డంకన్ కాంబెల్. శ్రీశైల, దక్షారామ, ఖీమేశ్వరమనే త్రిలింగాల నడిమిభాగం తెలుగువారి ఆవాసస్థానమనీ తెలుగుకే తెనుగు, ఆంధ్రము, జంటూ, వరుగి అనే పర్యాయ పదాలున్నాయని వివరంగా విశ్లేషించాడు కాంబెల్ మహాశయుడు. మూడు లింగాలను గుర్తించడానికి విస్త్రత పరిశోధనలు చేశాడు. ప్రాచీన చరిత్రకారులు ఆంధ్రదేశం గురించి భావించినవన్నీ ఉదహరిస్తూ వివిధ భారతీయ పురాణాల్లో ఆంధ్ర ప్రసక్తి ఉన్న ఉదాహరణల్లో వివరంగా తన వ్యాకరణ పీఠికలో రాశాడు. మెకంజీ దొర సేకరించిన రాత ప్రతులను, శాసనాలను, ఇతర ఆధారాలను వివరంగా ఆధారాలతో సహా విజయనగరరాజుల జాబితాను కాలానుగుణంగా వివరించాడు.
1807లో రైటర్ గా చెన్నపట్టణానికి వచ్చిన కాంబెల్ అక్కడే పండితుడుగా ఉన్న ఉదయగిరి నారాయణయ్యవద్ద ఆంధ్ర శబ్ద చింతామణిని చదివాడు. నారాయణయ్య నేతృత్వంలో ఐదేళ్ళపాటు ఆంధ్రకౌముది, అహోబల పండితీయం మొదలయినవి చదివాడు. చదివితే క్షుణ్ణంగా చదవాలి ఆసాంతం నేర్చుకుని ఆకళింపు చేసుకోవాలనే మనన్తత్వం కాంబెల్‌ది. ప్రతినిత్యం గురు సాన్నిహిత్యంలో చదివేటప్పుడు ఒక నోట్సు తయారు చేసుకునేవాడు. తను నేర్చుకున్న నోట్సు ఇతరులకు ఉపయోగపడాలనీ ఆరు 'ప్రకరణాల్లో 519 సూత్రాలతో ఆంధ్ర వ్యాకరణాన్ని ఇంగ్లీషులో రాశాడు. ఇది 1816లో అచ్చయింది. 19వ శతాబ్దంలో మద్రాసులో అచ్చయిన తొలిపుస్తకం యిది. “ఎ గ్రామర్ ఆఫ్ ది తెలుగు లాంగ్వేజ్ కామన్‌లీ టర్మ్‌డ్ జెంటూ, పెక్యూలియర్ టు ది హిందూన్ ఇన్ హాబిటింగ్ ది నార్త్ ఈస్టర్న్ ప్రావిన్సిస్ ఆఫ్ ది ఇండియన్ పెనిన్సులా” అనే టైటిల్‌తో ముద్రించాడు. జెంటూ అనే పదం యూరోపియన్‌లు సృష్టించారని అందుకే ఈ వ్యాకరణానికి ఆభాషలో తయారు చేశానని చెప్పాడు. ఈ పుస్తకం ఫోర్ట్ సెయింట్ జార్డ్ ప్రభుత్వానికి సమర్పించాడు. కళాశాల పక్షాన కాపీరైటు కొని, వారి ప్రెస్ లొనే అచ్చువేసి, ఇండియా గవర్నర్ జనరల్‌కి అంకితం యిచ్చాడు. కాంబెల్ వ్యాకరణంలో రోమన్ లిపి వాడాడు. ఇందులో ఆరు అధ్యాయాలున్నాయి. 1. తెలుగు అక్షరాలు 2. ద్విత్వ సంయుక్తాక్షరాలు. 3.నామవాచకాలు, సర్వనామాలు, 4. విశేషణాలు 5. (క్రియలు 6. వాక్య నిర్మాణం. ఆంధ్ర శబ్ద చింతామణినే అనుసరించినా దేశ్యానికి ప్రథమ స్థానమిచ్చాడు.
తొలి ప్రకరణమయిన తెలుగు అక్షరాలను విస్మరించాడు. శుద్దాంధ్రానికి ముఫ్పై ఏడు వర్జాలన్నాడు. క్ష-ఱ, పూర్జానుస్వారాలను, విసర్గను, హల్లుల్ని వర్ణమాలగ తెలిపాడు. ఉచ్చారణ విషయంలో తెలుగులో పదాది యకార, వకారాలు దోషమన్నాడు. సంస్కృత పదాదిలో అయి-అవులు వాడకూడదనీ, బు, బూలను రు-రూలు రాయతం దోషమన్నాడు. రెండో ప్రకరణంలో సంధిలక్షణం (పూర్వ) పదాంత (పర) పదాది వర్ణాలకి కలిగే మార్పుల్ని పద మధ్యస్వరలోపాన్ని సంధి అని నిర్వచనం చేశాడు. కళాద్రుత ప్రకృతి కాలను నిర్వచనం చేసి వివరించాడు. కళలకు సంధి రాకపోతే యకారం, ద్రుత ప్రకృతిలకు సంధి జరగకపోతే నకారం వస్తుందని తెలిపాడు. అత్వ-ఇత్వ-ఉత్వ సంధుల్ని సోదాహరణంగా వివరించాడు. ఎడు-అంత-ఏసి అన్న పదాలు, ఆకు -అన్ని -అమ్మ-అక్క-అయ్య-అత్త అవ్వ అన్న పదాలు పరమైనమపుడు ఎట్టి హ్రస్వాచ్చుకయిన సంధి నిత్యమని సూత్రీకరించాడు. ఉదా. చేరెడు - పోకంత - ఏనిమిదేసి - సుబ్బమ్మ-తాటాకు. తృతీయ ప్రకరణం దేశ్య తద్భవ, గ్రామ్య లక్షణాల వివరణ. దేశ్వాన్ని అచ్చ దేశ్యంగా పరిగణించాడు. దేశ్వాల్ని ప్రథమ, ద్వితీయ, తృతీయ దేశ్వాంగాలుగా విభజించాడు. డుమంతాలు ప్రథమ దేశ్యాలు. ము-ఎము-అము అంతమయ్యేవి ద్వితీయాలు. స్త్రీ సమములు తృతీయాలు. ఈ విభజననే గురుమూర్తి శాస్త్రి, ఉదయగిరి శేషయ్య, అబ్బయ్య నాయుడు వంటి దేశీయ వ్యాకర్తలు, సి.పి. బ్రౌన్, ఆద్దెన్ వంటి విదేశీయ వ్యాకర్తలు అనుసరించారు.
దేశ్వాలలోనే లింగ వచన విభక్తులతోపాటు జౌపవిభక్తికాల్ని వివరించాడు. తత్సమాలను నిర్దేశించి అజంత హలంతాలకయే కార్యాన్ని సూత్రీకరించాడు. హలంతాలలో ప్రతిహలంతానికి తత్సమరూపాన్ని ప్రదర్శించడమేకాక విశేష రూపాన్ని సహితం చూసి కొన్నింటికి గల ప్రధమాంత తుల్య, ద్వితీయాంత తుల్య ద్వైరూపాల్ని ఇచ్చాడు.
ఉదా: సంపద్ = సంపత్తు =సంపద
హానుమత్ -హనుమంతుడు =హానుమానుడు -హనుమ తత్సమాల తర్వాత తద్భవరూప ప్రక్రియ వివరణ ఉంది. కొన్ని అన్యదేశాల్ని ఉదాహరించి, సర్బనామాన్ని నిర్వచించాడు.
చతుర్ణ ప్రకరణంలో దేశ్య, తత్సమ, విశేషణాలను గూర్చిన వివరణ ఉంది. పంచమ ప్రక్రియలో క్రియారూప భేదాలున్నాయి. ఎద-ఎడి వీటిని భవిష్యదర్దక ప్రత్యయాలుగా గ్రహించాడు.
కర్తరి, కర్మణి - ప్రేరణార్జక - నపుంసకాలని (Neuter erb) క్రియలు నాలుగు విభాగాలు. భూత - వర్తమాన భవిష్యత్తధ ర్మార్ధ కాలని కాలాలు నాలుగు విధాలు. క్రియల్లో గ్రామ్యరూపాలు చూపాడు. కారకము - వాక్య నిర్మాణ విభాగం, కృత్తద్దితాలు ఆరవ ప్రకరణంలోని విషయాలు. ఈ విభాగంలోని వాక్యాలు నీతిబోధకాలు.
- ఉదా: స్త్రీలకు అణకువ మంచిది.
- మొగవాళ్ళకు థైర్యమే గత్యము
- మాటకు ప్రాణము సత్యము
- బోటికి ప్రాణము మానము.
ఆయా విభక్తులు ఏయే అర్ధాల్లో ప్రయుక్తాలో వివులీకరించాడు. రామాయణగాధల్ని అబ్యాసాలుగా చేశాడు. అనుబంధంలో సంఖ్యావాచకాలు, పరిమాణార్థకాలు, కొలమానాలు ఉన్నాయి.
ఈ వ్యాకరణంలో చెప్పుకోదగినవి ఆంగ్ల వ్యాకరణ పద్దతులు అనుసరించకుండా తెలుగు పద్దతులను, తెలుగు సంప్రదాయాలను వివరించడం అనంతర వ్యాకర్తలకు మార్దదర్శకమయింది.
కాంబెల్ వ్యాకరణ రచనకు సహాయపడిన నారాయణయ్యకు ఫోర్ట్ సెయింట్ జార్జ్ కళాశాలలో ఆంగ్ల విభాగాధిపతిగా ఉద్యోగ మిప్పించాడు. ఆ తర్వాత సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ జూడికేచర్‌లో ఇంటర్
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021
20