పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలాలను పాలిస్తుండగా క్రీ.శ. 1311 లో గుండయసాహిణి, మారయ సాహిణిగార్లకు పుణ్యంగా (బహుశ స్థానిక దేవాలయానికి) రేగడు భూమిని దానం చేసిన వివరాలున్నాయి. కాకతీయ గజసాహిణులు, ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నట్లు గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుల దుర్గి ఒప్పిచర్ల శాసనాల వల్ల ఈ ప్రాంతం గజసాహిణ్యుల పుట్టిల్లుగా తెలుస్తుంది.

ఇంకా ఈ ఊళ్లో ఏమైనా చారిత్రక ఆనవాళ్లున్నాయా అని విచారిస్తే, అక్కడున్న చిన్నపిల్లలు, కంపల్లో ఆంజనేయుని విగ్రహం, చిన్నగుళ్లో వీరుని విగ్రహం, దుర్గమ్మ విగ్రహాలున్నాయని, వాళ్లే ముళ్లుగుచ్చుకొంటున్నా లెక్క చేయకుండా రెండు ఫర్లాంగుల దూరంలో రాతి గుట్టలో ఇరుక్కుపోయిన నిలువెత్తు ఆంజనేయుని విగ్రహం దగ్గరకు తీసుకెళ్లారు. ప్రతిమా లక్షణం, శైలినిబట్టి, విజయనగర కాలానికి (క్రీ.శ. 16వ శతాబ్లి) చెందిందని తెలుస్తుంది. విగ్రహంచుట్టూ నాగజెముడు, సర్మారు కంప అల్లుకొనిఉంది. బతిమిలాడితే పిల్లలు ఒక గొడ్డలి తెచ్చారు. అరగంటలో కంపను తొలగించి, అపురూప ఆంజనేయుని విగ్రహాన్ని ముళ్లకంప చెరనుండి విముక్తి కలిగించినందుకు ఆనందమేసింది. పెద్దవాళ్లకంటే అమాయకులైన మీరే మేలని, పిల్లల్ని భుజం తట్టీ, మళ్లీ రోడ్డుమీదకొచ్చి, దుర్గి చేరుకొన్నాం. జగన్నాధంగారి పంచన, మంచంపై కొంచెంసేపు నడుము వాల్చి ఆయన చేసిపెట్టిన జెషధ భరిత ఆకుకూరల ఉప్మా తిని, సువాసనలు వెదజల్లుతున్న వేడివేడి కషాయం తాగి, శెలవుతీసుకొని, తిరుగు ప్రయాణమైనాను. ఒకప్పుడు సమథ, మమతలు పల్లవించిన, పల్లవులను మనకందించిన, పౌరుషానికి పురుడుపోసిన అణువణువూ నాగరికతను నింపుకున్న పల్నాడు చారిత్రక ఆనవాళ్లు నిలువెత్తు నిర్లక్ష్యానికి గురవటం నన్ను ఇప్పటికీ బాధీస్తూనే ఉంది. ఎప్పుడో ఎవరో ఒకరు, వీటిని ఉద్దరిస్తారన్న కొన ఊపిరి ఆశ నన్ను ఊరడించటానికి ప్రయత్నిస్తుంది.


32 వ పుట తరువాయి....... భారతీయ భాషాశాస్రజ్ఞుల సంఘం అధ్యక్షుడుగా......

చెప్పడానికి నేను బాధపడుతున్నాను. ఉస్మానియా పూర్వ విద్యార్థిగా ఉమామహేశ్వరరావు ఒక నిర్దిష్ట లక్ష్యంతో ఈ పదవిలోకి ప్రవేశిస్తున్నారు. ఆయన చేయాల్సిందేమిటంటే, మాతృభాషల్లో విద్యాభ్యాసన జరగాలి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుటి నుండి ప్రతి ఒకరు ఇది చెబుతున్నమాటే. కానీ ఎవరూ ఆచరణలో పెట్టలేదు. ఈయన చేయాల్సిందేమిటంటే విద్య అనేది రాష్ట్రాలకు సంబంధించినదిగా పరిగణిస్తున్నారు. రాజ్యాంగంలో మార్చు ఎక్కడ చేయాలంటే 'ప్రాధమికవిద్య రాష్ట్రాల పరిధిల్లో నుంచి తప్పించి కేంద్రం పరిధిలోకి తీసుకెళ్లాలి. కేంద్రమే ఒక ఆర్డినెన్స్‌ ద్వారా ప్రాథమిక విద్యాభ్యాసన అనేది కేవలం మాతృభాషలోనే జరగాలి అని ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఆ పని చేయడానికి ఉమామహేశ్వరరావే సమర్ధుడు. అతను ఆ లక్ష్యం పెట్టుకాని ఉన్నాడు కాబట్టి... ప్రాథమిక విద్యాభాసన పూర్తెన తరువాత అంకే భాషలోనైనా విద్యాబ్యాసం కొనసాగించవచ్చు. కానీ మొట్టమొదటి బీజం మాత్రం మాతృభాషలో పడాలి. దీనికి జనం ఏమంటారంటే మీరందరూఇంగ్లీషు మాధ్యమంలో చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్నారు కానీ మా మీద ఇది బలవంతంగా రుద్దుతారా? అనే ప్రమాదం ఉంది. దానికి నా సమాధానం నేను తప్పు చేశానని నీవు తప్పు చేయాలని చెప్పట్లేదు కదా. ఒక తప్పును ఒప్పు చేయడానికి ఎవరో ఒకరు నడుంకట్టాలి. మనం మొదలుపెడదాం. ఒక వ్యక్తి జీవితంలో యాఖై సంవత్సరాలంటే అది చాలా కాలం. స్వాతంత్ర్యం వచ్చి డేబ్సై ఏళ్ళు అయింది. కానీ పరిస్థితుల్లో మాత్రం ఏమీ మార్పు రాలేదు.కావాలంటే ఇప్పుడే మార్చుదాం. రాబోయే 700 ఏండ్లు అది నిలబడిపొతుంది. దానికి ఆయన నడుంకట్టుకొని పని చేయాలి. ఆయనకి అందరం సహాయం చేద్దాం.

- ఆచార్య జె. వెంకటేశ్వరశాస్త్రి, విశ్రాంత ఆచార్యులు భాషశాస్త్రశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం

భాషా శాస్త్రజ్ఞుల సంఘం (LSI) అధ్యక్షులుగా ఆచార్య ఉమామహేశ్వరరావు ఎంపిక కావటం ఎంతో ముదావహం. దక్షిణ భారత భాషావేత్తలు ఎవరికీ ఇంతవరకూ దక్మని ఈ గౌరవం మొదటిసారి ఆయనకే కాక అందరికీ దక్కిన గౌరవంగా భావించాలి. ఆయన స్థిరచిత్తుడు కాబట్టి కొంతకాలంగా సంకల్పించి కొనసాగిస్తున్న దేశభాషలలో విద్య అందరికీ అందేలా కృషి చేసి విజయం సాధించగలరు అని భావిస్తూ, ఈ దేశంలోని ఆదివాసీ గిరిజన భాషల అభివృద్ధి కోసం కూడా ఆయన కృషి చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూన్నా.

- ఆచార్య ఎ. ఉషాదేవి, విశ్రాంత ఆచార్యులు భాషాభివృద్ధి పీఠం, తెలుగు విశ్వవిద్యాలయం జి. ప్రవీణ్, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి, 8179407778.

“భాషా పెత్తనం స్వరాజ్యం కాబోదు. మొదటి ప్రాధాన్యత ఎల్లవేళలా మాతృభాషదే ఆ తర్వాతనే హిందీ భాష నిఖార్శయిన ఉన్నతి మాతృభాషతోనే సాధ్యం” “మాతృభాషను పణంగా పెట్టి ఆంగ్లభాషను నేర్చుకోవలసివస్తే అసలు ఆంగ్లభాషను నేర్చుకోవలసిన అవసరం ఏ దేశానికీ లేదు"

- మహాత్మాగాంధీ

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

36