పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12. నలి+ఏడు = నల్లేడు MARCHANTIOPHYTA ఇది ఒక ఎసిదరి పేరుతో పొందించిన ఇంగ్లీసు పేరు. నల్లేరులాగా పలకలకాడ కలిగినది. అందుకే నల్లేడు అన్నాం. పలకేడు అని కూడా అనవచ్చు.

13. తూడు+ఏడు = తూడేడు TRACHEOPHYTE తూడు కలిగినది.

14. బిత్తలి+ఏడు = బిత్తలేడు RHYNIOPHYTA ఆకులు లేకుండా బిత్తలి(నగ్నము)గా ఉండేది.

15. డాబు+ ఏడు = డాబేడు ZOSTEROPHYLLOPHYTA డాబు అంటే girds డాబు వంటి ఆకులు గలది.

16. నక్క+అడుగు +ఏడు =నక్కడుగేడు LYCOPODIOPHYTA తోడేలు అడుగువంటి ఆకులు కలది అని తెల్లము. పొందించడానికి చిన్నదిగా ఉంటుందని తోడేలును నక్కను చేసినాం. తోడేలడుగేడు అని కూడా అనవచ్చు.

17. మూ+పాయ+ఏడు = ముప్పాయేడు TRIMEROPHYTOPHYTA మూడు పాయలుగా చీలిన ఆకులుకలది.

18. ఆకు+ఏడు = ఆకేడు PTERIDOPHYTA కాండం, కొమ్మలు లేకుందా ఆకులు మట్టుకే ఉండేది.

19. విత్తు+ఏడు = విత్తేడు SPERATOPHYTE విత్తులు కలిగి ఉండేది.

20. విత్తు+ఆకు+ఏడు = విత్తాకేడు PTERIDOSPERMATOPHYTA ఆకేడులోనే విత్తులు కలిగినది.

21. మొగలి+ఏడు = మొగలేడు PINOPHYTA మొగలి వంటిది.

22. ఈత+ఏడు = ఈతేడు CYCADOPHYTA ఈత వంటిది.

23. వెలివిత్తు+ఏడు = వెలివిత్తేడు GYMNOSPERMAE వివృతబీజ వృక్షం.

24. లోవిత్తు+ఏడు = లోవిత్తేడు ANGIOSPERMAE ఆవృతబీజ వృక్షం.

25. ఒకబద్ద+ఏడు = ఒకబద్దేడు MONOCOTYLEDON PLANT ఏకదళ బీజపు మొక్క

26. కవబద్ద+ఏడు = కవబద్దేడు DECOTYLEDON PLANT ద్విదళ బీపు మొక్క

27. బూజు+ఏడు = బూజేడు FUNGI శిలీంద్రం.

28. నాచు+ఏడు = నాచేడు ALGAE శైవలం.

“అంతా బాగుంది కానీ, ఇన్ని ఇంగ్లీసు మాటలకు తెలుగుమాటలను ఫొందింఛినామే, సంసుక్రుతము నుండి వచ్చినవాటికి తెలుగుపేర్లను పొందించగలమా? మచ్చుకు, ద్రాక్షకు తెలుగుపేరును చెప్పు చూద్దాం” అంటూ తగులుకొన్నాడు చిన్నయ్య.

“తప్పక చెప్పగలను కానీ ఆ సంసుక్రుతములోకి పోయిన తెలుగుమాటలెన్నో ఉన్నాయి. కసరు చవి కాకరకాయను కూడా సంసుక్రుతము నుండి దిగుమతిగా చెప్పుకొనే మనవాళ్లకు తెలుగు కుదుర్లను వెతికే కోరిక ఎక్కడిది చెప్పు. ద్రాక్ష అంటే దప్పిని తీర్చేది కాబట్టి దప్పేడు అని పెట్టుకోవాలి” అని ముగించినాను. (తరునాయి వచ్చే సంచికలో..)

తప్పక చదవవలసిన 4 పుస్తకాలు ప్రముఖ రచయిత, కవి, నాటకకర్త, హేతువాది డా॥ మలయశ్రీ, రచనలు తొలి తెలుగు చక్రవర్హులు 1,2 భాగాలు:

కాకతీయులే మన తెలుగు సమస్తాంధ్రసామ్రాట్టులు. తొలి దశలో తొమ్మిది పది దశాబ్దాలలో కాకతీయులు చాళుక్య రాష్టకూటులకు దండనాథులుగా, మలిదశ - 11వ శతాబ్దిలో కళ్యాణి చాళుక్యులకు సామంతులు. 1158 నుంచి 1323 వరకు వీరు స్వతంత్ర చక్రవర్తులు. కాకతి చక్రవర్తులలో ప్రముఖులు నలుగురు. వీరి చరిత్రలు - జనజీవితాలను చిత్రిస్తూ డా॥ మలయశ్రీ నాలుగు చారిత్రక నాటకాలను రచించారు. ఒకటవ భాగంలో శ్రీ కాకతీయరుద్రదేవచక్రవర్తి(1158-1195), శ్రీ కాకతి గణమతిదేవ చక్రవర్తి(1199- 1262), రెండవ భాగంలో మహారాణి కాకతిరుద్రమదేవి(1262-1289) శ్రీ కాకతి రెండవప్రతాపరుద్ర చక్రవర్తి (1290-1328) మొదటిభాగం రు. 100లు, రెండవభాగం రు. 100లు. పరిష్కారం, మరి 15 కథలు - రు.100లు రచయిత : డా॥ మలయశ్రీ నిజమైన వేమన పద్యాలు - రు.100లుఎంపిక- కూర్చు-భావాలు : డా॥ మలయశ్రీ

పుస్తకాలకోసం డా|| మలయశ్రీ 1-113/7, ఆధిత్యభవన్‌, వేమననగర్‌, రేకుర్తి కరీంనగర్‌-505 451(తెలంగాణ) ఫోన్‌: 98665 46220

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

15