అన్నాను.
కాసేపటికి చిన్నయ్యా నారాయణా కలిసి వచ్చినారు. నారాయణ మూతిని నల్లగా పెట్టుకొని ఉన్నాడు. నేనే పలకరించినాను.
“నారాయణా, ఎందుకట్లా ఉన్నావు? మొన్న మనం పోట్లాడుకోలేదు, మాట్లాడుకొన్నాం అంతే నీకు పెరనుడి మీదున్న అక్మరను అమ్మనుడి మీదకు మరల్చాలని అనుకొంటున్నవాళ్లమే కాని నీకు ఎదిరివాళ్లం కాము. మామీద కనలు(కొపం) పడవద్దు” అన్నాను అనుగుగా. ఆ మాటతో నారాయణ మూతి విప్పారింది.
“అన్నయ్యా, “ఏడు” అనే చేర్చు ఒకటుందని ఆనడుమ ఒకసారి అన్నావు. ఏడు అనేది ఒక అంకె కదా!” అన్నాడు చిన్నయ్య.
“ఏడు అంటే అంకె మట్టుకే కాదు, ఏడాది కూడా. అంతేకాదు చేర్చుగా కూడా ఈ ఏడు కనబడుతుంది. వెతికే ఓపికలేక పట్టించుకోవడం లేదు మనం” చెప్పినాను.
“అయితే ఆ చేర్చును గురించి విడమరచి చెప్పవా” అడిగినాడు చిన్నయ్య..
“తెలుగులో విడి ఎసలు(గుణం) ఒకటుంది. ఉసురులు అయినా ఉరువులు అయినా, ఒకే కూటువకు చెందిన కొన్నిటికి, ఉమ్మడి కడసడులు ఉంటాయి. వాటినీ మనం చేర్చులుగా వాడుకోవచ్చు. కుందేలు, తాబేలు, తోడేలు, పొట్టేలులలోని “ఏలుతో ఇదివరకు “ఏలెసిది(జంతుశాస్త్రం) ఆనిమి మాటలను పుట్టించినాం కదా. ఇటువంటిదే “ఏడు” కూడా. నేరేడు, మారేడు, తంగేడు, జిల్లేడు, బొంజేడు, ఈడేడు, నాగేడు, కోయేడు వంటి చెట్ల పేర్లలో కడసడిగా ఏడు ఉంది చూడండి. దీనిని వాడి కొత్త మాటలను పుట్టించవచ్చు” అంటూ విడమరచి చెప్పినాను.
“ఏదీ నాలుగయిదు మాటలను పుట్టించి చూపించు అన్నయ్యా” అన్నాడు చిన్నయ్య. .
“నేను మలేసియాకు వెళ్లినపుడు, అక్కడి తెలుగువాళ్లు నాకొక పండును చూపించినారు. దాని పేరు దూరియాన్. మన పనసపండును పోలి, దానికంటే చిన్నదిగా ఉంది. ఒళ్లంతా పెద్ద పెద్దవి కూచిగా ముళ్లు ఉన్నాయి. ఆ పండు తలమీద పడితే, ముళ్లు దిగబడి చనిపోతారట. డూరియాన్ అంటే 'మలే” నుడిలో ముళ్లుకలిగిన పండు
అని తెల్లమట. ఆ చెట్టును కూడా దూరియాన్ చెట్టు అనే అంటారు. ఆ పండుకు తెలుగుపేరును పెట్టుమనీ నన్ను కోరినారు వాళ్లు. నేను 'ముళ్లేడు” అని చెప్పినాను. అట్లాగే డ్రాగన్పండు అని మనకు దొరుకుతున్నది కదా, అది మన జెముడుపండు వంటిదే. దానికి జెముదేడు అని పెట్టుకోవచ్చు. వెన్నవంటి గుజ్జు కలిగిన పండు కాబట్టి అవకాడడొను వెన్నేడు అనవచ్చు. కలివిపందును పోలీన జెర్రీలను కలివేడు అనవచ్చు” అని మారాడినాను.
“నువ్వు చెప్పినదానిని ఒప్పుకొంటాను. అయినా ఇది కొత్తదేమీ కాదు. మన పెద్దవాళ్లు కూడా, రామములక, రామగుమ్మడి, సీమచింత, మొగలిపనస, సీమరేగు వంటి కొత్తపేర్లను చెట్లకు పెట్టుకొన్నవాళ్లే కదా” అన్నాడు చిన్నయ్య.
“అవును, నువ్వు చెప్పినవే కాదు, తక్కోలం, తక్కాళి(టొమేటో), బూదిపుచ్చ(బూదిదగుమ్మడి), పరంగిపుచ్చ(తియ్యగుమ్మడి,, సీమపొగడ(సపోటా), చీనీనిమ్మ(బత్తాయి), గడ్దిచేమంతి, లంజిగొంజి(లంటానా), తురకవేప, గబ్బుతులసి, ఒయ్యారిబామ (పార్తీనియం).... వంటివి ఎన్నో ఉన్నాయి. అయితే ఏబై అరవై ఏళ్ల లోపు తెలుగువాళ్లలో ఈ అలవాటు అణగారిపోయింది. అన్నిచోట్లా ఉన్న ఇటువంటి మాటలను కూడా పోగేసుకోవాలి మనం. మలేసియా తెలుగువాళ్లలో బుట్టకూర (కేబేజీ), పూబుట్టకూర (కేలీష్లవర్) అనే మాటలున్నాయి. వాళ్లు పుట్టించుకాన్న మాటలివి. అయితే ఇవేవీ ఆనిమిమాటలుగా ఒదగవు కాబట్టి ఎసిదివి(శాస్రీయం)గా ఆనిమిమాటల పుట్టింపుకోసం “ఏడును తీసుకొన్నాను" చెప్పినాను.
“సరిగ్గా దీనినే అడగాలనుకాంటున్నాను. ఆ పండుకీ ఈ కాయకీ మాటలను పుట్టించడం కాదు ఒక ఎసిదికి చెందిన ఆనిమిమాటలను పుట్టించగలగాలి. అందుకు ఈ “ఏడు” ఒదుగుతుందా?” అంటూ డీకొన్నాడు నారాయణ.
“పూనుకొంటే పుట్టించగలం. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే పూనుకొందాం. ఏడెసిది(బోటనీ)కి చెందిన ఆనిమిమాటల గీకు, లాటిను కుదురులను తడుముదాం. ఆ కుదురులకు తెలుగు కుదురులను వెతుకుదాం. తెలుగుకుదుర్లకు 'ఏడు 'ను చేర్చుదాం. సరేనా నారాయణా” అంటూ మొదలిడినాను.
1. పూత+ఏడు = పూతేడు MAGNOLIOPHYTA పువ్వులు పూచేది.
2. పూత+ఆమి+ఏడు = పూతమేడు CRYPTOGAM పువ్వులు పూయనిది. “అమి” అనే తెలుగు చేర్పుకు 1698 అనీ తెల్లము.
3. నీరు+ఏడు = నీరేడు HYDROPHYTE నీటిలో ఉండేది.
4. తేలు+ఏడు = తేలేడు FLOATING PLANT నీటిలో తేలేది.
5. మునుగు+ఏడు = మునుగేడు SUBMERGED PLANT నీటిలోపల ఉండేది.
6. వరపు+ఏవడు = వరపేడు XEROPHYTE వరపు అంటే 4౧4 ఎడారిమొక్కలు.
7. ఇరు+ఏడు = ఇరేడు AMPHIPHYTE నేలనా నీటిలోనూ ఉండేది.
8 తీగ+ఏడు = తీగేడు CLIMBING PLANT
9. నేల+ఏడు = నేలేడు EMBRYOPHYTA| నేలమీద బతికేది.
10. పాచి+ఏడు = పాచేడు BRYOPHYTE
11. కాడ+ఏడు = కాడేడు HORNEOPHYTOPSIDA ఆకులు లేకుండా కాడలు మట్టుకే ఉండేది.
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021
14