పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేసిన కూరముక్కలు.

కొన్ని పదాల్ని ఇలా రూపాంతరించే ప్రక్రియలో భాగంగా వాటికి చివఱ 'క ' చేర్చవచ్చు. (సంస్కృత పదాల విషయంలో కూడా ఆ భాష వ్యాకరణం ఇందుకు అనుమతిస్తోంది). ఉదా:

ఒకర్తి - ఒకర్తుక
పడతి - పడతుక
పెంట - పెంటిక
ఎమ్ము - ఎముక మొ

12. ఒక పదానికి ఎన్ని అర్ధాలైనా ఉంటాయి గనుక ఆ అన్ని అర్ధాలకీ ఇంకో భాషలోని దాని సమార్ధకం కూడా ప్రాతినిధ్యం వహించాలంటే కుదరదు. సమార్థకాలన్ని సందర్భానుసారమైనవే గాని విదేశీ పదాలకి పూర్తిగా సోదర సమానాలు కావు. ఒక పదాన్ని ఇంగ్లీషులో ఎన్ని సందర్భాల్లో ఎన్ని అర్ధాల్లో వాడతారో మన తెలుగుపదం కూడా అన్ని అర్జాల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఆ సందర్భానికి తగిన అనువాదం చెయ్యగలిగితే చాలు. అసలు అలా ఏ భాషలోను ఉండదు. మనం 'ధర్మం” అనే పదాన్ని అనేక అర్ధాల్లో వాడతాం. సందర్భాన్ని బట్టి ఇంగ్లీషులో దానికి law, natural justice, natural law, morality, duty అని రకరకాలుగా అనువదిస్తారు. వీటిలో ఏ ఒక్క పదాన్నీ ధర్మానికి ప్రతినిధిగా ఎల్లవేళలా వాడడానికి అవకాశం లేదు.

18. లింగ నిరపేక్షాలు (Gender-neutral words) దొఱికితే మంచిదే. దొాఱక్కపోతే ఏం చెయ్యగలం ? అన్నీ భాషలూ ఇంగ్లీషులా ఉండాల్సిన పని లేదు. అయినా ఇంగ్లీషులో కూడా వస్తుతః లింగనీర పేక్షాలు లేవు. ప్రాచీన భాషల్లో అన్ని పదాలూ లింగసాపేక్షాలే (Gender-intensie words). (ఆ మాటకొస్తే ఏ భాషలోనూ లేవు). వారు ఒకప్పటి పుల్లింగాల్నే రెండు లింగాలకీ అనువర్తించడం మొదలు పెట్టి “అవే లింగనిరపేక్షాలు, పొ”మ్మన్నారు. కనుక తప్పనిసరి సందర్భాల్లో లింగసహితంగానే నిష్పాదించాల్సి ఉంటుంది.

14. ఇప్పటికే ఒక అర్థంలో వాడుకలో స్టిరపడ్డ పదాల్ని ముట్టుకోకూడదు. అర్ధమౌతుంది కదా అని ఒక పదాన్ని అనేక అర్ధాల్లో వాడడం మొదలు పెడితే అది చివఱికి అర్ధం కాకుండానే పోతుంది. ఎందుకంటే కొత్త పరిభావనల (concepts)కి ఎప్పుడూ కొత్తపదాలే కావాలి. వాటినీ ప్రజలకు నెమ్మదిగా అలవాటు చేయాలి. అంతేతప్ప వ్యావహారికవాద కండూతితో దొఱికిన/ తోచిన పాతపదాలతోనే తాత్మాలికంగా సరిపుచ్చుకుందామని ప్రయత్నించరాదు. అలా చేస్తే భాష ఎదగదు సరికదా, వాడుక పదాలన్నీ అవాంచితమైన నానార్ధాల్ని. సంతరించేసుకుంటాయి. వ్యవహారహాని ఘటిల్లుతుంది. ఆఖరికి భాష మొత్తం ఒక పేద్ద విప్పజాలని పొదుపుకథగా, అర్ధం చెప్పలేని అభంగశ్లేషగా, పరిష్కరణ దుస్సాధ్యమైన చిక్కుముడిగా మారుతుంది.

ఉదాహరణకు - ఒక దినపత్రికలో booking అనే మాటకు ఖరారు చేసుకోవడం అని వ్రాశారు. book చెయ్యడం, ఖరారు చెయ్యడం (finaliation/confirmation) రెండూ ఒకటి కావు. కొంత మంది యాబైవేలు బయానా ఇచ్చి ఒక స్థలాన్ని Book చేసుకుంటారు. కానీ వాళ్ళు మొత్తం ధరలో సగమైనా చెల్లిస్తేనే తప్ప ఆ స్థలం వారికి ఖరారు కాదు. bookingకి పుస్తకించడం అని అనువదిస్తే బానే ఉంటుంది, అంతకుముందు ఆ పదం మన భాషలో ఏ ఇతర అర్థంలోనూ లేదు గనుక, దాన్ని ఒక కొత్త రూపంతో, ఒక కొత్త అర్ధంలో వాడితే ఫర్వాలేదు.

15. పాతపదాల్ని కౌత్త సాంకేతికతలకి అన్వయించి వాడుకోవడం అవసరం. ఇందునిమిత్తం కొన్నిసార్లు నిఘంటువుల దుమ్ము దులిపి పాతపదాల్ని కొత్త అర్జాలలో పునరుద్దరించడానికి వెనుదీయకూడదు. ఉదాహరణకు, Fan అంటే ఒకప్పుడు విసనకఱ. ఇప్పుడది ఒక విద్యుత్‌ యంత్రంగానే గుర్తించబడుతున్నది. కొత్త సంస్కృతపదాల్ని సృష్టించడం కంటే ఉన్న తెలుగుపదాలకి నూతన అర్జావగతిని కల్పించడం, ఆధునికీకరించడ అవసరం. మనం ఈరోజు దాకా చెస్తూ వచ్చినది- అలా ఇబ్బడిముబ్బడిగా సంస్కృత పదాల్ని సృష్టించడం, అవి ఎవడైనా సరిగా పలక్కపోతే పలకలేదని బాధ పడ్డం, వాటిని ఇంగ్లీషు పదాల క్లుప్తతతో పోల్చి పరిహసిస్తే ఉడుక్కోవడం. తెలుక్కి నూతనపవ నిష్సాదనశక్తి లేదనడం సరైన అవగాహన కాదు. పదనిష్పాదన అనగానే మనం అసంకల్పితంగా సంస్కృతం వైపే పరిగెత్తడానికి అలవాటు పడిపోయాం . ఆ క్రమంలో మన దృష్టంతా - “సంస్కృత సమాసాల/ పదాల పరిశుద్ధతని ఎలా కాపాడాలి? తెలుగుని ఎలా దూరంగా పెట్టాలి ? హిందీని చూచివ్రాయడానికి అవకాశం ఏమ్టైనా ఉందా ? ఇలాంటివాటి మీద కేంద్రీకృతమవుతున్నది.

16. ఏదైనా ఒక కొత్త పదాన్ని నిష్పాదించేటప్పుడు దాని క్రియారూపం (erb form), నామవాచక రూపం (noun form), విశేషణ రూపం (adjectie form). కర్తృ రూపం (agency) కర్మరూవం (past participle form), ఉపకరణరూపం, కరణీయరూపం, శతృ-శానజ్‌ రూపం మొదలైన అనేక సంబంధిత రూపాల్ని దృష్టిలో ఉంచుకొని మఱీ నిష్పాదించవలసి ఉంటుంది. ఒకే పదానికి సంబంధించిన ఈ వివిధ నిర్మాణాలను పదకుటుంబం అని వ్యవహరించవచ్చు. విద్యావంతుడైన ప్రతి తెలుగువాడూ ఈ పదకుటుంబాన్ని స్వయంగా కల్పించేంత ప్రతిభావంతుడు కావాలి. అప్పుడే మనం ఇంగ్లీషుతో పోటీపడగలం. ఉదా :

క్రియారూపం బోధించు
నామవాచకరూపం జోధన
విశేషణరూపం బౌధనీకం బొధన్యం (బోధనకు సంబంధించిన)
కర్తృ రూపం బోధకుడు, బోధకి (బోధించేవారు)
కర్తృ విశేషణరూపం బోధకీయం/ బోధకీనం/ జోధకేరం/
బౌధకికం = బోధకుడికి సంబంధించినది
కర్తృ సమూహం బౌధక్యం = బోధకుల సమూహం
కర్మరూపం బోధితం (బోధించబడిన సబ్జెక్టు)
ఉపకరణరూపం బొధకం, బోధిత్రం, బోధని (బోధించే సాధనం)
కరణీయ రూపం బొధనీయం, బోధితవ్యం, బోధ్యం, బొధనాస్పదం, బొధనారం, బొధనయోగ్యం (బొధించ దగినది)
శతృశానజ్జో రూపం బొధయత్‌, బోధయంతుడు (అలాగే జీవత్‌, జీవంతుడు మొ)

17. తెలిసిన పదాల నుంచి కొత్త పదాల్ని నిష్పాదించడం సాధ్యం కానప్పుడూ, అలా నిష్పాదించినవి బాలేనప్పుడూ మన భాషాధ్వనికి అనుగుణంగా వినూత్న నామధాతువుల (brand new nominal roots) ని శూన్యంలోంచి సృష్టించాలి. అంటే అలాంటి పదాల విషయంలో మనం మానసికంగా ఆదిమకాలానికి మళ్ళాల్సి వస్తుంది.

నూతన పదాల నిష్సాదనకి మాండలాల వితరణ

వచ్చేసంచికలో....

____________________________ (తరువాయి వచ్చే సంచికలో...)

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

3