పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భాషాశాస్రజ్జుల సంఘం


భారతీయ భాషాశాస్రజ్జుల సంఘం అధ్యక్షుడుగా

ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు

భారతీయభాషాశాస్రజ్జులసంఘ(లింగ్విస్టిక్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, ఎల్‌ ఎస్‌.ఐ.) అధ్యక్షులుగా

ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు ఎన్నికయ్యారు. ఆయన 2021 నుండి మూడేండ్లపాటు ఈ బాధ్యతలో ఉంటారు.

స్వాతంత్రాౣనికి పూర్వమే దేశభాషల వికాసమే లక్ష్యంగా 92 ఏళ్ల క్రితం అంటే 1928లో భారతీయ భాషాశాస్త్రజ్ఞ్జుల సంఘం (లింగ్విస్టిక్‌ సౌసైటీ ఆఫ్‌ ఇండియా, ఎల్‌ ఎస్‌.ఐ. ) లాహోర్‌లో జరిగిన ఐదవ ఒరియంటల్‌ కానఫరె న్ఫృరంెన్స్‌లో ఏర్పడింది. భారతీయ భాషాశాస్త్రాన్నీ భారతీయ భాషలనూ శాస్రీయంగా అధ్యయనం చేయడమే ఈ సంఘం యొక్క ముఖ్య లక్ష్యం. 1937లో ఈ సంఘాన్ని లాహోర్‌ నుండి కలకత్తాకు మార్చారు. ఆ తరువాత, 1945నుండి నడుస్తున్న ప్రఖ్యాత ఇండియన్‌ ఫిలలాజికల్‌ అసోసియేషన్‌ని 1955లో భారతీయ భాషాశాస్రజ్ఞుల సంఘంలో విలీనం చేశారు. అ తరువాత ఈ సంఘ కార్యాలయాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లింగ్విస్టిక్స్‌, డెక్కన్‌ కాలేజీ పోస్ట్‌ గ్రాడ్యూయేట్‌ అండ్‌ రిసెర్చ్‌ఇన్‌స్టిట్యూట్‌, పూఱెకి తరలించారు. భారతదేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్నటువంటి సంస్ధ ఇది. ఈ సంఘం “ఇండియన్‌ లింగ్విస్టిక్స్‌ " అనే పేరుతో అంతర్జాతీయ పత్రికను ఒకదానిని ప్రతీ సంవత్సరం ప్రచురిస్తోంది. ఈ పత్రిక భారతీయ భాషలపై భాషాశాస్త్ర దృష్టితో జరిగే పరిశోధనలను ప్రచురిస్తుంది. ఇప్పటికి ఎనబై సంచికలు ప్రచురితమయ్యాయి. ప్రతీ సంవత్సరం ఈ సంస్థ ద్వారా భారతీయ భాషల వికాసం కోసం పరిశోధన, భాషాబొధన సమాచార వినిమయం, భాషానువర్తనాలపై జాతీయ, అంతర్జాతీయ సదస్సులను నిర్వహిస్తోంది. ఈ సదస్సులలో భారతదేశం నుండే కాకుండా జపాన్‌, అమెరికా, బ్రిటన్‌, ఆస్టేలియా, జర్మనీ, ఫ్రాన్సు, రష్యా మొదలగు దేశాలనుంచి సుప్రసిద్ధ భాషాశాస్రజ్ఞులు ఎందరో ఈ సదస్సులలో పాల్గొని భారతీయ భాషలపై పరిశోధనా పత్రాలను ప్రకటిస్తూ ఉంటారు.

ఈ సంఘం 42వ భారతీయ భాషాశాస్రజ్ఞుల అంతర్జాతీయ సదస్సును 2020 డిసెంబర్‌ 10-12 తేదీల్లో జి.ఎల్‌.ఎ. విశ్వవిద్యాలయం, మథురలో నిర్వహించింది. ఈ సదస్సులో ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావును 2021-2023 కాలానికి సంఘ అద్యక్షులుగా ఎన్నుకున్నారు.

