పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రెటర్‌ అయ్యాడు. పాశ్చాత్యులకు విద్యావిషయకంగా తోడ్పడినవారిని, అనువాదాలకు సహాయపడినవారికి మంచి జీతంతో ఉన్నతమైన ఉద్యోగాలు యిప్పించి కృతజ్ఞత చాటుకున్నట్టు- ఆయా దొరల జీవిత చారిత్రక క్రమం తెలియజేస్తుంది.

కాంబెల్‌ 1812 నుండి దేశభాషల అధ్యయన సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. అదే తర్వాత కాలేజి బోర్డుగా మారింది. ఈ బోర్డుకు కార్యదర్శిగా, పరీక్షాధికారిగా 1812 నుండి 1820 వరకు పనిచేశాడు. కాంబెల్‌ ప్రతిభను గుర్తించిన అధికారులు నిఘుంటువుకూడా తయారు చేయమని ఆదేశించారు. 1820లో బళ్ళారికి కలెక్టరుగా పనిచేస్తూనే నిఘంటు రచన ప్రారంభించి 1821కి పూర్తి చేశాడు. మామిడి వెంకయ్య ఆంధ్ర దీపికను ఆధారంగా చేసుకుని అదే క్రమంలో తయారుచేశాడు. మధ్యలో కొత్త పదాలను కలుపుతూ తెలుగు భాషకు ఇంగ్లీషు అర్జాలను వివరించాడు. 1848 నాటికి రెండు ముద్రణలను పొంది అత్యధిక ప్రతులు అమ్మకం జరిగినట్టు తెలుస్తుంది. 1849లో మూడవ ముద్రణ హిందూ ప్రెస్‌ మద్రాసు వారు వెలువరించారు.

1820లో బళ్ళారిలో కలెక్టరుగా ఉన్న సమయంలో తెలుగు విద్యావిధానంపై సమగ్రంగా నివేదిక తయారు చేశాడు. ప్రాధమిక దశలో మాతృభాష అవసరం గుర్తించి మాతృభాషలోనే విద్యా బోధనగావించాడు. అనంతరం ఇంగ్లీషువారికి అవసరమ్హైన చోటమాత్రమే ఇంగ్లీషు నేర్చించినట్టు Selections from educational Records 1840- 1853, E.d by JA Richey, Part II, 1922లో వివరాలు తెలుస్తాయి. జిల్లా కేంద్రాలలో పనిచేసిన అనంతరం 1827లో కాలేజి బోర్డు సభ్యుడయ్యాడు. ఈ కాలంలో మద్రాసు లిటరరీ సొసైటీ సభ్యుడుగా సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటూ సర్మారువారి తెలుగు ట్రాన్స్‌లేటర్‌ గా పనిచేశాడు. ఈకాలంలోనే పాఠశాలలో తెలుగు పుస్తకాల తయారీ, ప్రచురణ బాధ్యతలు కూడా స్వీకరించాడు. ఏ పనిచేసినా సాధికారికంగా నిరూపించి నిగ్గు తేల్చాడు. 1814లో విలియం కేరీ వ్యాకరణం, 1816లో కాంబెల్‌ వ్యాకరణం, 1817లో విలియం బ్రౌన్‌ వ్యాకరణం వచ్చినా అన్నింటికన్నా మిన్నగా ఉత్తమంగా కాంబెల్‌ వ్యాకరణం నిలిచింది. అనంతర వ్వ్యాకర్తలకు కూడా ఆదర్శ ప్రాయమయింది. తెలుగు భాషకు, తెలుగు సంస్కృతి పరిరక్షణకు కృషిచేసి ఆదర్శవంతంగా నిలిచిన కాంబెల్‌ నిత్యస్మరణీయుడు.

డాక్టర్‌ జాన్‌ లీడెన్‌ (1775-1811): చదువుకు పేదరికం అడ్డుకాదని యిష్టపడి పనిచేస్తే ఏదయినా సాధించవచ్చని అనుభవ పూర్వకంగా నిరూపించినవాడు దాక్టర్‌ జాన్‌ లీడేన్‌. గొర్రెల కాపరుల కుటుంబం నుంఛి వచ్చిన లీడెన్‌ ప్రాథమిక విద్యాబ్యాసంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. స్కాట్లాండ్‌ దేశానికి చెందిన లీడెన్‌ సమయం దొరికినప్పుడల్లా వివిధ భాషల అధ్యయనం చేసేవాడు. ఉన్నత విద్య చదివే క్రమంలోనే స్కాండినేవియన్‌ భాషలతోపాటు హిబ్రూ అరబిక్‌, పర్షియా భాషల్లో ప్రావీణ్యం పొందాడు. భాషల అధ్యయనంతోపాటు, శాస్త్ర విషయాలు చదివి నేర్చుకున్నాడు. ఆ ఉత్సాహంతోనే వైద్యశాస్త్రం చదివి పట్టభద్రుడయ్యాడు. ఎడింబరో విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించాడు. వైద్యశాస్త్రంతోపాటు తత్వశాస్త్రంలో కూడా కృషిచేశాడు. ఏది చదివినా అందులోని అనుపానులు చూసి, నిగ్గదీసి నికషోపలంపై నిలబడి వజ్రంలా మెరిసేవాడు. ప్రపంచంలోని ముఫ్పై భాషలను బాగా చదివాడు. మంచి వక్త-రచయిత. ఏ విషయాన్నైనా సాధికారికంగా మాట్లాడేవాడు. భారతదేశానికి 1803 ఆగష్టు 19వ తేదిన చెన్నపట్టణం కుంఫిణీ ఉద్యోగిగా వచ్చాడు. వచ్చిన వెంటనే తెలుగు - తమిళ - కన్నడ భాషల్లో ఎన్నో గ్రంధాలను సేకరించాడు. అంతకుముందే మెకంజీ పదహారు భాషల్లో ఉన్న 1568 గ్రంథాలను 264 సంపుటాల్లోకి ఎక్కించి 2070 స్థానిక చరిత్రలను, 8076 శాసనాలను సేకరించాడు. మెకంజీ లాగే బ్రౌనుదొర 2440సంపుటాల్లో 1273 తెలుగు లిపిలో ఉన్న గ్రంథాలు అన్ని సేకరించడం జూన్‌లీ డెన్‌ కి ప్రేరణ అని తానే చెప్పాడు. ఆ ప్రేరణతోనే దక్షిణాది భాషల్లో ఉన్న విలువైన లిఖిత సంపదను సేకరించాడు. తొలిగా మద్రాసు జనరల్‌ ఆస్పత్రిని నడిపే బాధ్యతను స్వీకరించాడు. వైద్యం చేయడంతోపాటు వైద్యశాస్త్ర పరిశోధనలు కూడా సమాంతరంగా కొనసాగించాడు. ఆ నేపథ్యంలో లీడెన్‌ ప్రకృతిలో లభించే ఖనిజాలు, లోహాలు, వృక్షజాతి మొక్కలు వాటి ఉపయోగం అవి రోగ నివారణకు ఎలా పనిచేస్తాయనేది పరిశోధించి, ప్రయోగించి సఫలీకృతుడయ్యాడు. అదే క్రమంలో దేశీయుల ఆచార వ్యవహారాలు, శరీర స్వభావాలు, స్థానిక పంటలు, అవి పండే కాలాలు, కార్తెలు ఏ పంట తర్వాత ఏ పంటలు వేస్తే మంచి దిగుబడి వస్తుందో తెలుసుకున్నాడు. వాటి ద్వారా కాలానుగుణంగా వచ్చే వ్యాధులు వాటి నివారణ మార్దాలు అన్వేషించి వైద్యం చేశాడు. కాలానుగుణంగా దొరికే ఆహార పదార్థాల ద్వారా రోగ నిరోధక శక్తి పెంచే మార్దాలు వివరించాడు. ఈ అనుభవాలన్నీ నోట్సు తయారు చేశాడు. ఈ క్రమంలోనే లీడెన్‌ పలుమార్లు జబ్బుపడ్డా ఆ సమయంలో కూడా సంస్కృత అధ్యయనం చేసేవాడు. అనారోగ్యంగా ఉన్న సమయంలో పారశీకం, హిందూస్టానీ భాషల్లోని కథలను అనువాదం చేశాడు. ఆరోగ్యం కోసం స్థలమార్చిడి జరిగే సమయంలో కూడా లీడెన్‌ భారతీయుల చరిత్ర, ఆచారాలు, మతపద్దతులు, క్షుణ్ణంగా తెలుసుకొని మంచిగా నోట్సు తయారు చేశాడు.

ఆయన ఇండోచైనా దేశంలోని జాతులు-భాషలు వారి సాహిత్యం పై వ్యాసాలు రాశారు. అన్నీ ఏషియాటిక్‌ రిసర్చస్‌ వాల్యూముల్లో ప్రచురితమయ్యాయి. వాల్యూం నం. 10లో ప్రచురితమైన వ్యాసం విద్యాధికులనాకర్షించింది. కుంఫిణీ వారి మన్ననలను పొందింది. అందువల్ల ఆయన్ని ఏషియాటిక్‌ సొసైటీ సభ్యుడిగా చేర్చుకోవడంతోపాటు కలకత్తాలోని పోర్ట్‌ విలియం కళాశాలలో హిందుస్థానీ భాషకు ఆచార్యుడుగా నియమితుడయే అవకాశం లభించింది. దీనికి అదనంగా కలకత్తాలో జడ్జిగా కూడా విధులు నిర్వహించే అవకాశం కలిగింది.

ఈ నేపథ్యంలో జావా ద్వీపంపై దండయాత్ర జరిగింది. కుంఫిజీ సేనలు లార్జ్‌ మింటో నాయకత్వంలో వెళ్లాయి. మింటోకి ద్విభాషీగా

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

21