పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలబై పొరట(పేజీీ)లను రాసి, వేరే పనుల ఒత్తిడితో పక్మన పడేసినాను. మరలా ఇన్నేళ్లకు దుమ్ముదులిపినాను.

తెలుగు ఎంతో చేవకలిగిన నుడి. చేతనయిన నుడి. ఇంత గొప్ప నుడి ఒడమి(సంపద)ని పాతర వేసి పెట్టేసి, పొరుగిళ్ల దగ్గర అడుక్కొని తింటున్నాం. ఇకనైనా మన కలిమిని వెలికితీద్దాం.


“కాపటేళ లేసింది కాపుగువ్వ
కానలోకి పోయింది కాపుగువ్వ
కడుపు బరువు దించింది కాపుగువ్వ
కాళ్లు కడుక్కోనొచ్చింది కాపుగువ్వ
కుంపట్లో బొగ్గునెత్తి కాపుగువ్వ, పల్‌
కసబిసా తోమింది కాపుగువ్వ
కాడిమడక కట్టుకొని కాపుగువ్వ
కాన దున్నేకి కదిలింది కాపుగువ్వ 7”

మా పక్కింట్లో ఒక ముసలవ్వ ఉంది. కాపటేళకే (వేకువనే) లేచేస్తుంది. వక్కరోట్లో వక్కాకును పెట్టి టక్కుటిక్కుమని దంచతా పైపాటను అందుకొంటుంది. ఇక మనం కునకాలన్నా కునకలేము. ఏదో నాలుగు నుడుగులు అయితే పోనీలే అనుకోవచ్చు. కాపటేళ నుండి మాపటేళ వరకూ కాపుగువ్వ చేసే పనులన్నీ ఉంటాయి ఆ పాటలో. నారుచల్లడం నుండి పైరుకోత వరకూ వరిపంట కాపుదన మంతా ఉంటుంది అందులో. చేయగలిగింది ఏమీ లేదు మేలుకొని లేవడం తప్ప.

లేచి పడకను చుట్టిపెట్టి, నీళ్లర(బాత్‌రూం)లోకి వెళ్లినాను. మరుగుదొడ్డి మునకతొట్టీ(బాత్‌ టబ్‌) ఒకే అరలో ఉంటాయి మాయింట. కడుపుబరువునీ దించినాను. చేగడుగు(హేండ్ వాష్‌)తో చేతుల్ని రుద్దినాను. పలుదుం(టూత్‌ బ్రష్‌) మీద పడడు(పేస్ట్‌)ను వేసుకొనీ పళ్లు తోముకొన్నాను. మూతిముక్కూ కడుక్కొన్నాను. తుండడ(టవల్‌)తొ తుడుచుకొన్నాను. కాసేపు పసలిక(వ్యాయామం) చేసినాను. మరికాసేపు సోదాకిక(వార్తాపత్రిక)ను తిరగేసినాను. ఆకలివేస్తుంటే నలిదిండి(టిఫిన్‌) చేసుకొందామనీ లేచినాను. కొద్దిగా నూక ఉంటే, ఉప్పిండి చేసుకొని తినినాను. కానీరు(కాఫీ) కాచుకొని తాగినాను. ఇవ్వేళ రాతపనేమీ లేదు. తోటపని కూదా లేదు. తోచక చిన్నయ్యవాళ్ల ఇంటితట్టుకు అడుగులు వేసినాను.

నన్ను చూనిన చిన్నయ్య, “రా అన్నయ్యా రా, నీకోసమే ఎదురుచూస్తున్నాం” అనీ రాకేర్చి(స్వాగతించి)నాడు నన్ను

అప్పటికే అక్కడ నారాయణ, సెందిల్‌ కూడా కూర్చుని వున్నారు. ఏదో పెనగువ(వర్చ) గట్టిగా జరుగుతున్నట్లుంది వాళ్ల నధుమ.

“ఉసురువం(ప్రపంచం)లో ఏమూలనుండి కొంగొత్త ఆనిమిమాట(సాంకేతికపదం) వెలువడినా, దానికి ఈదైనమాటను అన్నినుడులలోనూ పుట్టించలేము. ఉసురువంలోని ఏడువేల పైచిలుకు నుడులలో కొంగొత్త అనిమిమాటల పొందికకు అనువుఅయినవి సంసుక్రుతం, గ్రీకు, లాటిన్‌ వంటివి అయిదారుమట్టుకే ఉన్నాయి. ద్రావిదనుడులకు ఆ చేవ లేనేలేదు” అన్నాడు నారాయణ.

