పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పృచ్ళకుదెనరో? ఇవ్వగజాలెడు నెవడో సమాధానము? నాకేల
విహంగమున కాకసంపు కాలతలేల?
చిన్ని అలకు ఒద్దు దూరమున్నదన్న చింత ఏల?
దీపము పెనుగాలికి భీతిల్లనేల ?
జీవితాత్మకు ఎన్నడూ బ్రహ్మము
చేరుదునన్న సందియమ్మదేల ?
నేనొక చైతన్యోర్మిని
నిస్తుల ప్రగతి శకలమును
ఇది నా సంతత కర్మ
మరే హక్కులు లేవు నాకు
ఈ నిద్రాణ నిశీధి మహిత జాగ్బతి పుంజముగ
వెలుగుటయే నా తపస్సు
వెలిగించుట నా ప్రతిజ్ఞ!

అలాగే తన ప్రియ మిత్రుడు కాళోజి నారాయణరావు షష్టి పూర్తి సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వీవీ ఈ క్రింది గేయం రాశారు.

ఆరు పదులు నిందెనంట నారయ! నీ కాయమునకు -
ఆరా? పదియా? మనస్సునకనెడు సందియము తోచును!

సూక్తులు శాపములును పునరుక్తి దోషమంటకుండ
జగత్తు నభిశంసించుచు శతవత్సరములు దాటుము!

నోటి కస్సుబుస్సుకు కన్నీటి వింత జతగూర్చుచు
అంతరంగ నవనీతము ననారతము పంచియిమ్ము!

బ్రహ్మ నీకు పొరపాటున పాపుల వయసిచ్చుగాక!
కాలుడు మా కాళయ్యను కలకాలము మజచుగాక!

పీవీ గారి ఒక ఖండకావ్యం “భర్సృన” లో భగవంతుడిపై సవాలు విసురుతూ, విశ్వరచనలోని లోపాలను అసమ[గ్రతను ఎత్తి చూపుతూ “నాకు నీ నైజం, శక్తి, సామర్థ్యం, ఐశ్వర్యం, విభవం వంటి వ్యర్థ భాండారం పూర్తిగా తెలుసు. కనుక నీ యొక్క ఆ ఘనతలన్నీ నీ వరకే వుంచుకో. నాకేమీ అవసరం లేదు. నువ్వు నన్ను నా స్థానంలో వున్నవాణ్ణి ఉన్నట్లుగా ఉందనిస్తే అదే పదివేలు. నీ అవ్యాజ అనుగ్రహ అధీనత నుంచి నన్ను దూరంగా తప్పుకుని పోనిచ్చావా - నీకు వేయి నమస్కారాలు నన్ను నా దారిన పోనివ్వు నీ దారిన నువ్వు పో అన్నట్లు సాగుతుంది ఈ రచన.

కథకుడుగా పీవీ

హైదరాబాద్‌ లో పీవీ, బూర్గుల రామకృష్ణారావు గారి వద్ద జూనియర్‌ న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించేనాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. దేశమైతే స్వాతంత్రమైంది కాన్సీ హైదరాబాద్‌ రాజ్యం రజాకార్ల దురంతాలతో అల్లకల్లోలమైపోయింది. ప్రభుత్వం అండ ఉండడంతో వారి హింసాకాండకు అడ్డూ అదుపూ లేకపోయింది. మతకలహాలు పెట్రేగడంతో హిందూ న్యాయవాదులు మొత్తంగా కోర్టులను బహిష్కరించి తమ వృత్తిని మానుకున్నారు. పీవీ కి తన వకాలత్‌ పై ఆశలుడిగి, హైదరాబాద్‌ నుంచి మకాం ఎత్తేశారు.

బ్లూ సిల్క్‌ శారీ

ఆ రోజుల్లో పీవీ “బ్లూ సిల్క్‌ శారీ” (నీలం పట్టు చీర) అనే ఒక పెద్ద కథను ఆంగ్లంలో రాశారు. మతకలహాల్లో ముఖ్య పాత్రధారులు కేవలం గూండా శక్తులేనని వారికి కావలసింది మతం కాదని, తేరగా దొరికే ప్రజల ధన, మాన, ప్రాణాలేనని ఈ కథ వృత్తాంతం.

హైదరాబాద్‌ నంస్థానంలో వరిన్ఫితులు రోజురోజుకు దిగజారుతుండడంతో, పీవీ మద్రాసు వెళ్ళి అక్కడ కరపత్రాలు రాసి అన్ని ప్రాంతాలలోని ప్రముఖ వ్యక్తులకు, సంస్థలకు పేరుపేరునా పంపారు. కొందరు పత్రికాధిపతులను కలిసి, హైదరాబాద్‌ పరిస్థితిని వివరించి, వారి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. కానీ దాని వల్ల ఆశించిన ఫలితం కనిపించలేదు. ఇందువల్ల ప్రయోజనం లేదని భావించిన పీవీ మద్రాసు నుంచి బయల్దేరి రహస్యంగా మహారాష్ట్రలోని చాందా చేరుకొని అక్కడి స్టేట్‌ కాంగ్రెస్‌ క్యాంపులో చేరిపోయి సాయుధ ప్రతిఘటన ఉద్యమంలో పాల్గొన్నారు. యువకులకు గెరిల్లా పోరాట పద్ధతుల్లో శిక్షణ ఇవ్వటం, రైఫిళ్ళు, బాంబులు, స్టైన్‌ గను వంటి మారణాయుధాలను సమకూర్చడం మొదలైన బాధ్యతలను పీవీ ఇక్కడ నిర్వర్తించారు.

గొల్ల రామవ్వ

ఈ నేపథ్యంలో పీవీ గారు “గొల్ల రామవ్వ” అనే విప్లవ కథను రాశారు. అందులో తెలంగాణాలో ఒక గ్రామంలో కాంగ్రెస్‌ గెరిల్లా వీరుడి జాడను పసిగట్టి, పోలీసులు అతని వెన్నాడుతారు. అతడు ప్రాణభయంతో పరిగెత్తి అర్ధరాత్రి వేళ ఒక గుడిసెలో దూరుతాడు. ఆ ఇల్లు గొల్లరామవ్వ అనే అమాయక వృద్దురాలిది. ఆమెకు పరిస్థితి అర్ధం కావడానికి ఎంతో సమయం వట్టలేదు. అతని దేహం గాయాలతో నిండి వుంది. పోలీసులు అతనిని తరుముతున్నారని ఏకు అర్థమైంది. అతనిని ఎవరని ప్రశ్నించగా నేను విప్లవ యోధుడిని వేవుు పోలీనులను ఎదిరించి, మీకోనం పోరాడుతున్నామని చెప్పాడు. అతను తన గుడిసెలో ఉంటే తన ప్రాణాలకే ముప్పని ఆమె తెలుసుకుంది. అయితే ఆమెలోని త్యాగశీలత మేల్కొని, ఇతను మనకోసం (ప్రాణాలకు తెగించాడు - ఇతనికి సాయం చేస్తే పోయేది నా ముసలి ప్రాణమే కదా అని నిర్ధారణకు వచ్చి, తన ప్రాణాలకు తెగించి, ఆ వీరుడికి తన గుడిసెలో రక్షణనివ్వడం ఈ కథ వృత్తాంతం. ఒక వక్క పోలీసుల భయం. మరొక వంక తమందరి కోసం చావుకు వెరవక పోరాడుతున్న యువకునికి రక్షణనివ్వాలన్న తాపత్రయంతో ఆ ముసలి ప్రాణం కొట్టుమిట్టాడింది.

ఈ రెండు ద్వంద భావాల సంఘర్షణ ఈ కథలో నాటకీయంగా చిత్రితమైంది. ఆకలితో నకనకలాడుతున్న ఆ గెరిల్లా యోధుడికి తనకున్నదేదో పెట్టి ఆకలి తీర్చడమే కాక, యుక్తవయస్కురాలైన తన మనవరాలి పక్కలో పడుకోపెట్టి, నిజాం పోలీసులు వచ్చినప్పుడు అతను తన మనవరాలి పెనిమిటి అని చెప్పి, వారిని నమ్మించి ఆ యువకుడిని కాపాడి తన జెదార్యం చాటుకుంది.

ఈ కథ కాకతీయ” పత్రికలో 15 ఆగష్టు 1949 సంచికలో “విజయ” అనే మారుపేరుతో వీవీ రాశారు. ఉత్తర తెలంగాణ మాండలికంలో ఆసక్తికరంగా సాగే కథ ఇది. 1955 లో “విసృత కథా సంకలనం” ప్రచురించే సందర్భంలో కథా రచయిత శ్రీపతి | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |