పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తమ ప్రధానకర్తవ్యమనీ తెలిపారు.

ఆంగ్లం కారణంగా భారతీయ భాషలకు ముప్పుందని గ్రహించి స్వాతంత్రానికి పూర్వం 1928 లోనే ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేస్తూ, 'దేశంలో అల్పసంఖ్యాక, ఆపన్న అంతరించే దశలో కొన్ని భాషలున్నాయి, వీటన్నింటిపై ప్రత్యేక శ్రద్ద పెడతాం.' ఈ సంఘం ఆధునిక యుగంలో వచ్చిన, వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని భారతీయ భాషలకు యంత్రానువాద వ్యవస్థలను అభివృద్ధి చేస్తామని దానిద్వారా భాషాశాస్త్రాన్ని భారతీయ భాషలను అభివృద్ది చేయడానికి ఎక్కువ ప్రాదాన్యత ఇస్తామని ఆచార్య గారపాటి తెలియజేశారు. ప్రధాన భాషలకు సంగణక ఉపకరణాలు తయారు చేసి అంతర్జాలంలో విరివిగా వాడేలా చూస్తాం. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి భాషనూ జాతీయ భాషగా గుర్తించేలా కృషి చేస్తాం. అని ఆయన ఈ సందర్భంగా 'అమ్మనుడి 'కి తెలియజేశారు.

అడకా : భాషల యంత్రానువాద పద్ధతుల్లో ఇంకా చాలా సమస్యలు ఎదురువుతున్నాయి కదా?

బదులు : సమాచార మార్పిడిలో యంత్రానువాద పద్ధతులు మరింతగా రావాలి. ప్రస్తుతం కృత్రిమమేధను ఉపయోగించి చేస్తుండటంతో పని సులువవుతోంది. ఈ దశాబ్దం చివరికల్లా ప్రధాన భారతీయ భాషలకు యంత్రానువాద పద్ధతులు అందుబాటులోకి వస్తాయి.అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

అడక : పిల్లలు మాతృభాషకు దూరం అవుతున్నారు. దీన్ని ఎలా నివారిస్తారు?

బదులు  : ఈ తరం పిల్లలకు మాతృ భాష వచ్చు కానీ చదవడం, రాయడంలో మెలకువలు రావడం లేదు. ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల కంటే నగరాల్లోనీ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. మన సాహిత్యం చదివితేనే మంచీ చెడూ తెలుస్తాయి. సామాజిక స్పృహ, దేశం పట్ల నిబద్దత, సమాజం పట్లా బాధ్యత చిన్నప్పటినుంచే అలవడాలి. అందుకే ఉన్నత పాఠశాల వరకైనా మాతృభాషలోనే బోధన జరగాలి.

అడక  : కొన్ని రాష్ట్రాలు ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నాయి కదా!

బదులు  : అది కచ్చితంగా తప్పుడు నిర్ణయం. అలాంటివారికి భాషల గురించి అవగాహన లేదనే చెప్పాలి. ఈ తరహా నిర్ణయాలు అమలుచేసే ముందు భాషాశాస్త్రవేత్తలూ, సామాజిక శాస్రజ్జ్డులూ సాహితీవేత్తలూ మొదలైనవారితో చర్చించి వారి అభిప్రాయం తీసుకొనివుండాల్సింది. అలాంటివేమీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఎజెండాని అమలు చేయాలనే లక్ష్యంతో భాష గురించి ఆలోచించడం లేదు.

భారతీయ భాషాశాస్తజ్ఞుల సంఘ అధ్యక్షులుగా ఆచార్య గారపాటి గారు మాతృభాషలని అభివృద్ధి పరిచి మరింత ముందుకు తీసుకెళతారని కోరుకుందాం. ఈ సందర్భంగా పలువురు భాషాావేత్తల మెచ్చుకోళ్లను, ఆశలను, ఆకాంక్షలను ఇక్కడ ఇస్తున్నాం:

