Jump to content

పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాటల నిర్మాణం

-వాచస్పతి

పదనిష్పాదనకళ

The joy of coining new words!

(గత సంచిక తరువాయి...)


ఆంగ్ల మేధావులు తమ మాతృభాషలో
నూతన పదనిష్పాదన ఎలా చేశారు ?

కొందలు తలపోన్తున్నట్లుగా ఇంగ్లీషులో ఈనాడు మనకి కనిపించే పదాలు ఇతర భాషల నుండి మక్కికి మక్కి దిగుమతి చేసుకున్నవి కావు. ఆకాశం నుంచి హఠాత్తుగా ఊడిపడ్డవీ కావు. అవి మొదట్లో యావత్తు జనసామాన్వానికీ తెలిసినవీ కావు. వాటి వెనుక ఇంగ్లీషు మేధావుల కృషి చాలా ఉంది. అలాంటి కృషినే ఇప్పుడు చర్చిస్తున్నాం.

1. పోలిక (Analogy):- అంతకుముందున్న పదాలకి సంబంధించిన కొత్త పదాలు అవసరమైనప్పుడు ఆయా పదాల స్వరూపానికి కొద్దిగా మార్పులు చేర్పులూ చేసి వేఱే అర్ధంలో వాడారు. అంతకుముందు కేవలం uncanny అనే పదం ఒక్కటే ఉండగా canny అనే పదాన్ని కల్పించారు. అంతకుముందు gnostic (ఒక ప్రాచీన కైస్తవ శాఖ సభ్యుడు) ఒక్కటే ఉండగా agonstic (అజేయవాది, నాస్తికుడు) అనే పదాన్ని కల్పించారు. Outrage అనేది అచ్చమైన ఆంగ్లో-శాగ్జన్‌ పదం కాగా దానికి విశేషణంగా outrageous అని లాటిన్‌ శైలిలో కల్పించారు. అంటే ఉన్న పదాల నుండే కొత్త పదాల్ని కల్పించారు. అలా కల్పించడం ఇంగ్లీషు /లాటిన్‌ వ్యాకరణ సూత్రాలకు విరుద్దమైనా లెక్క చెయ్యలేదు. సూత్రాలు వర్తింప శక్యమైతే పాటించారు. పాటించడానికి అవకాశం లేనిచోట తోసిపుచ్చారు.

2. ధ్వన్యనుకరణ (Imitation) :- మనుషులు భావోద్వేగపు క్షణాల్లో చేసే అవ్యక్త కాకున్వరాలకీ, ధ్వనులకీ శబ్దప్రతిపత్తిని కల్సించారు. ఆ థ్వనులకి - తెలిసిన ప్రత్యయాల్ని జోడించి కొత్త పదాల్ని నిష్పాదించారు. ఆ క్రమంలో lispism,yahoo, pooh-poohing booing మొదలైన పదాలు పుట్టాయి. మనవాళ్ళు కూడా “చకచక, నిగనిగా నుంచి చాక చక్యం, నైగనిగ్యం, నిగారింపు మొదలైన పదాల్ని నిష్పాదించారు. అయితే ఈ ప్రక్రియ ఇటీవలి కాలంలో వెనకబట్టింది.

3.అర్జాంతర ప్రకల్పన (Semantic alteration) - సాధారణ పరిస్థితుల్లో భాష చనిపోదు. ఇసుమంత మారుతుందంతే ! ఇంగ్లీషువారు అంతకుముందున్న పదాలకే కొత్త అర్ధాల్ని అనువర్తించారు. Fan, straw,(cheque) leaf, web, portal మొదలైనవి ఈ కోవకి చెందినవి.

కానీ ఇలా చెయ్యాలంటే భాషాపటిమ కన్నా మనిషిలో కొంత కవితాత్మకత తోడవ్వాలి.

4 'పునరుద్ధరణా (Reial) :- భాషలో కొన్ని పదాలు బహు పాతవై ఉంటాయి. అవి నిఘుంటువులకి మ్యాతమే పరిమితమై ఉంటాయి. వాటిని ఇప్పుడెవఱౄ ఏ మాండలికంలోను వాడకపోవచ్చు. వాటికి సమానార్థకాలైన వేఱే పర్వాయ పదాలు ఇప్పుడు లభ్యమవుతూ ఉండొచ్చు. అంతమాత్రాన ఆ పాతపదాలు పనికిమాలినవి కావు. ఈ సత్యాన్ని ఇంగ్లీషు వారు లెస్సగా కనిపెట్టారు. ఆ పదాల పాత అర్జాలకి సరిపోలిన కొత్త అర్థాల్లో వాటిని వాడడం మొదలుపెట్టారు. ఆధునికంగా లభ్యమౌతున్న పదాలకి తోడు ఈ పాతపదాలు కొత్త అర్జాల సోయగాలతో జతచేతి ఇంగ్లీషు భాషని నవయౌవనంతో పరిపుష్టం చేశాయి. Olympics, carnial, domain మొదలైనవి ఇందుకు ఉదాహరణలు.

