పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రత్యేకంగా ఒరిగింది ఏమీ లేదు. కానీ ఈ తీర్పు ద్వారా పరోక్షంగా, ప్రజల ప్రాధమిక హక్కుల పరిరక్షణకు దోహదపడ్డ మహనీయుడు కేశవానంద భారతి.

ఈ నేపథ్యంలో (ప్రాథమిక హక్కులు, పార్లమెంటుకుగల రాజ్యాంగ సవరణాధికారాలు, ఉన్నత న్యాయస్థానానికి గల న్యాయ సమీక్షాధికారం గురించి నంక్షిప్తంగానైనా తెలునుకోవటం అవసరం. ఎందుకంటే, ఈ రగడ కేశవానంద భారతితో మొదలు కాలేదు, కేశవానంద భారతితో ముగిసిపోలేదు. రావణ కాష్ట్రంలా 1951 నుండి (రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటినుండి) ఇప్పటిదాకా కాలుతూనే ఉన్నది, ఇక ముందూ కాలుతూనే ఉంటుంది.

భారత రాజ్యాంగంలోని మూడవ విభాగంలో [ప్రాథమిక హక్కులు పొందుపరచబడ్డాయి. ఐక్యరాజ్య సమితిచే ఆమోదించబడ్డ మానవహక్కులే మన రాజ్యాంగంలోని (ప్రాథమిక వాక్కులని భావించుకోవచ్చు. మానవుని పరిపూర్ణ వ్యక్తిత్వానికి ప్రతిరూపమే మానవవాక్కులు. జీవించే వాక్కు భావప్రకటనా వాక్కు మొదలైనవన్నీ మానవ హక్షులే. ఈ మానవహక్కులు ఎవరో ఇచ్చేవి కావు. ప్రకృతి పరంగా సహజసిద్ధమైనవి. అందువలన ఇటువంటి హక్కులను ఎవరో ఇవ్వటం, హరించివేయటం అనేది అసంబద్దం. ఈ మానవ హక్కులకు ప్రభుత్వాలు సంరక్షకులు మాత్రమే. ఈ మానవ హక్కులను సంరక్షించి, ప్రజలందరూ అనుభవించే అవకాశాన్ని పరిస్థితులను కల్పించటమే ప్రభుత్వాల విధి, బాధ్యత. ఈ సూత్రీకరణ పైనే మానవ హక్కుల నిద్ధాంతం ఆవిష్కరింప బడింది. ఇవన్నీ నీతి నూత్రాలలాగానే వినటానికి బాగానే ఉంటాయి. కానీ, ప్రపంచంలో ఎక్కడా ఈ సూత్రం ఆచరణలో లేదు. ప్రపంచ వ్యాపితంగా అన్ని దేశాలలో, అన్ని ప్రభుత్వాలూ మానవహక్కుల ఉల్లవునకు పాల్పడుతున్నాయి. ఇది గతం, వర్తమానం, భవిష్యత్తు కూడా. ఇది ఒక పెద్ద వివాదాస్పదమైన అంశం. అందువలన ఆ అంశాన్ని ప్రక్కకుబెట్టి, మన దేశంలో (పాథమికవాక్కులపై కేశవానంద భారతి తీర్చు ప్రభావాన్ని పర్యవపానాన్ని విశ్లేషించుకుందాం.

ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా, నిజానికి కేశవానంద భారతి కేసులో తీర్పు ద్వారా పార్లమెంటుదే సర్వాధికారం అన్నది నిర్ధారణ అయింది.

కాన్సీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన రాజ్యాంగ సవరణలపై న్యాయసమీక్ష చేసే అధికారం ఉన్నతన్యాయస్థానాలకు ఉంటుందన్న అంశాన్ని మాత్రం పెట్టుబడిదారీ అనుకూల రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు జీర్ణించుకోలేక పోయాయి.

అనలు ప్రాథవిక హక్కులపై ఇంత రగడ ఎందుకు? ఎందుకంటే, ప్రాథమిక హక్కులపట్ల రాజ్యాంగ నిర్మాతలకే గౌరవం లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు. రాజ్యాంగ నిర్మాతలు, రాజ్యాంగాన్ని రచించిన వారంతా భారతదేశంలో అత్యల్ప శాతంగా ఉన్న థధనికవర్గానికి, దోపిడీ వర్షానికి ప్రతినిధులే, ఆ వర్షానికి సంబంధించినవారే. అందువలన దేశంలో అత్యధిక శాతంగా ఉన్న కార్మికులకు, కర్షకులకు, పేదలకు, బడుగు, బలహీన వర్గాల వారికి (ప్రాథమిక హక్కులను కల్పించటం రాజ్యాంగ నిర్మాతలకు ఇష్టం లేదు.

కానీ ఆ విషయం బహిరంగంగా చెబితే, ఇబ్బంది కనుక, ప్రాధమిక వాక్కులను రాజ్యాంగంలో పొందు పరున్తూనే, హేతుబద్ధమైన పరిమితులు, ఆంక్షలు పేరుతో ప్రాథమిక హక్కులకు సంకెళ్ళు వేశారు. ఇది ఒక రకంగా ఒక చేత్తో ఇచ్చి, మరొక చేత్తో వెనుకకు తీసుకోవటంగా ఉంటుంది. నిశితంగా పరిశీలిస్తే అసలు భారత రాజ్యాంగంలోని ప్రజాస్వామ్యం అనేదే అంతా ఒక మాయ, కనికట్టు. ఈ అభిప్రాయంతో చాలామంది పాఠకులు విభేదించవచ్చు.

కానీ ఇది వాస్తవం. ఒక చిన్న ఉదాహరణ. వయోజన ఓటు హక్కు అంటూ, 21 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కును కల్పించింది మన రాజ్యాంగం. 1951 నాటికి భారత దేశంలో ఎక్కువ శాతం [ప్రజలు అజ్ఞానులు, నిరక్షరాళ్యులు. రాజకీయ పరిణత శూన్యం. (ఇప్పటికీ మన దేశంలో నిరక్షరాశ్యుల సంఖ్య కొన్ని కోట్లలో ఉన్నది). అటువంటి ప్రజలు తమ ఓటు హక్కును సక్రమంగా ఎలా వినియోగించగలరు? ఆ హక్కును సక్రమంగా వినియోగించలేకపోయినప్పుడు ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ప్రజాస్వామ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ వాస్తవం రాజ్యాంగ నిర్మాతలకు తెలియదా. తెలుసు. అయినా తెలిసి ఈ విధమైన ఓటు హక్కును ఎందుకు కల్పించారు? నిజాయితీతో ఆలోచిస్తే సమాధానం సులభంగానే దొరుకుతుంది. ఈ దేశంలో (వజాస్వామ్యం ఒక మాయ. కనికట్టు. ఉన్నది లేనట్లుగా (భ్రమింపచేయటం. రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నది ఇదే.

ఇక్కడ మరొక దేవ రహస్యం కూడా ఉన్నది. అక్షరాశ్యత వేరు, రాజకీయ పరిణతవేరు. ఇప్పటికీ అక్షరాశ్యులు, ఉన్నత విద్యావంతులలో ఎంత మందికి స్పష్టమైన రాజకీయ అవగాహన ఉన్నది? ఓటు వేస్తున్న ఉన్నత విద్యావంతుల వద్దకు వెళ్ళి వివిధ రాజకీయ పార్టీల సిద్ధాంతాలను గురించి వారికున్న అవగాహనను చెప్పమనండి. చెప్పరు, చేప్పలేరు. ఎందుకంటే ఆ విషయంలో వారికి రాజకీయ పరిణత శూన్యం కనుక. అందుకే ఇటువంటి ప్రయత్నాన్ని ఏ ప్రసార మాధ్యమాలూ ఇప్పటివరకు చేయలేదు, ఇక ముందూ చేయవు. ఎందుకంటే ఆ విధంగా చేస్తే అసలు బండారం బయట వడుతుంది. నడువలేని స్థితిలో ఉన్న వయో వృద్ధులు, ఎవరి సహాయంతోనో పోలింగ్‌ బూత్‌ వద్దకు ఓటు వేయటానికి వస్తారు. ఇది మన దేశంలో వ్రజాస్వామ్యం వర్టిల్లిందనటానికి నిదర్శనమంటూ (వ్రసార మాధ్యమాలు శ్లాఘిస్తాయి. ఆ వయో వృద్ధుడి క్లిప్పింగును టీవీ ఛానళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రదర్శిస్తుంటాయి. అంతే తప్ప, ఏ విలేఖరీ ఆ వృద్ధుడి వద్దకు వెళ్ళి, తాతా, ఈ దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాటి సిద్ధాంతాలను గురించి నీకు తెలుసా అని ప్రశ్నించవు. ఎందుకని? ప్రశ్చిస్తే, అసలు బండారం బయట వడుతుంది. ఇక నిరక్షరాశ్యుల మాట చెప్పేదేముంది. (భారత రాజ్యాంగ నిర్మాతలను గురించి, వయోజన ఓటు హక్కు గురించి, భారతదేశంలో (ప్రజాస్వామ్యం గురించి నేను వ్యక్తీకరించిన అభిప్రాయాలతో కొందరు పాఠకులు ఏకీభవించకపోవచ్చు. అయితే, ఓటర్లలో రాజకీయ పరిణత ఉండి, సరైన రాజకీయ అవగాహనతో ఓటు హక్కును వినియోగించినట్లయితే, మన దేశంలో (ప్రజాస్వామ్యం ఇటువంటి దయనీయ స్థితిలో ఉండేది కాదని, రౌడీలు, గూండాలు, | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |