పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వీస్తే కార్తీకమాసంలో తగినవిధంగా వర్షాలొస్తాయంటాడు.

వాయు (వ్రసారం బట్టి వానలను అంచనా వేసే మరో ప్రయోగాన్ని వివరించాడు. ముతకనూలుతో ఎనిమిది మూరల పొడవు, రెండు మూరల వెడల్పు వస్త్రం నేయించాలి. నలఖై ఎనిమిది మూరల పొడవున్న కర్రకు ఆ గుడ్డను పతాకంగా కట్టి ఆషాఢ శుద్ధ పూర్ణిమనాడు తెల్లవారుతున్నప్పుడు నిలబెట్టాలి. ఆ వస్త్రం గాలికి తూర్పుకు దిశకు ఊగితే వానలు బాగా పడతాయి. ఆగ్నేయ దిశకు పోతే వానలు పడవు. దక్షిణ, నైరుతి వైపు పోతే మేఘాల పుడతాయే కానీ వానలు ఉండదు. పడమటి దిక్కుకు పోతే అతివృష్టితో పాటు, గాలి ఉంటుంది. వాయువ్యం వైపు పోతే అతివృష్టి, సుడిగాలి ఉంటుంది. ఉత్తరం వైపు పోతే పంటలకు తగినంత వాన ఉంటుంది. ఈశాన్య వైపు పోతే మధ్యరకంగా ఉంటుంది. అన్ని వైపులకు తిరుగుతూ మెలికలు పడుతుంటే పంటలు పండే సమయంలో వానలు దట్టంగా పడి చెడిపోతాయి. లేదా శత్రువులైనా చెడగొడతారని వివరించాడు.

మేఘం పరివేషం లక్షణాలు, ఆకారాలను బట్టి కూదా వర్షాల రాకను వివరించాడు. భారతదేశంలో ఏయే ప్రాంతాలకు ఏయే (గ్రహాలు ఆధిపత్యం వహిస్తాయో వివరించాడు.

“చందన్సు విషయంలో కొన్ని క్రొత్త సంగతులు చెప్పినట్లే దోనయామాత్యుడు మన భాషలో ఆనాడు వాడుకొనే కొన్ని మాటలను గురించి కూడా మనకు చెప్పాడు. ఇవి మనకు తరచుగా కనబడని ప్రయోగాలు, మన తిథులలో ద్వాదశి మనకెంతో పుణ్యమైనది. దానికి పారశి అనే పర్యాయవదమున్నట్లు దోనయామాత్యుడు యతి 'పస్థానంలో వాడినందువల్ల తెలుస్తున్నది” అని ఆరుద్ర పేర్కొన్నారు. ఈ పదంపై జ్యోతివాసు వివరణ తర్వాత చూపుతాను. మేఘాల వర్ణనలో “కాటుక క్రోవులు” ఇంకా రైతులు వాడే “ఓదెలు, ఓరంత ప్రొద్దు, నులిపున్నమ, నారకొలదులు వంటి పదప్రయోగాలను ఆరుద్ర చూపాడు.

నిఘంటువులకెక్కని పదాలు సస్యానందంలో ఉన్నాయని ఉన్నం జ్యోతివాసు వివరించారు. “తొలుతటి వానలోదోయంబు లొగరైన, వట్టన యగునేన కొర్రచేలూ..లో వగరుగా, వజ్ఞగా పదాలలో వజ నివుంటువులలో లేదని (బౌణ్యం“కారము”గా న్వీకరించిందని చూపుతాడు. “తలివమ్ము ముతకనూలున"లో “తలివమ్ము” పదానికి పరుపు, శయ్య అర్భాలున్నాయి. కానీ ఇక్కడ కంబళి, దుప్పటి అర్థం వస్తుంది. “వెంగలియై సన్యకోటి పెంపడగించున్‌”లో వెంగలికి అవివేకి, జధుడు, మూఢుడు అని అర్భాలున్నాయి. కానీ ఇక్కడ కవి “వెనుకా అనే అర్ధంలో వాడారు. ఇదే పద్యంలో రెండవ పాదంలో ముంగలి పదం ఉంది. దానికి వ్యతిరేకంగా వెంగలి అని వాడారు. “ప్రతివద” పదాన్ని పాద్యమి అర్ధంలో ఇందులో వాడటం ఉంది. “ద్వాదశి"కి వికృతి రోదసి, బారసి పదాలున్నాయి. బారసి పదం ఇందులో ప్రయోగించాడు. అచ్చు ప్రతిలో పారశి అని ఉండటంతో ఆరుద్ర గారు కొత్తపదంగా అనుకొన్నారని అది “బారసి” అని ఉన్నం జ్యోతివాసు వివరించాడు.

