Jump to content

పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొత్తమాట

స.వెం.రమేశ్

కొత్తమాటల పుట్టింపు

అందరికీ చేమోడుపులు. ఒక నుడిని బాగా ఎదిగిన నుడి అని చెప్పడానికి ఆనవాలు ఏమిటి అంటే, పెరనుడి నుండి వచ్చిన ఏ మాటకైనా తన కుదురులతోనే కొత్తమాట పుట్టింపుకు వీలు కలిగించగలగడం. అటువంటి నుడులు, అంటే బాగా ఎదిగిన నుడులు, వేళ్లమీద లెక్క్మించగలిగినన్నే ఉన్నాయి. మన బారతనాడులో వేలేండ్ల కిందటనే పాళీ, సంసుక్రుతం ఎదిగిన నుడులు అయినాయి. ఇటీవల తమిళం కూడా ఈ మట్టుకు చేరుకొనింది.

ఇట్ల తన కుదురులతోనే మాటలపుట్టింపుకు వీలుకలిగించే చేవ తెలుగుకు ఉందా అంటే లేదు లేనేలేదు అంటున్నారు తెలుగు తెలివరు(మేదావు)లు. ఉంది అనేది నా అందింత(ప్రతిపాదన). తెలుగులో ఇదివరకు ఎన్నడూ కొత్తమాటలు రాలేదా, ఎవ్వరూ కొత్త మాటల్ని తేలేదా అంటే ఆ పని జరిగిందనే చెప్పాలి. ఎట్లా జరిగింది? అయిదు తీరులుగా జరిగింది.

1. ఉన్నదున్నట్లుగా పెరనుడి మాటలను తెచ్చుకొని వాడడం. స్వేచ్చ, చరిత్ర, బస్‌, కార్‌ వంటివి.

2. పెరనుడి మాటలకు 'డు, ము, వు, లు చేర్చి వాడడం. అద్యక్షుడు, వికలాంగుడు, శౌచాలయం, ముద్రణాలయం వంటివి.

3. పెరనుడి మాటలను తెలుగు చప్పుడుకు వీలుగా మార్చుకొని వాడడం. సంద్రం, కబురు, ఆసుపత్రి, బస్సు, కారు వంటివి.

4 “అచ్చతెలుగు పేరుతో చేంతాడంత మాటల్ని పుట్టించడం. అంచయేనుగుమావంతు, చదువుల ముదుకడు, గడుసుకైదువ జోడు, మినుకుటూర్పులవాడు, ఏనుగుతోలుదాల్సు, కప్పుగుత్తుకవాడు వంటివి. పై నాలుగు తెరగులూ చదువునేర్చినవారూ తెలివరులూ నుడివరు(బాషావేత్త)లూ చేసిన చేస్తున్న పని. మొదటి రెండుతీరులూ అయితే నన్నయనుండి లేదా ఇంకా ముందునుండి, ఇప్పటి “ఈనాడు” వరకూ సాగుతూ వస్తున్నాయి.

5. చదువుతో పొంతులేనివారు, పల్లెటూరి పాటరు (శ్రామికు)లు, అడుగుబడుకు బతుకులు పుట్టించే మాటలు. రామములక(టొమేటో), గబ్బుచమురు (కిరోసిన్‌) వానగూడ(రెయిన్‌ కోట్‌), పొద్దుమాను(గడియార స్తంబం), రెక్కమాను(రైల్వేసిగ్నల్‌ పోల్‌) చిచ్చుగోలు(గ్యాస్టవ్‌ లైటర్‌), చలిచట్ట(స్పెట్టర్‌) వంటివి. పైవాటికంటే ఈ తీరు మాటలే గొప్పవి. ఇవే అప్పటపు తెలుగుమాటలు. తెలివరుల కంటే పాటరులే మేలు అనిపిస్తుంది కదా. అయితే తమ కంటిముందుకు వచ్చిన కొత్త ఉరువులకు పేర్లు పెట్టగలరు కానీ ఆనిమి(సాంకేతిక) మాటలను పుట్టించలేరు, ఎసిది(శాస్త్ర) నెన్నొడి (పరిభాష)ని పొందించలేరు పాటరులు.

