పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధారావాహిక

ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి,9848123655

పడమటి గాలితో

నివురు తొలగిన తెలుగు భాషాసాహిత్య సంపద (8)


పాశ్చాత్యులు భారతదేశంలో వర్తకం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. దానితోపాటు వాళ్ళ సిబ్బంది కూడా అనతికాలంలోనే పెరిగింది. కుంఫిణీ కాలువులో పనిచేసే తెల్లదొరలను సివిల్‌ సర్వెంట్బ్‌ అంటారు. భారత దేశంలోని గిడ్డంగుల్లో పనిచేసే సివిల్‌ సర్వెంట్లను క్రీ.శ. 1674లో నాలుగు వర్షాలుగా పరిగణించేవారు. ప్రాథమిక స్థాయి పనివాళ్ళను “అప్రెంటిస్” అనేవారు. వారికి అనుభవం వచ్చాక ఐదారేళ్ళలో చిన్నరైటర్‌గా ఉద్యోగోన్నతి పొందేవారు. ఆ తర్వాత కొన్నేళ్లకు పైగా అధికారుల మొప్పు పొంది పనితనం వచ్చాక జూనీయర్‌ ఫాక్టర్‌ గా ఆపై సీనియర్‌ ఫాక్టర్‌గా స్థిరపదేవారు. వీళ్ళని ఇంగ్లండ్‌ నుంచే తీసుకువచ్చేవారనీ ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో వివరించాడు. ఈ నేపథ్యంలో వ్యాకరణాలు, నిఘంటువులు, వాచకాలు మొదలయిన వాటి అవసరం ఏర్పడింది. లాటిన్‌, ఫ్రెంచ్‌ పోర్చుగీస్‌ తదితర భాషలకు తెలుగు జోడించారు. దేశీయులైన వాళ్ళు ద్విభాషీలుగానో అనువాదకులుగానో వారి వద్ద చేరేవారు. నిఘంటు నిర్మాణం చేసిన పాశ్చాత్యుల రచనలు వరుసగా వివరించడం ఈ వ్యాస రచనలో ఒక భాగం.

బెంజిమిన్‌ బ్రాన్‌ఫిల్‌:

బెంజిమిన్‌ బ్రాన్‌ ఫిల్‌ 1791లో నెల్లూరు కలెక్టర్‌గా పనిచేశాడు. 1793 నాటికి నూజివీడు కమిటీలో సభ్యుడు కావడంతో తెలుగు ఎక్కువగా వినియోగించవలసిన అవసరం ఏర్పడింది. అందువల్ల తాను తెలుగు మాట్లాడటమే కాకుండా తనకింద పనిచేసే అప్రెంటిస్ లకి తెలుగు నేర్పించవలసిన అవసరం కలిగింది. అందువల్ల 1793 జూన్‌ 7వ తేదీన నిఘంటు రచన ప్రారంభించాడు. ఇంతవరకూ బాగానే ఉంది. తెలుగు అక్షరమాల పూర్తిగా తెలియనివాడు తెలుగుభాషపై సాధికారికత లేనివాడు నిఘంటునిర్మాణం చేస్తే ఎలా ఉంటుందో బెంజమిన్‌ బ్రాన్‌ఫిల్‌ ఉదాహరణగా చెప్పొచ్చు. అంతకుముందే పేర్‌మోటల్‌ అనే ఫ్రెంచ్‌ పాదిరి కూర్చిన ఫ్రెంచ్‌ అక్షరాల క్రమంలోనే తెలుగు నిఘంటు నిర్మాణం చేశాడు. 'పైగా భాష కూడా ఆనాటి ప్రజల వాడుకభాష పండితుల వ్యావహారిక పదప్రయోగాలు మిళితం చేసి 823 పుటల నిఘంటువు తయారు చేశాడు. ఇతని నిఘంటువు అట్టమీద “చదివి చద్వుకొండా” అని ఉచిత ఉపదేశం చేశాడు. ఈ మాటను ఎడికాంబెల్, సి.పి. బ్రౌన్‌ తమ నిఘంటు పీఠికలో పేర్కొంటూ బెంజమిన్‌ రచనను అజ్ఞానపు రాతలని తేల్చి పారేశారు. ఐతే ఇక్కడో విషయం ప్రస్తావించాలి. తెలుగులో అసలు ఏ నిఘంటువు లేని రోజుల్లో ఈ సాహనం చేయడం, అదీ అచ్చువేయడం కొంత మెచ్చుకోదగిన విషయమే. అనంతరం 1794లో నూజివీడు జమిందారిపై నూపరింటెండేంట్‌గా, ఆ తర్వాత మచిలీపట్నం మూడవ డివిజన్‌ కలెక్టర్‌గా పనిచేసి 1804లో ఇంగ్లండ్‌ వెళ్ళాడు. అంతకుమించి బెంజిమిన్‌ బ్రాన్‌ఫిల్‌ విషయాలు తెలియవు.