భారతీయ భాషాశాస్తజ్ఞుల సంఘం అధ్యక్షులు

భారతీయ భాషాశాస్రజ్ఞుల సంఘ(ఎల్‌. ఎస్‌.ఐ. ) అధ్యక్షుడుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నిక కావటం 90 ఏండ్లలో ఇదే మొదటిసారి. వీరికి గడిచిన 35 సంవత్సరాలపాటు హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని అనువర్తిత భాషాశాస్త్రం-అనువాద అధ్యయన కేంద్రం డైరెక్టర్‌గా, డీన్‌ (విద్యార్థి సంక్షేమ విభాగం)గా వివిధ పదవుల్లో సమర్థవంతంగా పనిచేసిన అనుభవం ఉంది. వీరు గతంలో ద్రావిడ భాషా శాస్రజ్జ్డుల సంఘ అధ్యక్షులుగానూ, కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగానూ ఉన్నారు. ఈయన భారత భాషాశాస్త్రజ్జుల సంఘం (ఎల్‌ ఎస్‌.ఐ. ) అధ్యక్షులుగా ఎంపిక కావటం భారత దేశ భాషాశాస్రజ్ఞుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సుమారు వంద సంవత్సరాల క్రితం నెలకాల్పబడ్డ ఈ సంస్ద (ఎల్‌.ఎస్‌.ఐ) నేడు 130 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి భాషల అభివృద్ధికి తోడ్పడుతున్న సంస్థ.

ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు నేతృత్వంలో రాబోయే సంవత్సరాలలో, మాతృభాషా మాధ్యమం, మాతృభాషా బొధన విధానాలు, భారతీయ భాషల అధ్యయనం, జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుసరించి భారతీయ భాషల, ఆపన్న భాషల, అత్యాపన్న భాషల పరిరక్షణకు సంబంధించిన అంశాలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించే దిశలో ఎల్‌.ఎస్‌.ఐ. పనిచేస్తుందని ఆచార్య గారపాటి పేర్మాన్నారు. అంతేకాకుండా సాహిత్య బోధకులకు, భాషా బోధకులకు భాషాశాస్త్రం పట్ల అవగాహన కల్పించడం, భాషాశా స్రజ్ఞులకు భాషాశాస్త్ర రంగంలో వస్తున్నటువంటి నవీన రంగాల గురించి, నవీన ఆవిష్కరణల గురించి తెలియ చేయడం కోసం వివిధ కేంద్రీయ, రాష్ట్రీయ విశ్వవిద్యాలయాలలో భాషాశాస్త్ర శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసేందుకు కృషిచేయనున్నట్టుగా ఆచార్య గారపాటి గారు తెలియచేశారు. ఆధునిక సమాచార వినిమయంలో విప్లవాత్మక మార్చులకు వీలు కలిగించేందుకు భారతీయ భాషలలో యంత్రానువాద వ్యవస్థల నిర్మాణానికి దిశా నిర్దేశం చేయటం ద్వారా భాషాశాస్త్ర రంగానికీ భాషల అభివృద్ధికీ అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని అభిప్రాయపడ్డారు.

భారతీయ భాషలు బతకాలన్నాా అత్యధిక జనాభా కలిగిన మన దేశ ప్రజలందరికీ ఉద్యోగ, ఉపాధి కల్చన జరగాలన్నా మాతృభాషా మాధ్యమ బొధనతోనే సాధ్యమవుతుందంటున్నారు. అమ్మనుడిలో చదువుకోకపోతే సృజనాత్మకత కుంటుపడుతుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాథమిక దశలో మాతృభాషలోనే బోధనను మళ్లీ మొదలుపెట్టేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఉన్నత పాఠశాల వరకు అమ్మనుడిలో భొధన ఉండాలన్నదే భాషాశాస్తజ్ఞుల అభిప్రాయమని పేర్ళొన్నారు. దేశంలో సుమారు 120 భాషలున్నాయనీ, పతి భాషకూ వ్యాకరణ రచన చేసి పాఠ్యగ్రంథాలు రచించి భాషలన్నింటినీ బడి భాషలుగా చేయడమే

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

31