మేధోశిఖరం, గాంధేయవాది
అంతర్జాతీయ ప్రముఖుడు ఇ. ఎస్. రెడ్డి
తెలుగువాడైన ఒక అంతర్జాతీయ ప్రముఖుడు 2020 నవంబరు 1వ తేదీన అమెరికాలో కీర్తిశేషులయ్యారు. ఆయనే శ్రీ
ఏనుగు శ్రీనివాసులురెడ్డి. తెలుగేతరులకు ఆయన ఇ.ఎస్.రెడ్డిగా పరిచితుడు.
1952లో నెల్లూరులో వుట్టిన ఇ.ఎస్. రెడ్డి మద్రాసు విశ్శ్చవిద్యాలయం నుండి పట్టభద్రుడైన తర్వాత న్యూయార్క్‌లో ఉన్నత విద్యాభ్యాసం చెశారు. అ తర్వాత ఐక్క్మరాజ్యసమితిలో చేరి మూడున్నర దశాబ్దాలపాటు పనిచేశారు. ఆ అంతర్జాతీయ సంస్థ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. ఐక్యరాజ్యసమితిలో ఆయన పలు బాధ్యతల్ని నిర్వహించారు. జాతివివక్ష (అపార్టీడ్)కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సారధిగా ఇఎస్ రెడ్డి సుప్రసిద్దుడయ్యారు. 1960ల నుంచి 1980ల వరకు దక్షిణాఫ్రికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని సమీకరించేందుకు ఆయన విశేష కృషి చేశారు.
పదవీ విరమణ అనంతరం కూడా ఆయన తన వ్యక్తిగత స్థాయిలో ఆ బాధ్యతలను నిర్వహించారు. జాతివివక్ష వ్యవస్థ ఆ బాధ్యతలను నిర్వహించారు. జాతివివక్ష వ్యవస్థ అంతిమంగా కూలిపోయినప్పుడు ఇఎస్‌రెడ్డి దక్షిణాఫ్రికాను సందర్శించారు. ప్రజలు, ప్రభుత్వం ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయనను అత్యున్నత పౌర పురస్కారంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం సత్కరించింది. దక్షిణాఫ్రికాలో సామాన్య ప్రజలు ఎందరో ఇ ఎస్ రెడ్డి పట్ల ఇటువంటి గౌరవాన్నే కలిగివున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇఎస్‌రెడ్డికి ఆర్దర్ ఆఫ్ ది కంపేనియన్స్ ఆఫ్ ఆలివర్ టాంబో పురస్కారాన్ని కూడా ప్రదానం చేశారు. అయితే సామాన్య ఆఫ్రికన్లు తనపట్ల ఇప్పటికీ చూపుతున్న గౌరవాదరాలే ఇఎస్ రెడ్డికి ఎనలేనివి అనడంలో సందేహం లేదు.
దక్షిణాఫ్రికా జాతి వివక్ష వ్వవస్థ నిర్మూలనకు కృషి చేస్తూ మహాత్మాగాంధీ జీవితం, కృషి పై ఇఎస్ రెడ్డి ప్రగాఢ ఆసక్తిని పెంపొందించుకున్నారు. గాంధీపై ప్రపంచవ్యాప్తంగా వెలువడిన వ్యాసాలు, పుస్తకాలు దాదాపుగా అన్నీ ఇఎస్ రెడ్డి వద్ద ఉన్నాయి. సబర్మతి ఆశ్రమం వెలుపల గాంధీనీ గురించిన ఇంత విస్తృత సమాచారం బహుశా మరెవ్వరి వద్ద, మరెక్కడా ఉండదనడం సత్యదూరం కాదు. ఈ సమాచార మంతటినీ ఆయన అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. వివిధ దేశాల స్మాలర్లు ఆ సమాచారాన్ని వినియోగించుకొంటున్నారు. గాంధీపై వెలువడిన అనేక గ్రంథాలు, రెడ్డి అందించిన సహకారంతోనే రూపు దిద్దుకున్నాయి.
ఇఎస్ రెడ్డి సతీమణి టర్కిష్ జాతీయురాలు. టర్కిష్ మహాకవి నజీమ్ హిక్మత్ కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించిన విదుషీమణి. ఈ దంపతులు మన్‌హట్టన్‌లో యాఖై సంవత్సరాలకు పైగా నివసించారు. అయితే నాలుగు సంవత్సరాల క్రితం కుమార్తె
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021
25