పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాకతీయ శిల్చకళ ఉట్టి పడుతున్న వీరభద్ర, నరసింహా, సూర్య, చెన్నకేశవ, గణేశ, రతీమన్మధ,నాగరాజు శిల్పాలు ఒకనాటి దుర్గి వైభవ ప్రాభవాలకు సాక్షీ భూతాలు. ఉత్సవాలకు పులిమిన రసాయన రంగులు శిల్పాల ప్రాచీనతను తుడిపేశాయి. పూజారిని బతిమిలాడి, అనవసర అలంకారాలు, వస్త్రాలను అమ్మవారి ఒంటిమీదనుంచి తీయించి, అసలు స్వరూపం చూశాం. దుర్గ-మహిషమర్ధిని ఎంత అందంగా ఉంది. క్రీ.శ. 10వ శతాబ్ది ప్రతిమా లక్షణంతో అలరారుతుంది. అప్పుడు తెలిసింది, ఈ విగ్రహాన్ని గణపతిదేవుని అధికారి ప్రతిష్టించలేదని, అంతకుముందు మూడు శతాబ్దాల క్రితమే అక్మడ ఉందని. ఒకప్పుడు, ప్రసిద్దిగాంచి, ఆవూరికి ఒక పేరునిచ్చిన దుర్గమ్మ ఆలయం, ఆలనా పాలనా లేక చిక్కి శల్యమైనా శిధిల సౌందర్యం మాత్రం తొణికిసలాడుతూనే ఉంది.

దుర్గి వంకేశ్వరస్వామి దేవాలయంలో ఉన్న క్రి.శ. 1251 నాటి కాకతీయగణపతిదేవుని కొలువులో ఉన్న గండపెండేర గంగయ్యసాహిణి శాసనాన్ని చేత్తో తాకి చరిత్రను వంటబట్టించుకొన్నాను. 116 పంక్తుల ఈ శాసనంలో మొదటి 52 పంక్తులు, చివరి 10 పంక్తులు సంస్కృతంలోనూ, మిగతాది తెలుగులోనూ ఉంది. “ఇందులో ఏముందో చెబుతారా నాయనా” అని జగన్నాధంగారు అడిగారు. శాసనాన్ని చదువుతుంటే, నాదగ్గర ఏదో బ్రహ్మజ్ఞానమున్నట్లు ఆయన ఫీలై నావంక, ఆ శానసం వంక చూస్తూనే ఉన్నారు. ఇంతకీ ఆ శాసనంలో ఏముందంటే.... కాకతీయ గణపతిదేవుని పాదపద్నోపజీవి గండపెండార గంగయ్య సాహిణి, పానుగల్లు(నల్లగొండ జిల్లా)నుంచి, (కడపజిల్లా) మార్జవాడి దాకా రాజ్యంచేస్తూండగా, ఆయన మాండలిక సచివుడైన శ్రీకరణఅధిపతి, కాయస్థకులానికి చెందిన నామయ దుగ్య(దుర్గి) పట్టణంలో, తమతండ్రి వాయి పండితుల పేర వంకేశ్వరదేవరను 'ప్రతిష్టచేసి, కృష్ణాతీరంలోని నాగార్జునికోట(ఈ శాసనమే నాగార్జునికోటను తొలిసారిగా ప్రస్తావించటం గమనార్జం) తూర్పునున్న నెయ్పూరును, ఇదే దేవాలయంలో నాగేశ్వర, పాగేశ్వర దేవాలయాలకు, ఆలయం కట్టిన శిల్సి కాడొజుకు భూమిని దానం చేసిన వివరాలున్నాయి. ఇదే ఆలయంలోనున్న క్రీ శ 1297లో ప్రతాపరుద్రుని అధికారి, స్థానిక పాలకుడైన గొంగుల పోచినాయుడు వంకేశ్వరదేవునికి భూమిని దానం చేసిన శాసనముంది. ఇక్కడే ఉన్న క్రీ.శ. 1518, నవంబరు,22 నాటి శ్రీకృష్ణదేవరాయని శాసనంలో ఆయన అధికారి పెదసింగమనాయకుడు, వంకేశ్వర, వీరేశ్వర(వీరభద్ర) ఆలయ అంగరంగభోగాలకు, గుండాలలోని మెట్ట, మాగాణి భూముల్ని దానం చేసిన వివరాలున్నాయి. ఈ శాసనాన్ని ఆలయ ధ్వజస్థంభం పీఠంలో బిగించటాన సగం శాసనం పూడుకుపోయింది. సరిగ్గా ఇదే శాసనాన్ని పరిశీలిస్తున్నపుడు, ఆం.ప్ర.మాజీ ఉపసభాపతి, మండలి బుద్దప్రసాద్‌గారు ఆలయంలో కొచ్చారు. నాగాయలంకలో 'ప్రతిష్టించటం కోసం కృష్ణవేణీ మాత విగ్రహాన్ని చేయిద్దామని, ఆయన దుర్గి వచ్చి, కృష్ణదేవరాయ శాసనాన్ని సందర్శించటం, అనుకోని సంఘటన!

తరువాత వేణుగోపాల (గోపీనాథ్‌) ఆలయాన్ని అక్కడున్న క్రీ.శ. 1269 నాటి శాసనాన్ని చూశాం. గమ్మత్తేమిటంటే, ఈ శాసనంలో కాకతీయగణపతిదేవ మహారాజుల(పట్టొ)ద్దతియైన శ్రీరుద్రమహాదేవి అని పేర్శొనబడటం శాసన పరిశోధకుల దృష్టినాకర్షించింది. రుద్రమదేవి గణపతిదేవుని కుమార్తె. ఇందులో పట్టపురాణిగా పేర్కొనటం బహుశ శాసన రచయిత, లేక చెక్కిన శిల్పి తప్పుగా భావించాలేతప్ప, మరోటి కాదని బుద్ధప్రసాద్‌గారికి, జగన్నాధంగారికి, చెన్నుపాటి శీనుకు విడమరచి చెప్పాను. ఈ శాసనంలో ఆనాడు, ఆలయాల్లో ఉన్న అనేకరకాల ఉద్యోగుల వివరాలున్నాయి. ఇదే ఆలయంలోనున్న క్రీ.శ.1297 నాటి శాసనంలో గొంగుల పోలినాఇండు, గోపీనాధుని అంగరంగ భోగాలకు అడిగప్పల (ఇప్పుడు ఈవూరిని అడిగొప్పుల అని పిలుస్తున్నారు) వైపుగల పొలాన్ని దానంచేసిన వివరాలున్నాయి. ఆనాడు ఆలయాలకు అత్యంత భక్తి శ్రద్ధలతో అర్చన, ఉత్సవాల నిర్వహణకు భూముల్ని దానం చేయగా, దేవుని భూముల్ని చౌకగా అతి తక్కువ కౌలుకు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి, 2021

34