పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెండ్యాల సత్యనారాయణ 95664 42034

చరితార్థుడు స్వామీ కేశవానంద భారతి

ఆయన ఒక సన్యాసి. సర్వసంగ పరిత్యాగి. తన కోసం ఏదీ కోరుకోదు. తన గురించి అలోచించడు. ఆయన ఆలోచించేది తాను నమ్మిన సిద్ధాంతం గురించి, ఆ సిద్ధాంతాన్ని విశ్వసించే ప్రజలను గురించి. ఒక చిన్న అశ్రమమే అయన స్‌వాసం. అయితేనేం, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో, భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డ ప్రాథమిక హక్కులను సంబంధిత ప్రజా ప్రభుత్వమే హరించివేయటాన్ని సహించలేని ఆ సన్యాసి, ప్రభుత్వంపైనే యుద్దాన్ని ప్రకటించాడు. ప్రాథమిక హక్కుల సంరక్షకుడిగా భారత రాజ్యాంగ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. చరితార్భుడైనాదు. ఆయనే, సెప్టెంబరు ఆరవ తేదీన తుది ఊపిరి విడిచిన స్వామీ కేశవానంద భారతి.

కేరళలోని ఎడనీర్‌ మఠానికి అధిపతి కేశవానంద భారతి. భూసంస్కరణలలో భాగంగా, ఎడనీర్‌ మఠానికి చెందిన ఆస్తులను అప్పటి కేరళ రాష్ట్ర ప్రభుత్వం జాతీయం చేసింది. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ, కేశవానంద భారతి, కేరళ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఆ అప్పీలులో స్వామీజీకి పాక్షికంగానే ఉపశమనం లభించటంతో, సుప్రీం కోర్టును ఆయించారు. ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది నానీ ఫాల్మీవాలా, ఆ అప్పీలును దాఖలు చేశారు. ఆ క్రమంలో ఫాల్మీవాలా ఒక సాహసం చేశారు. అప్పటికే ఇందిరాగాంధీ ప్రభుత్వం, ప్రాథమిక హక్కులకు కోత పెడుతూ, పార్లమెంటు చేసే రాజ్యాంగ సవరణలపై సుప్రీంకోర్చ సమీక్ష జరిపే అవకాశంలేని విధంగా రాజ్యాంగంలోని 24, 25, 26, 29 అధికరణాలను నవరించింది. ఆ సవరణల ద్వారా పార్లమెంటుకు మ్రర్తి అధికారాలు నంక్రమించబడ్డాయి. ఈ వరిన్ఫితిని ఫాల్కీవాలా జీర్ణించుకోలేకపోయారు.. కేరళ భూసంన్మరణల చట్టాన్ని, ప్రాథమిక హక్కులతో ముడిపెట్టారు. కేరళ భూసంస్మరణల చట్టంతోబాటు, 24, 25, 26 29 రాజ్యాంగ సవరణలను కూడా ప్రశ్నిస్తూ కేశవానంద భారతి తరఫున అప్పీలు దాఖలు చేశారు ఫాల్మీవాలా.

కేశవానంద భారతి తరఫున దాఖలైన ఈ అప్పీలును విచారించి, రాజ్యాంగ ధర్మసంకటాన్ని తీర్చటానికి 18 మంది సువ్రీంకోర్మ న్యాయమూర్తులతో విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. సుప్రీంకోర్టు చరిత్రలో ఇంత పెద్ద ధర్మాసనం అంతకు పూర్వంగాని, ఆ తర్వాతగాని ఇప్పటివరకు ఏర్పడలేదు. ప్రాథమిక హక్కులు, భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం, పార్లమెంటుకు గల రాజ్యాంగ సవరణాధికారం, ఆ క్రమంలో సాధారణ సవరణలకు, ప్రాథమిక హక్కులకు సంబంధించిన రాజ్యాంగ సవరణలకు మధ్యగల తేదా, పార్లమెంటు చేసే రాజ్యాంగ సవరణలను సుప్రీంకోర్టు సమీక్షించవచ్చా, సుప్రీంకోర్టుకుగల న్యాయసమీక్షాధికార పరిమితులు తదితర ఎన్నో అంశాలపై ధర్మాసనం సుదీర్ధంగా విచారణ జరిపింది. చివరకు 703 పేజీలతో సమగ్రమైన తీర్పును వెలువరించింది. (కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ, ఎఐఆర్‌ 1973, సుప్రీంకోర్టు, పేజీ 1461).

అయితే ఎవరూ ఊహించని విధంగా సుప్రీంకోర్టు ధర్మాసనం అటూ ఇటూకాని ఒక విచిత్రమైన తీర్పును వెలువరించింది. సరి కొత్త గందరగోళానికి తెరతీసింది. ఆ క్రమంలో ధర్మాసనంలోని న్యాయమూర్తులు రెండు నగాలుగా చీలిపోయారు. హెగ్దే, జగన్మోహన రెడ్డి, ముఖర్జి, సిక్రి, (గ్రోవర్‌, షెలలు (ఆరుగురు న్యాయమూర్తులు), రాజ్యాంగ సవరణలపై పార్లమెంటుకు గల అధికారాలపై రాజ్యాంగంలోనే అంతర్లీనంగా పరిమితులున్నాయని, అందువలన రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చే విధంగా రాజ్యాంగాన్ని నవరించే అధికారం పార్శవెంటుకు లేదని అభిప్రాయపడ్డారు. అయితే, చంద్రచూడ్‌, బేగ్‌, మాథ్యూ, ఎ.ఎన్‌.రే. ద్వివేది, పాలేకర్సు (ఆరుగురు న్యాయమూర్తులు) మాత్రం, రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు పూర్తిగా ఉన్నదని అభిప్రాయపడ్డారు. చివరగా, మిగిలిన పదమూడవ న్యాయమూర్తి జస్టిన్‌ ఖన్నా అభిప్రాయం నిర్ణయాత్మకంగా మారింది.

చాలా అంశాలపై గోడ మీది పిల్లివాటంలాగా ఊగినలాడిన ఖన్నా చివరకు, రాజ్యాంగాన్ని నవరించే సంవూర్జాదికారం పార్లమెంటుకు ఉన్నదంటూనే, ఆ పేరుతో రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించరాదంటూ, హెడ్లే తదితరులతో ఏకీభవించారు. దీనితో, 7-6 తేడాతో కేశవానంద భారతి కేసులో తీర్పు వెలువడింది. పర్యవసానంగా, రాజ్యాంగ మౌలిక స్వభావానికి విరుద్ధం కాని విధంగా, ప్రాథమిక వాక్కులకు సంబంధించిన అధికరణాలతో సహా రాజ్యాంగంలోని ఏ అధికరణాన్ని అయినా నవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుందన్న వాదనకు ఆమోదముద్ర వేయ బడింది.

కేశవానంద భారతి కేనులో సుప్రీంకోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పు సారాంశం ఏమిటంటే, రాజ్యాంగం ఉన్నతమైనది. అందువలన రాజ్యాంగం యొక్క మౌలిక లక్ష్యాలకు విరుద్ధంగా రాజ్యాంగాన్ని సవరించరాదు. ఆ విధంగా నవరించినట్లయితే, అటువంటి రాజ్యాంగ సవరణలపై ఉన్నత న్యాయస్థానం న్యాయ సమీక్ష చేయవచ్చు. ప్రాథమికహక్కులు అనేవి ఒకరు ఇచ్చేవి కావు. రాజ్యాంగం యెఐక్క మౌలిక లక్ష్యంలో ప్రాథమిళకవాక్కులు అంతర్భాగం. ఈ విధంగా ప్రాథమికహక్కులకు ఒక విధమైన రాజ్యాంగ భద్రతను కల్పించిన వ్యక్తి కేశవానంద భారతి. నిజానికి ఈ తీర్పువలన కేశవానంద భారతికిగాని ఆయన మఠానికి గాని | తెలుగుజాతి పత్రిక జువ్మునుదె.. ఈ అక్టోబరు-2020 |