతం, భాషా, ప్రాంతం, వర్ణం, లింగ, వయోభేదాలతో నిమిత్తం లేకుండా నూటా యాఖై కోట్ల భారతీయుల నరనరాల్లో ఉద్వేగాన్నీ నింపే ఒకే ఒక్క బంధం... త్రివర్ణ పతాకం. భారతీయుడి అండా దండా అయిన ఈ జెండాను రూపొందించింది తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య....”

“ఈ కన్నుల ముందే భారతావని స్వాతంత్రయం పొందింది. ఆంధ్రరాష్రం ఏర్పడింది... తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది... కొన్నేళ్ల తరవాత పాలన అవసరాల దృష్ట్వా ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణాలుగా రెండు రాష్ట్రాలుగా విడిపడ్డాయి. ఈ రెండు రాష్త్రాలలోనే కాదు దేశమంతా ఇతర రాష్ట్రాలలోనూ విదేశాల్లోనూ అసంఖ్యాకంగా విస్తరించి ఉన్నారు తెలుగువారు. వీరంతా తమ ప్రతిభతో ముందుకు వెళుతున్నారు. ప్రపంచ జాతులతో కలిసి భరతజాతి కీర్తిని ఇనుమడింపచేస్తున్నారు.

అమ్మని, అమ్మనుడిని, అమ్మనాడుని, ఎప్పుడూ మీరు ఎక్కడున్నాా ఏ దేశంలో ఉన్నా మరవకండి. జాతి నిండు గౌరవాన్ని నిలపండి. పిల్లలకి తెలుగు నేర్పించండి. భావితరాలకు తెలుగు సిరులు అందించండి. తెలుగువాళ్లు ఎక్కడున్నా సరే ఎప్పుడైనా సరే తమ జీవితంలో ఒకసారైనా ఈ 'తెలుగుజాతి ఘనకీర్తి చరిత్ర ధీమ్‌ పార్క్‌ ని దర్శించుకోండి. మీ పిల్లలనీ ఇక్కడికి తీనుకురండి. దేశవిదేశాల్లో మనం సాధించిన ఘనకార్యాలను వాళ్లకు అర్థం అయ్యేలా చేయండి. తెలుగునుడి ఔన్నత్యాన్ని తెలియజేయండి. గతం కాదు నాస్తి... అది అనుభవాల ఆస్తి. ప్రతి జాతీ ఇటువంటి ఓ థీమ్‌ పార్కు ను రూపొందించుకొని భావితరాలకు తమ చరిత్రను కళ్లారా తెలిపే ప్రయత్నం చేయాలి. ఇతర రాష్త్రాలు కూడా ఇలాంటివి త్వరలో చేబడతాయని ఆశిస్తున్నాను.

ఏదో కల కదా అని విడిచిపెట్టకుండా సూర్యవర్మ తను చూసిన ప్రదేశాలన్నిటి గురించి పరిశోధన చేసి జాతికి గర్వకారణమైన థీమ్‌ పార్కును రూపొందించాడు. అతడిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

జాతీయ గీతాలావనతో గంభీరంగా ఆ చరిత్రాత్మకసభ ముగిసింది. (పూర్తి అయింది)

ఈ రచన పుస్తకంగా త్వరలో వెలువడనుంది. కావలసిన వారు

“అమ్మనుడి” ప్రచురణకర్తను సంప్రదించగోరుతున్నాము.


అక్షరాన్ని నేను పల్లవి:

అమ్మ పాడిన - పాటయ్యాను ఆయ్య నేర్చిన - మాటయ్యాను నీ భావానికి - భాషనయ్యాను నీ భవితకు - బాటయ్యాను అక్షరాన్ని నేను - తెలుగు అక్షరాన్ని నేను యాఖై ఆరక్షరాల - వెలుగు రేఖను నేను

చరణం:

1. పలకరించే - మనసయ్యాను కలవరించే - (ప్రేమయ్యాను కలుసుకునే - బంధమయ్యాను తెలుసుకునే - తెలివినయ్యాను అక్షరయాత్రలో ఆశను నేను ఆశయసాథనలో ఆకృతి నేను అందర్నీ కలిపే - స్నేహం నేను కలకాలం కదిలే - కాంతిని నేను స్వాతంత్రసమర - నినాదమయ్యాను సాయుధ పోరాట - బావుటనయ్యాను 'ప్రజాకళల గుండె చప్పుడయ్య్వాను బహుజన హితంగా భాసిల్లాను

. తూర్పున ఎగిసే - సూర్చుణ్ని నేను పడమర చూసే - చంద్రుణ్ని న్‌ అవినీతికి - సింహస్వప్నమలయ్యాను అన్యాయ్యాన్నెదిరించే ఆ ఆయుధాన్నయ్యాను

11 “అమ్మ పొడిన”

పదాలతో పల్లవించే - భాష్యం నేను పద్య, గద్య, స్వర - భాగ్యం నేను భాషాఖేదం లేని - ఘన చరితను నేను అవధుల్లేని - విశ్చ విఖ్యాతినీ నేను

ఏ దేశమేగినా - ఎందు కాలిడినా అందునిలిచే - నవభారతినీ నేను

తెలుగువారి - జానపదాన్ని నేను జగమెరిగిన - జన తథాన్ని నేను “దేశభాషలందు” - లెస్సనయ్యాను మా తెలుగుతల్లికి - మెల్లెపూదండనయ్యాను 11 “అమ్మ పాడిన”

-బి. గోవర్థన రావు 9441968930

“క బిద్ధ మాత్చభావలో ఒక నంవత్సరంలో నేర్చుకునే విద్యను వరాయి భాషలో నేర్చుకోవడానికి నాలుగేళ్ళు పడుతుంది” -విశ్వకవి రవీంద్రనాథ్‌ఠాగూర్‌

తెలుగు జాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

46