Jump to content

పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవల

డి.పి. అనూరాధ 90100 16555

(జరిగిన కధ)

(శీలంకలో లచ్చిమిని కలుసుకోవడమే కాదు అమెను పెల్లిచేసుకుని ఇండియా వస్తాడు సూర్యవర్మ. తెలుగు జాతి ఘనకీర్తి చరిత్రకు సంబంధించి థీమ్‌ పార్క్ నిర్మాణానికి ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. ఆఖరుకి జగమునేలిన తెలుగు” నవలకు శ్రీకారం చుడతాడు. ఆ నవల ప్రకంవనలు సృష్టించి భారత రాష్ట్రపతితో సూర్యవర్మకి పరిచయం ఏర్పడేలా చేస్తుంది. థీమ్‌ పార్క్ నిర్మాణ బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తుంది. ఆ తరవాత ఏం జరిగింది?)

నా దిల్లీ యాత్ర గొప్ప విజయం సాధించింది. భారత రాష్ట్రపతి తల్లాప్రగడ సత్వనారాయణగారిని కలుసుకోవడంతో నా జీవితమే మారిపోయింది. తెలుగుజాతి ఘనకీర్తి చరిత్ర థీమ్‌ పార్క్‌ ప్రాజెక్టు వెంటనే పట్టాలెక్కింది. నాగార్జునకొండకే నా మకాంను మార్చాను. అమ్మానాన్నలతో పాటు లచ్చిమి, బాబు హైదరాబాద్‌లోనే ఉన్నారు. నేను అక్కడికీ ఇక్కడికీ తిరుగుతున్నాను. రెండు రాష్ట్రప్రభుత్వాలు “తెలుగుజాతి ఘనకీర్తి చరిత్ర ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేబట్టాయి. జపాన్‌, కొరియా, అమెరికా సంస్థలు ఇందులో భాగస్వాములుగా చేరాయి. చరిత్ర, భాషాశాస్త్రం, పురాతత్వశాస్త్రం, వాస్తు శాస్త్రం, కృత్రిమ మేధ, శాస్త్ర సాంకేతికత శాఖలు సంయుక్తంగా పనిచేశాయి. ప్రాజెక్టు పూర్తవడానికి మొత్తం అయిదేళ్లు పట్టింది. వంద ఎకరాలలో తీర్చిదిద్దిన ప్రాజెక్టు ఇది. రెండు వేల ఏళ్ల కాలాన్ని వందేళ్లకు ఓ భాగంగా ఇరవై విభాగాలుగా విభజించారు. ఆయా శతాబ్దాల్లో జరిగిన ప్రధానఘట్టాలను 5డీ టెక్నాలజీతో ఆవిష్కరించారు. వర్చువల్‌ టెక్నాలజీ వినియోగించడం వల్ల ఆ సమయంలో మనమూ అక్కడున్నామన్న భావన కలుగుతుంది. విదేశాల్లోని ప్రాచీన తెలుగు రాజ్యాలు ఇందులో మరో భాగం. మయన్మార్‌, థాయిలాండ్‌, వియత్నాం, ఇండోనేషియా, శ్రీలంకలోని తెలుగు రాజ్యాల చారిత్రక ఆనవాళ్ల ప్రతిరూపాలను ఇక్కడ నిర్మించారు. ఆయా ప్రభుత్వాలు దీనికి కావలసిన సహకారాన్ని అందించాయి. దీనికోసం ఆ దేశాలన్నీ నాలుగైదు సార్లు పర్యటించాను. మయన్మార్‌ ప్పీడగాన్‌ పగోడా, థాయిలాండ్‌ వాట్‌ చామదేవి, వియత్నాం మిసన్‌ సిటీ, ఇండోనేషియా బొరబొదూర్‌, శ్రీలంక క్యాండి కోట ప్రతీరూపాలను ఈ ప్రాజెక్టులో నిర్మించడం విశేషం. యాఖై అడుగుల ఎత్తులో 18వ శతాబ్లికి చెందిన మయన్నార్‌ రాజు “మగాడు” శిల్పాన్ని ధీమ్‌ పార్క్‌ ప్రవేశం వద్దనే ప్రతిష్టించారు. ఆ ఒక్క శిల్పం చాలు తెలుగు పౌరుషాన్నీ రగల్బదానికి. విదేశాల్లో మన తాత ముత్తాతల, జేజెమ్మల ఘనకార్వాలను అందరికీ తెలిసేలా చేయాలన్న నా ఉద్దేశం నెరవేరింది. 'తెలుగుజాతి ఘనకీర్తి చరిత్ర థీమ్‌ పార్క్‌లోని ఈ అద్భుతాల దగ్గర ఒక్క నిమిషమైనా ఆగితే మన పూర్వీకులకు నివాళులు అర్పించినట్టే

రాష్ట్రపతి చేతుల మీదుగా నేడు ప్రారంభొత్సవం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్నే ముహూర్తంగా పెట్టాం. ఏంతో గొప్పరోజిది. ఇన్నేళ్లూ ఎన్నో ఆటుపోట్లకు లోనైన గుండె నేడు స్థిమితపడింది. నాగార్జునకొండలో కృష్ణమ్మ పరవళ్లు చూస్తూ మౌనంగా కూర్చున్నాను. లచ్చిమి, బాబు వచ్చారు.

“సూర్యా... పదేళ్ల నీ కల సాకారం అవుతోన్న రోజు. ప్రతి తెలుగువాడు గుండె మీద చేయి వేసుకుని గొప్పగా చెప్పుకునే ధీమ్‌ పార్ముని నిర్మించావు. ఇది నీ రోజు.” అంటున్న లచ్చిమి మాటలకు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

43