వన్తువరంగాను, భాషావరంగాను దోనయామాత్యుడి సస్యానందం ఎంతో విలువైంది. సమకాలీన సందర్భంలోను ఇది నిలబడుతుంది. ఈ [గ్రంథంలో వర్షాల విషయంగా ప్రతిపాదించిన జ్యోతిషశాస్త్ర విషయాలు, అదే విధంగా వర్షాలపై లోకవ్యవహారంలో ఆ రోజులలో చేసిన ప్రయోగాలను నేటి ప్రస్తుత శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో మరింత అధ్యయనం చేసి అందులో (ప్రామాణిక అంశాలను నిరూపించి వెలుగులోకి తీసుకొనిరావాలి. అ

పదనిష్పాదనకళ

25 వ పుట తరువాయి.....

ఆవశ్యకత వారికి లేదు.

కానీ భవిష్యత్తులో అవే సబ్జెళ్టల్ని తెలుగులో చెప్పాల్సివస్తే మాత్రం తెలుగు పదాలు కావాలి. అర్ధం కావడం అనేది ఒక కాలాను గతమైన ప్రక్రియ. పుడుతూనే మనకు ఏదీ అర్ధం కాదు. అందటికీ అర్భం అవుతాయని చెబుతున్న ఇంగ్లీషు వదాలు కూడా శిక్షణాప్రక్రియలో నేర్చుకున్నవే. పుడుతూనే నేర్చుకున్నవి కావు. మన పదజాల పరిజ్ఞానం వయసుతో పాటు పెణుగుతూ పోతుంది. ఆ 'పెతీగే పదజాలంలో తెలుగు ఎందుకు ఉండకూడదు ? ఇంగ్లీషు పదాల వరిజ్ఞానాన్ని మాత్రమే ఎందుకు పెంచుకోవాలి ? మన వర్ధమాన పదజాలంలో తెలుక్కి ఎందుకు స్థానం ఉండకూడదు ?

కాబట్టి కొత్త తెలుగు పదాలు జనానికి అర్ధం కావనే వాదాన్ని మనం అంగీకరిస్తే దాని సారాంశం ఏమౌతుందంటే - 1 తెలుగులో ఏ శాస్త్రానికి సంబంధించీ, ఏ విధమైన సాంకేతిక పదజాలమూ ఉండకూడదు. డు, ము,వు.ల్లాంటివి మాత్రమే ఉందాలి. ఇంగ్లీషుని తెలుగులిపిలో వ్రాస్తే అదే తెలుగు.

2. ఉన్నా అది అందటికీ అర్థం కాకూడదు. (ఎందుకంటే వాళ్ళకు ఏది అర్ధం కావాలో ఏది కాకూడదో మనం ముందే నిర్ణయించేశాం. అంతకు మించి వాళ్ళకు ఇంకేమీ అర్థం కాకూడదు)

3. తెలుగులో సాంకేతిక పదజాలాన్ని ప్రచారం చేయకూడదు (ఎందుకంటే మేము ఇదివణకే ఒక విధమైన ఇంగ్లీషు పదజాలాన్ని ప్రచారం చేసేశాం. దానికి మీరు అడ్డం రావద్దు)

4. కాబట్టి తెలుగులో సాంకేతిక శాస్త్రాలేవీ వద్దు. అవన్నీ ఇంగ్లీషులోనే ఉండాలి.

5.ఆ విధంగా తెలుగులో సాంకేతికపదాలూ, సాంకేతిక పదాలూ లేకుండా చేస్తాం కనుక తెలుగు పొట్టపోసుకోవదానికి పనికి రాదు. పోనివ్వండి. మాకు ఇంగ్లీషుంది.

6. తెలుగు మనకు పొట్టపోసుకోవడానికి పనికిరాదు కనుక

మనం అసలు అది మాట్లాడొద్దు. నష్టమేముంది ?

తరువాయి- వచ్చే సంచికలో

మాతృభాషకాని భాషలో విద్యాభ్యాసం విద్యార్ది చదువుకు అడ్డంకిగా మారుతుంది - 'యునెస్కో

| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |