Jump to content

పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ్యాసరచన పోటీకి అంశాలు 1. తెలుగు నుడి: తెలుగు నుడి పుట్టుక, వికాసం, మాండలికాలు, యాసలూ, లిపి, లేఖనం, రచనాసంప్రదాయం, వ్యాకరణం, భాషాశాస్త్ర అనువర్తనాలు, పనిముట్లు మొదలైన వాటి గురించి రాయవచ్చు. 2. తెలుగు వారి చరిత్ర, తెలుగు నేల చరిత్ర: తెలుగు వారి గురించి తెలుగు నేల గురించిన చరిత్రకు ఆధారమైన ప్రతి అంశమూ తెలుగువారి ప్రాచీన నాగరికతలూ, శాసనాలూ, రాగిరేకులూ, తాళపత్రాలు ఇతరత్రా చరిత్ర ఆనుపానులు. 3. తెలుగు సంస్కృతి: తెలుగు సమాజం, జన జీవన స్రవంతి, సామాజిక చైతన్యం, సంస్కరణలు, మన కట్టూ బొట్టూ, గుడులూ గోపురాలూ, ప్రార్థనామందిరాలూ, చెరువులూ బావులూ, పశువులూ సేద్యం, పాడి పంటలూ, మందులూ మాకులూ, వంటా వార్పూ, తిండీ తిప్పలూ, నమ్మకాలు మన్నింపులు, పెండ్లిళ్ళూ పేరంటాలూ, పండుగలూ సంబరాలూ, జానపద, గిరిజన విజ్ఞానం, కథలూ కథనాలూ, ఆటలూ పాటలూ, నాటికలూ నాటకాలూ సినిమాలూ బుల్లితెర విన్యాసాలూ ఇంకా ఇలాంటివి ఏవైనా కావొచ్చు. 4. ఇంకా నేటి, రేపటి తరం తెలుగింటి పిల్లలను తెలుగు నుడి వైపుకు ఆకట్టుకొనే వ్యాసం ఏదైనా. పై అంశాల మీద ఇంతకు ముందు ఎక్కడా ప్రచురించబడని, కొత్త, సరికొత్త వ్యాసాలను పంపవచ్చు. అందిన మొత్తం వ్యాసాలలో 100 మేటి వ్యాసాలను ఎంపిక చేసి ఒక్కొక్క వ్యాసానికి అక్షరాలా వెయ్యి రూపాయల నగదు బహుమతి అందిస్తాం. మొబైల్ యాపులు గడచిన పదేళ్ళుగా మనలో ప్రతి ఒక్కరి చేతికీ స్మార్ట్ఫోన్లు వచ్చేశాయి. అయితే అందులో తెలుగెంత? మన తెలుగు జనాభాలో పూర్తిగా ఆంగ్లంలో నూటికి పది మంది వ్యవహరించగలిగితే, మరో 20 మంది తొలిమెట్టు ఆంగ్లంలో వ్యవహరించగలరేమో! అంటే దాదాపు నూటికి 75 మంది వచ్చీ రాని ఆంగ్లంతో మొబైల్ ఫోనులను వాడుతున్నారు. అంతరవర్తి (ఇంటర్ఫేస్) స్థాయి వరకూ, పేర్లను దాచుకునే వరకూ తెలుగు ఉన్నా చాలా అనువర్తనాలు (యాపులు/apps) నేటికీ కేవలం ఆంగ్లంలోనే ఉన్నాయి. కానీ తెలుగులో అనువర్తనాలు తయారు చేసుకునేందుకు సాంకేతికంగా నేడు ఎలాంటి అడ్డంకీ లేదు. అయితే, తెలుగు వారి పట్టనితనం వలననే తెలుగులో మొబైల్ యాపులు రావటం లేదు. అందుకని తెలుగు భాషోద్యమ సమాఖ్య తెలుగు మొబైల్ యాపు నిపుణులకు తెలుగులో మొబైల్ యాపులు రూపొందించమని పిలుపునిస్తూ, మొబైల్ యాపు పోటీని నడుపుతున్నాం. ఈ మొబైల్ యాపు పోటీలో ఎలాంటి యాపులు రూపొందించవచ్చు?

  • తెలుగునుడి నేర్చుకోవడానికి ఉపయోగపడే యాపులు

ఓ తెలుగు ఆటలు

  • ఈ తరం పిల్లలు తెలుగు సాహిత్యాన్ని గురించి మక్కువతో తెలుసుకునేలా చేసే సాహిత్య ప్రధానమైన యాపులు
  • తెలుగు శుభలేఖలు, ఆహ్వానపత్రాలు, సభలకు, వేదికలకు తెరలు తయారు చేసుకునే యాపులు
  • తెలుగు మాటలతో ఆటలు మున్నగున్నవి.
  • నేటి రేపటి తరం తెలుగింటి పిల్లలను తెలుగు నుడి వైపుకు ఆకట్టుకొనే యాపు ఏదైనా కొత్తగా తయారు చేసి పంపవచ్చు.
  • ఇతర సేవల ఆధారంగా తయారుచేసిన యాపులు, అయితే తెలుగులోనే కనబడాలి.

ఎంపికైన యాపులకు 3 లక్షల రూపాయలవరకూ నగదు బహుమతులను అందజేస్తాము. మరిన్ని వివరాలకు, పోటీ కట్టుబాట్ల కొరకు https://telugubhashodyamasamakhya.blogspot.com లంకెను చూడండి. తెలుగు భాషోద్యమ సమాఖ్య ఈమెయిలు చిరునామా: tebhasapoti@gmail.com డా॥ చుక్కారామయ్య, గౌరవాధ్యక్షుడు డా॥ సామల రమేష్ బాబు, అధ్యక్షుడు తెలుగు భాషోద్యమ సమాఖ్య నిర్వహణ: ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు వీవెన్ రహ్మానుద్దీన్