విలియం హావెల్‌:

భారత దేశంలో 1706లో జన్మించాడు. బాల్యంలో చదువులు,ఆపై ఉన్నత చదువులు, కళాశాలవిద్య మొదలయిన వివరాలు తెలియవు. కానీ 1821 ప్రాంతంలో బళ్ళారిలో అసిస్టెంట్‌ గా చేరాడు. 1825 నాటికి కడపలో ఒక మిషన్‌ కేంద్రాన్ని ప్రారంభించి విద్యాలయాలు నెలకొల్పాడు. అనాథలకు, పేదలకు చదువునేర్పే పాఠశాలలు నామమాత్రంగా ప్రారంభించాడు. పేదలకు అవసరం మేర వైద్యం కూడా అందించాడు. 1842 వరకూ కడపలోనే పనిచేసి తెలుగు పుస్తకాలు తయారు చేశాడు. కొన్ని అనువాదాలు కూడా చేశాడు. 1834లో ఆంధ్ర వ్యాకరణము ముద్రించాడు. ఎ కాటికిజం ఆఫ్‌ తెలుగు గ్రామర్‌ (బళ్లారి 1834) అనే టైటిల్‌ తో ముద్రణ అయింది.

జాన్‌ కర్నక్‌ మారిస్‌:

జాన్‌ కర్షక్‌ మారిస్‌ 1798 అక్టోబర్‌ లో జన్మించాడు. తండ్రి జాన్‌ మారిస్‌ బొంబాయి సివిల్‌ సర్వీస్‌ కు చెందినవాడు. జాన్‌ కర్నక్‌ 1813-1815లో రాయల్‌ నేవీలో పనిచేశాడు. 1815-17 ప్రాంతంలో ఇంగ్లండ్‌లో ప్రాచ్య భాషలు బోధించే హెయిల్‌బరీ కళాశాలలో చదివాడు. 1818లో రైటరుగా చెన్నపట్టణానికి వచ్చాడు. కొంతకాలం సర్మారు వారి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.ఆ తర్వాత తెలుగు ట్రాన్స్‌లేటర్‌ గా, 1821లో మచిలీపట్టణంలో మెజస్టేటుగా, 1823లో ప్రభుత్వానికి అనువాదకుడిగా పనిచేశాడు. ఈ కాలంలోనే పాఠశాలల కోసం తెలుగు 'సెలక్షన్స్‌ సిద్దం చేశాడు. 1824లో సెయింట్‌ జార్డ్‌ కళాశాల బోర్డు సెక్రటరీగా, 1831లో బోగ్జ్‌ ఆఫ్‌ రెవెన్యూ సభ్యుడిగా, అనంతరం యాక్టింగ్‌ 'సెక్రటరిగా, 1832లో ప్రభుత్వానికి పూర్తికాలపు అనువాదకుడిగా పనిచేశాడు. ఈ కాలంలోనే తెల్లవాళ్ళకు తెలుగు నేర్పడం, తెలుగు వాళ్ళకు ఇంగ్లీషు నేర్పడం ప్రారంభించాడు. 1835 నాటికి మద్రాసు గవర్నమెంట్‌ బాంక్‌ సూపరింటెండెంట్‌ గా చేశాడు. ఈలోగా తాను తయారుచేసిన తెలుగు నిఘంటువు, వాచకాలు ముద్రించాడు. అనంతరం మద్రాను జర్నల్‌ ఆఫ్ లిటరేచర్‌ అండ్‌ సైన్స్‌ కి సంపాదకుడిగా వ్యవహరించాడు. తర్వాత ప్రతిష్టాత్మకమైన రాయల్‌ సొసైటీ సభ్యుడుగా ఉన్నాడు. 1846లో ఉద్యోగ విరమణ అనంతరం 1558లో మరణించాడు.

అలెగ్జాండర్‌ డంకన్‌ కాంబెల్‌

తెలుగు త్రిలింగ శబ్దభవమని తొలిగా చెప్పినవాడు అలెగ్జాండర్‌

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

19