పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెయ్యాల"ని మాత్రం వుంది. ఇలాంటి స్కూలు నడపడం ఒక్కటే తాను చేయగలిగిందని ఆమె అంటుంది. “దేశమంతటా యిటువంటి పాఠశాలలు నెలకొల్పడం ద్వారా వాళ్ల మూఢత్వాన్ని రూపుమాపవచ్చునని నా ప్రగాఢ విశ్వాసం” అని ఆమె రాస్తుంది.

జడ్జిగారు రాజమండ్రిలో ఎంతకాలం వుండగలరో ఆమెకే తెలియదు, ఉద్యోగులలో చాలా మార్పులు జరుగుతున్నాయి గనక, తాము అవూళ్లో ఎక్కువ కాలం వుండకపోవచ్చునని అంటూ, ఇప్పుడు వాతావరణం ఎంతో హాయిగా వుందని, అందువల్ల ఇప్పట్లో ఈ వూరువదలి పోవాలనిపించడంలేదని, ఏమైనా వేసవిలోగా ఇక్కడి నుంచి బదిలీ అయితే బాగుంటుందని ఆమె రాస్తుంది. ఉష్ణోగ్రత 84-86 డిగ్రీల మధ్య వుంది. వేసవి వేదికి బాగా వేగిపోవడంతో ఆమె యిక్కడి వాతావరణానికి అలవాటుపడి, ఇప్పటి వాతావరణం ఆహ్ల్హాదకరంగా వున్నట్లు భావిస్తుంది. తెల్లవారు రూమునైతే 74 డిగ్రీలు వుంటుంది, అప్పుడు ఆ చలిలో 'క్లోక్‌' ధరించికానీ బయటకు వెళ్లలేనని ఆమె రాస్తుంది. “మా యింటి కిటికీలోంచి కనబడే సుందర దృశ్యం లాంటిది దేశంలో మరెక్కడా వుండదని అందరూ అంటారు. ఇప్పుడిప్పుడే మాతోటను చక్కగా పెంచుకొంటున్నాం. ఇక్కడ అంతా అనుకూలంగా, హాయిగా వుంది అని ఆమె చెప్పంది. వారి లాన్‌లో మూడు లేళ్లను పెంచారు. అవి అందంగా వుండి మచ్చికయ్యాయి. కొన్ని అందమైన అడవి నెమళ్లను కూడా ఆమె పెంచుతోంది.

రాత్రి వేటగాడు ఒక చిరుతపులిని చంపి తెచ్చాడు. అంత అందమైన జంతువును నిర్జాక్షిణ్యంగా కాల్చి చంపినందుకు మాకు విచారం కలిగింది. అవి పశువుల్ని చంపుతాయి గనక వాటిని వేటాడి తెచ్చిన వారికి ప్రభుత్వం బహుమతి నిస్తుంది. వాటి చర్మాన్ని కలెక్టరు తీసుకుంటాడు. “ఈ చిరుతపులి మా ప్రాంతంలో దొరికింది గనక, దాని చర్మాన్ని నాకు యివ్వమని అడగాలనుకుంటున్నాను” అంటుందామె.

“శీతాకాలం రాత్రులు జడ్జిగారి తోటలోకి తరచు నక్కలు, తోడేళ్లు వచ్చి అరుస్తూంటాయి. ఆ అరుపులు ఎవరో దీనంగా రోదిస్తున్నట్లు భయంకరంగా వుంటుంది. పిల్లి పసిబిడ్డను ఎత్తుకుపోయిందని ఎవరో చెప్పారు. చాలా భయపడ్డాను. తీరా విచారిస్తే పావురం పిల్లను ఎత్తుకొని పోయినట్లు తెలిసింది. బాతులు చాలా గుడ్లు పెట్టాయి. వాటిని పొదిగించమని జడ్జిగారు చెప్పారు (You must make little ducks). అందుకు బట్లరు “Sir, I shall do,” అని జవాబు చెప్తే నాకు నవ్వాగింది కాదు.” బట్లరు కోడిని పట్టుకొచ్చి గుడ్లతో బుట్టలో మూతవేసి పెట్టి కాసేపటికి నాలుగు పిల్లల్ని పొదిగినట్లు చెప్పేసరికి ఆమె ఆశ్చర్యపోయింది.

మద్రాసు మునీ నుంచి ఆమెకు జాబు వచ్చింది. తల్లీ బిడ్డల యోగక్షేమాలు విచారిస్తూ "the concern I have for your happiness as my matron, your state of health, and the state of my rising matron, your child” అని రాశాడు. అంటే Patronను స్త్రీ వాచకంగా అతడు భావించి నట్లున్నాడని ఆమె పరిహాసంగా రాస్తుంది.

ఆ దారంట వెళ్లే విదేశీయులకు ఆతిథ్యం యిచ్చిన చిన్న సంఘటనను ఆమె ఈ వుత్తరంలో పేర్కొన్నది -

ఒక సాయంకాలం హామిల్టన్‌ దంపతులు, మరికొంతమంది మిత్రులు ఆమె యింట్లో కూర్చొని కబుర్లు చెప్పుకొంటుంటే, కలెక్టరు సిఫారసుతో M.d. Ariel అనే ఫ్రెంచి వ్యాపార సంస్థల ప్రతినిధి వచ్చాడు. అతనికి ఇంగ్లీషు ఒక్కమాట రాదు, అక్కడున్న వారికి ఫెంచి అస్సలు రాదు. ఐనా ఎవరి భాషల్లో వారు మాట్లాడారు. ఇంగ్లీషు తెలియక పోయినా, స్థానిక భాషలు బొత్తిగా రాకపోయినా అతను మూగ సైగలతోనే మద్రాసు నుంచి 400 మైళ్లు ప్రయాణించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. మరో రోజున ఖజానా మోసుకొచ్చే సిపాయిలపై అధికారి - పదిహేదేళ్ల (జూనియర్‌ ర్యాంక్‌ కమాండెంట్‌ ఆఫీసరు) యువకుడు గుర్రం మీద వచ్చాడు. అతను తన గుర్రాన్ని మనిషిలాగా భావిస్తూ దానితో మాట్లాడేవాడు. ఊరి పొలిమేరల్లో కొన్ని అడవి గుర్రాలు దాని మీద పడ్డాయి. “అప్పుడు దాని మీది జీను (bridle)ను తీసేసి నా పోనీని వాటిపైకి వదిలాను. అక్కడి వాళ్లు వాటిని విడదీయకుందా వుండి వుంటే నా పోనీటి అంతు తేల్చుకొని వుండేది. మావాడు అసాధ్యుడండీ!” అన్నాడతను. ఇక్కడ గుర్రాలను, కుక్కలను మేలురకం, తక్కునవరకం అంటూ రెండుగా విభజిస్తారని, అరబ్‌ అశ్వాలను మేలురకంవిగా, స్థానికజాతి గుర్రాలను తక్కునరకంవిగా అంటారని ఆమె రాస్తుంది. ఆమె వద్ద మేలురకం అశ్వం వుంది.

దానికి చాలా పొగరు. చుట్టుపక్కల పోనీ కనిపించినా సహించలేదు. అందుకని దానికాపరి ఎప్పుడూ దాని ముందు పరుగెత్తుతూ ఎదురుగా ఎక్కడా పోనీలు తారసపఢకుండా చూస్తాడని ఆమె చెప్తుంది. (తరువాయి వచ్చే సంచికలో...)


భ్రీమతి శివేగారి దేవమ్మ స్మారక పురస్కారం 2020లో ముద్రితమైన కవితా, కథా సంపుటాలను ఆహ్వానిస్తున్నాము మూడేసి ప్రతులను డిసెంబర్‌ 31.12. 2020లోపు పంపవలేను. బహుమతి పొందిన కథల సంపుటానికి రూ. 7,000, కవితా సంపుటానికి రూ.7,000 నగదుతో సభలో పురస్కార ప్రధానం జరుగును. మీ ప్రతులు మాకు పంపవలెను.

మా చిరునామా: శివేగారి, కాలవపల్లి, ఎం.పీ కొటూరు (పోస్ట్‌) పలమనేరు (మండలం)

చిత్తూరు (జిల్లా) పిన్‌ కోడ్‌: 517408 సెల్‌: 6300318230

అవార్డు వ్యవస్థాపకులు: శివేగారి వివరాలకు: 6800318230


| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఈ అక్షోబరు-2020 |