రాష్ట్రపతిగారి దగ్గరకి వెళ్లి నిలుచున్నా ఆయన ఓ ఆసనం మీద నన్ను కూర్చోబెట్టి పోచంపల్లి ఇక్కత్ శాలువా కప్పారు. బొబ్బిలి వీణను అందించారు.
ఆయన నా మీద కురిపిస్తున్న అభిమానానికి కళ్లు చెమర్చుతున్నాయి.
రాష్ట్రపతి గారు సందేశం ఇవ్వడం మొదలు పెట్టారు.
“అందరికీ అభినందనలు. నా కళ్లెదురుగా ఉన్న జనసంద్రాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. కాలేజీ రోజుల నాటి ఉత్సాహం ఉరకలేస్తోంది.
మిమ్మల్నందరినీ శ్రీపర్వత లోయలో చూడడం కన్నుల పండుగగా ఉంది. సరిగ్గా రెండు వేల ఏళ్ల నాడు శ్రీలంక, కాశ్మీరం, గాంధారం, చీనా చిలాట, తోసలి, అపరాంత, వంగ, వనవాస యవన తదితర దేశాల నుంచి పరివ్రాజకులు, ఖిక్కులు, విద్యార్థులు ఇక్కడికి వచ్చి బౌద్దజైనాలు, వైద్యం, రసాయనం, న్యాయం, అలితకళలు అధ్యయనం చేసేవారు. ఇక్కడ ఏకకాలంలో వెయ్యి మంది విద్యార్థులు బస చేసేలా భోజనం, వసతి ఉండేదట. రెండు వేల ఏళ్ల నాడు ఇక్కడి పరిస్థితి అది. ఇప్పుడు మిమ్మల్నంతా చూస్తుంటే ఆనాడు ఈ నేల మీదున్న వైభవాన్ని ప్రత్వక్షంగా చూసిన అనుభూతి కలుగుతోంది.
ఎన్ని యుగాలు గడిచినవో, ఎన్ని తరాలు నడిచినవో, ఎన్ని నాగరికతలు వర్దిల్లినవో, ఎన్ని తరాలు అవతరించినవో, ఎందరు రాజులు అంతరించిరో. ఎన్ని పతనోన్నతాలో, ఎంత జీవితమో.....ఇక్కడే మానవులు మనుగడ కోసం పోరాడింది... జంతువులతో, ప్రకృతితో సహజీవనం, సంఘర్షణ... నార వస్త్రాల నుంచి నాగరక వస్త్రాల దాకా మానవ సంస్కృతి ప్రయాణించిందీ ఈ నేలపైనే. ఇక్కడే మనుషులు ఆహారం కోసం అస్తిత్వం కోసం ఆయుధాలు సృష్టించింది. కొండ కోనల మద్య మహారణ్యాల మథ్య రాజులు రాజ్యాలు మహానగరాలు, మహొత్సాతాలు జరిగిపోయాయి. సకల విశ్వాసాలు, మతాలు, భావోద్వేగాలు జనించి గతించి తరించింది ఈ గడ్డపైనే. జాతి గుర్రాలు యద్దభూమిలో కదను తొక్కింది ఇక్కడే. మదపుటేనుగుల ఘీంకార ధ్వనుల్లో సైన్యాలు నలిగిపోయిందీ ఈ సీమలోనే. ఇక్కడే ఎన్నో పరాజయాలు. ఇక్కడే ఎన్నో జైత్రయాత్రలు...ఇక్కడి నుంచే ఎక్కడెక్కడికో దండయాత్రలు.
వింధ్యకు ఈవల ఇదే వైభవోజ్వల జీవన రంగస్థలం. ఇదే సుసంపన్న రాజ్యాలకు ఆలవాలం. ఇదే పసిడి రాసులకు ప్రసిద్దిచెందిన దక్షిణాపథం. పరాయిమూకలకు ఇదే యుద్ధభూమి. ఎన్ని జాతుల రక్తం ఏరులై పారిందో.... పరాజిత తెలుగు బిడ్డలు నౌకల్లో నదీలోయల్లో దూరదూర తీరాలకు సాగిపోయింది ఇక్కడి నుంచే. తెలుగుజాతి ముద్దు బిడ్డలు నదులు దాటి సముద్రాలు దాటి ఏ ఒడ్డుకు చేరితే అక్మడ ఒక నాగరికత వెలసింది. అక్కడ ఒక రాజ్యం అవతరించింది. అక్కడ మన సంస్కృతి విలసిల్లింది. బర్మా ఒక్కలప్ప, మగాడు, థాయి చామదేవి, వియత్నాం భద్రవర్మ ఇండోనేషియా సన్న రాజు, శ్రీలంకలో వెంకట రంగమ్మ అలనాటి వైభవానికి గట్టి చిహ్నాలుగా నేటికీ నిలిచిపోయారు.