నేను లింగ్విస్టిక్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అధ్యక్ష పదవికి శ్రీ ఉమామహేశ్వరరావు పేర తీర్మానాన్ని ప్రవేశపెట్టాను. ఆపైన మద్దతు తెలిపాను. రావు అధిక సంఖ్యాకుల మద్దతుతో గెలిచారని తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఒక మంచి పండితుడిగా, పరిశోధకుడిగా, నాయకుడిగా ఎదగడం నేను చూశాను. ఆయనకు పనిపట్ల ఉన్న నిబద్ధతను చూసి నేను ముగ్దుడనయ్యాను. భిన్నత్వం లేక వైవిధ్యం తగ్గుముఖం పడుకున్న సమయంలో మరియు భాషా అధ్యయనాలు న్వపయోజనాలకు పరిమితమవుతున్న సమయంలో, నేను ప్రాంతీయమైన మరియు ప్రాదేశికమైన భావాలను అధిగమించి ఎదగగల నాయకుడూ అతని బృందం అవసరమని అనుకున్నాను. భారతీయభాషాశాస్తజ్ఞుల సంఘాన్ని భాషాశాస్త రంగంలో అత్యున్నత ప్రభుత్వేతర సంస్థగా నిర్మించాల్సిన సమయం ఇది అని నా అభిప్రాయం. డాక్టర్‌ జి. ఉమమహేశ్వరరావు దేశంలో భాషాశాస్త్రం యొక్క పునరుద్దరణకు మంచి నాయకుడిగా ఉంటారనీ దాని వైవిధ్యం కోసం, ఐక్యత కోసం కృషి చేస్తారనీ నేను ఆశిస్తున్నాను- పద్మశ్రీ ఆచార్య దేవీ ప్రసన్న పట్టనాయక్‌, పి. హెచ్‌డి. డిలిట్‌. (కార్నెల్‌) ఫాండర్ డైరెక్టర్‌, భారతీయ భాషాకేంద్రం, మైసూరు, ఛాన్సెలర్‌, సెంచూరియన్‌ విశ్వవిద్యాలయం

తలపెట్టిన పనిని సాధిస్తాడు, విద్యారంగంలో అనేక ప్రణాళికలను పట్టుకొని చేపట్టి, వాటి అన్నింటికీ ఫలితాలు తీసుకువచ్చారు. ముఖ్యంగా సహజ భాషా సంగణక ప్రక్రియలూ (నాచురల్హ్యాంగ్వేజ్‌ ప్రోసెసింగ్‌, ఎన్‌. ఎల్‌.వి. ), తెలుగు, హిందీ, తమిళ భాషల మధ్య యంత్రానువాద వ్యవస్థలను అభివృద్ధి చేయడం, భారతీయ భాషలకు పదాంశాత్మక ఉపకరణాలను తయారు చేయడం మొదలైనవి. ఇంత విసృత స్థాయిలో పరిశోధనలు చేసినవారు భారతదేశంలో ఎవరూ లేరు. చారిత్రక భాషాశాస్త్రంలో శిక్షణపొందినా, ఇలా ఆధునిక రంగమైన కంప్యుటేషనల్‌ లింగ్విప్టిక్స్‌ రంగంలో విశేష కృషి చేయడం చాలా గొవ్చ విషయం. అభినందనీయం. ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా అక్కడ అభివృద్ధికి కృషిచేస్తారు. -ఆచార్య కె.వి.సుబ్బారావు, విశ్రాంత ఆచార్యులు, భాషాశాస్త్ర విభాగం, ఢిల్లీ విశ్వవిద్యాలయం

ఏ పనైనా సరే సాధించాలనుకుంటే దానీకి మూడు విషయాలు అవసరం. ఒకటి అవగాహన, రెండు తోడ్పాటు, మూడు పట్టుదల. ఈ మూడు ఉమామహేశ్వరరావుకి ఉన్నాయి. ఆయనకు అండ ఉంది. పునాది భాషకు ప్రజల యొక్క బుద్ది పెంపుదలకు ఉన్న సంబంధం చాలా చక్కగా తెలుసు. అందుకే పునాదిభాషే బడిభాప్టై ఉండాలి, అదే సంస్కారం నేర్పించే భాషపై ఉండాలన్నది ఆయన అభిప్రాయం. ఇది చాలా సరైనది కనుక ఆయన తన పదవి సమయంలో అవసరమైన మద్దతు తీసుకాని మంచి ఫలితాలని సాధిస్తాడని ఆశిద్దాం.

- ఆచార్య వెన్నెలకంటి ప్రకాశం, విశ్రాంత ఆచార్యులు ఇంగ్లీషు,విదేశీ భాషల విశ్వవిద్యాలయం, 'హైదరాబాదు

నేను 1969 నుండి ఎల్‌.ఎస్‌.ఐ.లో మెంబర్‌గా ఉన్నాను. నాకు ఈ సంఘంతో దాదాపు 50 యేళ్ళ అనుభవం ఉంది. ఈ యాభై సంవత్సరాల్లో అధ్యక్ష హోదాలో కూర్చున్నవాళ్లు భాషకోసం చేసినది,పెద్దగా చెప్పుకోదగ్గదేమీ లేదు. వాళ్లు ఏదో వచ్చారు, అద్యక్షులుగా ఎన్నికయ్యారు, ఉన్న మూడు సంవత్సరాల్లో భాష గురించి, భాష ఔన్నత్యం గురించి ఉపన్వాసాలు ఇచ్చారు, సర్దుకొని వెళ్లిపోయారు. అంతే తప్ప అంతకంటే ఎక్కువ చేసిందేమీ లేదని

తరువాయి 36 వ పుటలో.......

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

32