'అనిమిమాట ' అనడానికి దానికి రెండు అలుడు(లక్షణా)లు ఉండాలని నుడివరులు చెపుతుంటారు. 1) విడమరచి చెప్పినట్లుగా కాకుందా చిట్టిపొట్టి మాటగా ఉండాలి 2) తననుండి మరికాన్ని మాటల పుట్టుకకు తావునిన్వాలి. ఈ రెండు అలుడులు తెలుగుకు లేవు, కాబట్టీ తెలుగులో అనిమి మాటలను పొందించలేము అంటారు నుడివరులు. ఇదె పెద్ద తప్పుడుమాట. అక్కరలేమితో పట్టనితనమన్నా అయుండాలి, వెతకలేక సోమరితనమన్నా అయుండాలి, తెలుగును తొక్కేయాలనే కుట్రతలపన్నా అయుండాలి, అంతేకాని ఇది వాళ్ల తెలివితక్కువతనం మట్టుకు కానేకాదు.

తెలుగులో కుదురులూ చేర్పులూ కలసిన మాటలు చాలా చాలా ఉన్నాయి. కుదురుల నుండి చేర్చులను విడదీయాలి. ఎటువంటి కుదురుకు ఎటువంటి చేర్చు కలిస్తే కొత్తమాట వుడుతున్నదో చూడాలి. అ తీరులో కొత్తమాటలను పుట్టించాలి. కొన్ని పనిపలుకు (క్రియావాచకాా)లకు చేర్పులను చేర్చితే పేరుపలుకులు(నామవాచకాలు) పుడుతాయి : కోరు +ఇక=కోరిక. కొన్ని పేరుపలుకులకు చేర్పులను చేర్చితే కొత్త పేరుపలుకులు పుడుతాయి : ఎరుక+ఉవ =ఎరుకువ. కొన్ని పేరుపలుకులకు చేర్పులను చేర్చితే కొత్త పనిపలుకులు పుడుతాయి : పుష్పాడి(pollen) +ఇల్లు = పుప్పాడిల్లు(pollenise) పుష్పాడి+ఇంచు= పుప్పాడించు(pollinate). ఈ పుప్పొడించు అనే పనిపలుకును మరలా పేరుపలుకుగా మార్చవచ్చు. : పుష్పొడించు = పుష్పాడింత(pollination).

తెలుగులో మునుచేర్చులను వెనుచేర్చులను వెతకడం మొదలిడితే ఇప్పటికే నాకు నూటికి పైగా కనబడినాయి. నేను నుడివరిని కాను, నుదెసిదిని(బాషాశాస్త్రాన్ని చదవలేదు. నుడివరులు నడుము కట్టుకొని వెతికితే ఇంకా ఎన్నో దొరుకుతాయి.

నాది లేదా మనది అనే చెడ్డనుగు(దురబిమానం)తో చెప్పడం లేదు. నేనెరిగిన నాలుగయిదు నుడులలో ఎంతో చేవ కలిగినది తెలుగు. తెలుగులో ఎసిదానిమి(శాస్త్రసాంకేతిక) మాటలను పుట్టించడం చాలా తేలిక. అవి కూడా చిట్టి పొట్టి గా అలతి అలతిగా పలకడానికి తేలికగా ఉంటాయి. పెరమాటలతో కాకుండా తెలుగుమాటలతో పిల్లలకు చదువులు చెపితే పిల్లలూ ఎదుగుతారు తెలుగూ ఎదుగుతుంది. 'డు, ము, వు, లు, నిను, కి, కు, వల్ల, నుండి, ఇంచు/ఇంచి, కోసం, తో, కంటే, చేసి....” ఇటువంటి కూర్ప్చులనూ చేర్చులనూ మట్టుకే మిగిలించి, మిగిలినదంతా పెరమాటలతో నింపేసి, తెలుగు ఇక్కునం(మాద్యమం)లో చదువులు సాగాలని చాటడం సరికాదు. మన్నించండి, ఎవరినీ నొప్పించాలని ఈమాటను అనలేదు, తెలివరులూ నుడివరులూ ఇకనైనా తెలుగును తలకెత్తుకొంటారనే ఆబతో అన్నాను.

ఈ నోయి(గ్రందం)ని రాయాలనే కోరిక పదేళ్లనాటిది. చేర్చుల కోసం నా వెతుకులాట అప్పుడే మొదలయింది. నాలుగేళ్ల కిందటే

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

11