తెలుగు నేలపై నాగరికత ఎప్పుడు పుట్టిందో ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఈ గర్భంలో ఎన్ని చరిత్ర సమాధులున్నాయో? ఈ నేల ఎంత విధ్వంసాన్ని చూసిందో? ప్రతి రాజూ గత రాజు చరిత్రను తుడిపేసే ప్రయత్నం చేశాడు. శత్రు శేషం శాసనాల్లో కూడా కనిపించకుండా చేశారు. హరోం హరా అంటూ శైవం, వీరశైవం తెలుగు నేల దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించిన కాలమూ ఉంది. జైనం వర్ధిల్లిన నేల కూడా మనదే. బుద్ధం శరణం గచ్చామి అని అడుగడుగునా శాంతి బోధ చేసిన కాలమూ ఉంది. ఎన్ని వాదాలు ఎన్ని తర్కాలు, ఎన్ని భావజాలాలు ఇక్కడ ఫలించి పుష్పించి మహా వృక్షాలుగా విస్తరించాయో....” ఓ క్షణం ఆగి కళ్లద్దాలు సరిచేసుకున్నారు.
“రెండు వేల ఏళ్ల నాడే తెలుగుజాతి ఎంతో కీర్తిని మూటకట్టుకుంది. రోమ్‌తో వ్యాపారం చేసింది. అందుకే ఎక్కడా దొరకనన్నీ రోమన్ బంగారు నాణేలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బయటపడ్డాయి. భరతజాతి కీర్తిశౌర్యాలను అశోకుడితో ప్రారంభిస్తారు. కానీ కోటిలింగాల రాజులు అశోకుడే కాదు మరే ఇతర రాజూ చేయని సాహసం చేశారు. నాణేలపై తమ పేరును రాసుకుని నేటికీ చిరంజీవులుగా మిగిలారు. చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి సమయంలో శాతవావాన సామ్రాజ్యానికి ఉత్తరాన రాజస్థాన్ నుంచి దక్షిణాన మైసూరు వరకు, తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు సరిహద్దులుగా ఉండేవి. మా గుర్రాలు మూడు సముద్రాల నీళ్లు తాగాయని గర్వంగా చాటుకున్న చక్రవర్తులు శాతవాహనులు. గుంటుపల్లి గుహాలయాలు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి గుహాలయాలు. తెలుగుజాతి విశిష్టసృష్టి అమరావతి శిల్చం. దేశవిదేశాలకు వ్యాప్తిచెందింది. అజంతా తొలినాటి గుహ చిత్రాలూ మనవే: రెండొ బుద్దుడిగా ప్రసిద్ది చెందినవాడు ఆచార్య నాగార్జునుడు ఈ నేల మీద పుట్టినవాడే. జెన్ బుద్దిజం సృష్టికర్త బోధిధర్ముడూ తెలుగు వాడే” అంటూ రాష్ట్రపతి కాసేపు ఆగారు. ఏదో ఆలోచిస్తున్నట్టు సుదూరంగా చూసి, మళ్లీ ప్రసంగించడం (ప్రారంభించారు.
“తెలుగు లిపి ప్రత్యేకత తలకట్టు. ఇళ్కడి వేంగి లిపే ఆగ్నేయాసియా దేశాలన్నిటికీ వ్యాప్తిచెంది ఆయా దేశాలలోని నుడులకు లిపిని అందించింది. కాకతీయుల కాలంలో తెలుగు లిపి, కన్నడ లిపి విడిపోయాయి. దేశభాషలందు తెలుగు లెస్స అంటూ ఎలుగెత్తి చాటాడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కాలంలో పాలనాభాషగా తెలుగు దక్షిణ భారతదేశం అంతా వ్యాపించింది. కర్నాటక సంగీతానికి తెలుగు వారి గొప్ప కానుక తెలుగు భాషే. తెలుగు వాగ్గేయకారులలో ఉన్నతోన్నతుడు అన్నమయ్య. పరిమాణంలోనే కాదు వైవిధ్యంలోనూ అన్నమయ్య రచనలు సాటిలేనివి. కర్నాటక సంగీతం అనగానే ముందుగా గుర్తుకువచ్చే పేరు త్యాగయ్య. కర్ణాటక సంగీతానికి త్యాగయ్య రచనలు పర్యాయపదాలయ్యాయి. నాట్యానికే నడకలు నేర్పింది ఆంధ్రనాట్యం, కూచిపూడి, భరతనాట్యం. తమిళుల మహాకవి సుబ్రమణ్యభారతి తెలుగును ప్రశంసిస్తూ సింధూ నదిలో పడవలో
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021
45