పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్పురింపజేస్తుంది.

ఉదా :- రాజభవనం. ఇది రాజు కంటేనూ, భవనం కంటేనూ వేరైన ఒక ప్రత్యేకమైన శ్రేణికి చెందిన కట్టడాన్ని సూచిస్తుంది. సమాసాల సౌలభ్యాన్ని ఆంగ్ల మేధావులు త్వరగానే గ్రహించారు. ఇప్పుడు సమాసాల్లేకుండా ఇంగ్లీషు మాట్లాడడమే అసాధ్యం. ఒకవేళ అలా మాట్లాడితే ఇంగ్లీషు రాదేమోనని జాలిపడడం కూడా జఱగొచ్చు.

అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన వైచిత్రి ఉంది. దీన్నొక ప్రత్యేకమైన పదనిర్మాణ భేదంగా గుర్తించినప్పటికీ, తాము వాడుతున్నవి సమాసాలు (word compounds) అని ఆంగ్లేయులకి ఇప్పటికీ తెలియదు. అలాంటి మిశ్రమాల్లో మొదటి పదం functional గా adjectie అవుతోందని వారు భ్రమిస్తున్నారు. ఆ మాటే తమ వ్యాకరణాల్లో (వాసుకుంటున్నారు కూడా! రెండుపదాలు కలుస్తున్నప్పుడు మాయమౌతున్న విభక్తి ప్రత్యయాల (prepositions) ని వివరించే వైయాకరణ బాధ్యత (grammarian's burden) గుఱించి మర్చిపోతున్నారు.

సమాసాలే మన భాషక్కూడా బలం. ఇంగ్లీషు వ్యాకరణాల్లా కాకుండా మన వ్యాకరణం సమాసాల్ని క్రొడీకరించి వర్గీకరించింది కూడా. అవి మన భాషలో ఇప్పటికే వందలాదిగా ఉన్నాయి. కాని ఆధునిక అవసరాలకి అవి సరిపోవు. మన భాషకున్న సమానశక్తిని సక్రమంగా వినియోగించుకుని చాలా కొత్త పదాల్ని సృష్టించుకునే సౌలభ్యం ఉంది.

9. సందర్బాంతర (ప్రకరణాంతర) ప్రయోగాలు : నామవాచకాల్ని క్రియాధాతువులు. (programming, airing, parenting, shopping, modelling, typing, cashing, triggering, highlighting, Focussing మొదలైైనవి) గా మార్చి ప్రయోగించడం ఇంగ్లీషుకు ఎంత ఊపునిచ్చిందో ఇది కూడా అంతే ఊపునిచ్చింది. సందర్భాంతర ప్రయోగాలంటే- సాంప్రదాయికంగా ఒక సందర్భంలో మాత్రమే వాడాల్సిన పదాల్ని ఇంకొన్ని ఇతర సందర్భాలక్కూడా అనువర్తించి వాడడం. అలాగే ఒక రంగంలో వాడాల్సిన సాంకేతిక పదాల్ని ఇంకో రంగానీకి ఆరోపించి వాడడం కూడా! ఉదా:- screen(తెఱ) నాటకాలకూ, సినిమాలకూ


చతుర్దితత్పురుషసమాసం చతుర్దీతత్పురుషసమాసం తృతీయా తకత్పురుషసమాసం సప్తమీతత్చురుషసమాసం షస్టీత త్చురుషసమాసం తృతీయా తత్పురుషసమాసం ద్వితీయాతత్పురుషసమాసం చతుర్జీ తత్పురుషసమాసం తృతీయా తత్పురుషసమాసం సప్తమీతత్చురుషసమాసం చతుర్లీతత్పురుష సమాసం తృతీయా తత్పురుషసమాసం


అన్వయించే మాట. దాన్ని సమా. సాంకే. (IT) రంగంలో కొన్నిరకాల పుటల్ని సూచించడానిక్కూడా వాడుతున్నారు. అలాగే, campaignకి ప్రాథమికంగా దండయాత్ర అని అర్ధం. కాని ఇప్పుడు దాన్ని ప్రచార యుద్ధం అనే అర్ధంలో కూడా వాడుతున్నారు. గుజ్టాల శారీరాన్ని (horse anatomy) అందులో భాగాల్నీ కార్లకీ ఇతర యంత్రాలకీ అన్వయించి ప్రయోగించడం కూడా జఱిగింది.

మూడో అధ్యాయం

నవీన పదనిష్పాదనకై కొన్ని మార్గదర్శకాలు

విస్తరిస్తున్న ఆధునిక విజ్ఞానానికీ వ్యవహారానికీ, అవసరాలకీ అనుగుణంగా కొత్త తెలుగు పదాల్ని కల్పించుకునేటప్పుడు కొన్ని ఆదర్శసూత్రాల్ని గమనంలో ఉంచుకోవడం అభిలషణీయం.

1. కొత్త వాడుకలు అలతి అలతి పదాలతో ఏర్పఱచిన చిఱుసమాసాలై ఉంటే మంచిది. పర్యాప్తమైన చిఱుతనాన్ని (optimum smallness) నిర్వచించడం కష్టం. కాని స్థూలంగా

(అ) తెలుగులిపిలో అయిదు అక్షరాలకి మించని పదాలూ,

(ఇ) ఒకవేళ అయిదు అక్షరాలకి మించినా, ఆఱేడు అక్షరాలు కలిగి ఉన్నా రెంటి కంటే ఎక్కువ అవయవాలు లేని సమాసాలూ చిఱువాడుకలు అని భావించవచ్చు.

2. సాఫీగా అర్హమయ్యే ఇంగ్లీషు పదాల (plain English terms)కి విశేషణాల (adjecties)తో కూడిన వర్ణనాత్మక పదజాలాన్ని సృష్టించడానికి పూనుకోకూడదు. అలాంటి ప్రయత్నం సాధారణంగా కొండవీటి చాంతాడంత సమాసాలకి దారితీస్తుంది. ఉదాహరణకు ధూమశకటం.

3. ఒకవేళ వూల ఆంగ్లపదమే. స్వయంగా ఒక సమాసమైనప్పుడు, దాన్ని రచయితలు ఒక ప్రత్యాహార (abbreisations)

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

28