“ద్రావిడనుడులు అని అన్నిటినీ ఒకే గాటన కట్టద్దు. ఆనిమిమాటల పుట్టింపుకు మా తమిళ్‌ చాలా అనువయినది. మీకు తెలియదేమో, మేము మరెసిది(ఇంజినీరింగ్‌), విరుగెసిది(మెడిసన్‌ )కి చెందిన ఆనిమిమాటలను అన్నిటినీ తమిళ్‌లో పుట్టించుకాన్నాం” అంటూ తగులుకొన్నాదు సెందిల్‌.

“నారాయణా, తెలుగంటే నీకు చిన్నచూపు. సంసుక్రుతం మట్టుకే గొప్పనుడి అనీ నీ అనిపింపు. అందుకనే ఇట్ల మాట్లాడుతున్నావు” అన్నాడు చిన్నయ్య.

“ఉన్నమాట అంటే ఉలుకు ఎందుకు? నేను చెప్పింది నిక్కం. ఆనిమిమాటల్ని పుట్టించడంలో సంసుక్రుతానికి ఉన్న చేవలో ఒక్మవంతు కూడా తెలుగుకు లేదు” కుండబద్దలు కొట్టినట్లు అన్నాడు నారాయణ.

ఇక నేను కలిపించుకోక తప్పలేదు. “నువ్వు చెపుతున్నది తప్పు నారాయణా. నంనుక్రుతం ఒకప్పుడు మన బారతనాడులో పెన(అనుసందాన)నుడిగా ఉండేది. కాబట్టి రెండువేలేళ్ల నుండి వెయ్యేళ్ల కిందటివరకూ సంసుక్రుతంలోనే ఎసుదు(శాస్త్రా)లన్నీ వెలువడినాయి. ఆ తరిలోనే, ఆనిమిమాటలూ, వాటి పొందికకు కావలసిన పలు నుడిగంటు(నిగంటువు)లూ సంసుక్రుతంలో ఏర్పాటు అయినాయి. తెలుగులో ఆ పనిని ఇంతవరకూ మొదలు పెట్టలేదు. మొదలిడి చేసితే సంసుక్రుతం కంటే చిన్నమాటలతో తెలుగులో నెన్నాడి పుడుతుంది” అన్నాను.

“నువ్వు చెప్పేది నిక్కం అయితే, ఏదయినా ఒకమాటను పుట్టించి చూపించు. వెర్టిబ్రేట్‌ అనే ఇంగ్లీసు ఆనిమిమాటను, సంసుక్రుతం అనుగా తెలుగులో సకశేరుకం అనవచ్చు. దానికి ఎదురుమూట అకశేరుకం. వీటిని తెలుగుకుదురులతో ఎట్ల చెప్పగలం. వెన్నెముక తలవీ, వెన్నెముక లేనివీ అనీ విడమరవుగా చెప్పగలం కానీ ఆనిమిమాటలుగా చెప్పగలమా?” డీకొాంటూ అడిగినాడు నారాయణ.

“బాగా చెప్పగలం. చెప్పాలన్న కోరిక కలగాలి ముందు. తెలుగులో ఒక విడిత(ప్రత్యేకత) ఉంది. కొన్ని మాటలకు ఉమ్మడిగా ఒక్కొక్క చేర్పు కనబడుతుంటుంది. ఇట్లాంటి ఒక చేర్పు “ఏలు! ఇది విడిగా నుడిగంటులలో కనబడదు. ఇదివరకు చెప్పినట్లు, తెలుగులో ఇటువంటి పనులను మనం ఇంకా మొదలిడలేదు కాబట్టి, నిండైన నుడిగంటులు వెలువడలేదు. కుందేలు, తాబేలు, తోడేలు, పొట్టేలు, గొడ్డేలు, ఆడేలు అనే పేరులలో ఉమ్మడిగా “ఏలు” ఉంది. ఏలు అంటే 'జీవి అనే తెల్లం(అర్తం) తెలుస్తున్నది కదా. ఈ ఏలును చేర్చుగా చేసి కొత్త ఆనిమిమాటలను పుట్టించవచ్చు. నువ్వు అడిగింది అకశేరుకం, సకశేరుకం అనే రెండు మాటలకే. అకశేరుకాల్లోని తొమ్మిది వగలకు పేర్షను పెట్టలేక ఊరుకొన్నారు మీ సంసుక్రుతంవాళ్లు. అవి గ్రీకు, లాటిను మాటలుగా అట్లాగే ఉన్నాయి

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

12