5. మాండలికాల విస్త లత వినియోగం (Uniersalization of dialects) ఇంగ్లీషులో ఎన్ని మాండలికాలు ఉన్నాయో ఎవఱికీ అంతుచిక్కదు. అయితే ఇంగ్లీషువారు అ మాండలికాలన్నింటిని సందర్భానుసారంగా ఉపయోగించుకుని భాషని శక్తిమంతం చేసుకున్నారు. మాండలిక పదాలకి ఇప్పటికే ఉన్న అర్ధాలకి తోడు కొత్త అర్ధాల్ని జతకలిపారు. కొన్ని సందర్భాల్లో Slang నుండి సైతం ప్రామాణిక భాషని సిద్దం చేశారు. ఉదాహరణకి jazz అనే పదం New Orleans రాష్ట్రంలో ఒక అశ్లీల క్రియాధాతువుగా మాత్రమే వాడుకలో ఉండేది. అదిప్పుడు ఒక గౌరవనీయమ్హైన సంగీత కళారూపానికి నామథేయమైంది.

6. మిశ్రపద నిష్పాదన (Hybrid coinage) :- ఇంగ్లీషులో ఇప్పుడు “చెయ్యదగిన” అనే అర్ధంలో క్రియాధాతువుల చివఱ చేర్చబడుతున్న able అనేది నిజానికి ఫ్రెంచి ప్రత్యయం. మొదట్లో ఇది adorable మొదలైన ఫ్రెంచి ఆదాన పదాలకి మాత్రమే చేఱేది. క్రమంగా దాన్ని దేశి ఇంగ్లీషు పదాలకూడా యథేచ్చగా చేర్చడం మొదలైంది. ఈ రోజు think, drink, eat, walk లాంటి అచ్చ ఇంగ్లీషు పదాలక్మూడా ఇలాంటి పరిణామాన్ని చూస్తున్నాం .

7. వైరిసమాన ఘటనం (Mixed compounds) మన సంప్రదాయంలో సంస్కృత పదాలతో జతకలిపి తెలుగుతో సహా ఏ ఇతర భాషాపదాలకైనా సరే సంధులు, సమాసాలూ చెయ్యడం అనాదిగా నిషిద్ధం. కలిసే సమాస అవయవాలు రెండూ సంస్కృత పదాలైతేనే వాటి మధ్య సంధి-సమాసకార్యాలు అనుమతిపాత్రం. ఆ రకంగా అవసరంలేని సంస్కృతపదాలు కూడా తెలుగులోకి సమాసాల రూపంలో యథేచ్చగా చొఱబడిపోయాయి. ఒకప్పుడు ఇంగ్లీషులో కూడా ఇలాంటి సంప్రదాయమే ఉండేది. లాటిన్‌ గ్రీకు పదాలతో శుద్దాంగ్ల పదాల్ని కలపకూడదు. అంతేకాక లాటిన్‌ సమాసాలు లాటిన్లో జఱగాలి. గ్రీకుసమాసాలు గ్రీకుతోనే జఱగాలి. లాటిన్‌ పదాలతో గ్రీకు పదాల్ని కలపకూడదు.

కాని ఆధునిక ఆంగ్ల మేధావులు ఈ సంప్రదాయాన్ని కావాలనే విశృంఖలంగా ఉల్లంఘించారు. తప్పలేదు, తప్పు లేదు. ఎందుకంటే సమాసంలో రెండో పదం కూడా ఆ భాషాపదమే అయివుండాలంటే, ఎంతమందికి లాటిన్‌ గ్రీకుల మీద పట్టుంటుంది ? అలా నూతన పదసృష్టి స్తంభించిపోతుంది.

8 సమాస ఘటనం (Word compounds) : ఆంగ్ల మేధావులు గత శతాబ్దాల్లో ఉనికిలో లేని కొన్ని వ్యాకరణ సంప్రదాయాల్ని తమ భాషలో ప్రవేశ పెట్టారు. వాడుకలో బహుళ ప్రాచుర్యాన్ని పొందినప్పటికీ ఆంగ్లవ్యాకరణాల్లో మాత్రం ఆ నిర్మాణాలకు ఇప్పటికీ సముచితస్థానం లేదు. వాటిల్లో సమాసాలొకటి. సమాసం రెండు వేఱువేఱు అర్థాలు గల పదాలతో ఏర్పడే మిశ్రమం. ఆ మిశ్రమం నుంచి ఉప్పతిల్లే కొత్త పదం ఒక కొత్త అర్ధాన్ని కూడా

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

27