పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చేశాయి. వృథ్వీరాజు పై వ్యక్తిగతమైన అనూయాద్వేషాలతో దేశద్రోహానికి పాల్పడిన జయచంద్రుని అధిక్షేపిస్తూ రాసిన పద్యాలివి. ఆనాడు నిజాంకు తొత్తులుగా వుండిన కొందరు ప్రజాభీష్టానికి వ్యక్తిరేకంగా చేస్తున్న చర్యలను నిరసిస్తూ రాసిన పద్యాలివి. కానీ ఆ పద్యాలిప్పుడు లభించడం లేదు. అయితే ఈ పద్యాలు మత్తేభ శార్జూల విక్రీడితాలని, విషయ వ్యక్తీకరణకు, అభివ్యక్తికి అనుకూలమైన వద్యాలని, పద్య రచనలో చేయి తిరిగిన తీరు “మకుటం” సూచిస్తున్నదని దా. కోవెల సంపత్కుమారాచార్య తమ వ్యాసం “పీవీ సాహిత్య వ్యక్తిత్వం” లో పేర్కొన్నారు.

పీవీ గారు కేవలం వృత్తాలను మాత్రమే కాక, ద్విపదలు, గీతాలు, గేయాలు కూడా విరివిగా ఆ రోజుల్లో రాసేవారని, ఆ రచనలు స్థూలంగా భావకవితాధోరణి అనిపించినా, సమకాలీన రాజకీయ, సామాజిక, సాంస్కృతికాంశాల స్పృహ, స్పర్శ వాటిలో దోబూచులాడుతూ ఉండేవని పాములపర్తి సదాశివరావు గారు పేర్మాన్నారు.

“నిర్మలాకాశం పై నుంచి ఒక “చుక్క చాన తనను ఆకర్షణతో మిలమిలా చూస్తున్న రమణీయ తరుణంలో - హఠాత్తుగా అది చూచి ఘూక కాంత యొకర్తు గొల్లున నవ్వె” అనే అనుభవం ఒక గీతికలో పొందుపరచబడింది. అలాగే, బాల్య స్నేపాతులను, వారితోడి ఆటాపాటలను, కేళీవిలాసాలను, వాటిలోని అమాయక అనుభూతి ఘడియలను తలచుకున్నప్పుడు - “కఠినునకునైనా నాగునే కంటినీరు” అంటూ మరొక గీతం రాశారు. యౌవనంలో (ప్రేమ అనీ ప్రణయం అనీ పీవీ ఆ రోజుల్లో ఎవరో ఒక ఊహాసుందరిని తలపోసి, శృంగారంపై చక్కటి రొమాంటిక్‌ వేదనతో కవితలు, ఖండకావ్యాలు రాశారు. ఇంగ్లీషులో కొన్ని భావగీతాలు, 'ఆర్త గీతాలు” అన్న పేరుతో ద్విపదలు రాశారు. ఈ రాతప్రతులు ఎవరో మిత్రుడు తీనుకుని వెళ్ళి తిరిగి ఇవ్వలేదట. ప్రబంధ శైలిలో వర్ణనలు, ఉపాలంభనలు కూడా పీవీ కొద్ది రోజులు రాసేవారు. 'గ్యాదర్డ్‌ 'పెటల్స్‌' అంటూ కొన్ని ఇంగ్లీష్‌ భావగీతికలు కూడా ఆయన రాశారు.

ఒక బాలవ్మాయ పోటీకి వీవీ, షేక్సియర్‌ నాటకాలు నాలుగింటికి సంగ్రహ కథారూపాలను రాసి పంపారు. అందులో రెండు విషాదాంతాలు, రెండు సుఖాంతాలు. అయితే ఆ ఎంట్రీల ఫలితం ఏమైందో తెలియదు. ఇదే ఫక్కీలో ఒకటి, రెండు హిందీ సినిమా కథలు కూడా రాసి వంపారు. కాలేజీల్లో చదివే రోజుల్లో కాలేజీ మ్యాగజైన్లకు అనేక రచనలు చేశారు.

తదనంతర కాలంలో రాజకీయాలలో తలమునకలవుతున్న సమయంలో పీవీ లోని కవితాత్మ నిద్రాణమైపోయిందనవచ్చు. అయితే అప్పుడప్పుడు తనలోని భావోద్రేకం మిక్కుటమైపోయినప్పుడు అది కవిత్వం రూపంలో పెల్లుబికిన సందర్భాలూ వున్నాయి.

పీవీ నరసింవోరావు గారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 1972లో దేశ స్వాతంత్ర్య రజతోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ సంవత్సరం ఆగష్టు 15వ తేదీ ప్రవేశించిన అర్ధరాత్రి ఆయన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభను సమావేశపరిచారు. ఈ సమావేశంలో తమ సందేశాన్ని కవితాగీతంగా ఈ విధంగా ఆలాపన చేశారు.

ఆ నిద్రాణ నిశీధిని మానిసి మేల్మాంచినాడు
ఒళ్ళు విరిచి కళ్ళు తెరిచి ఓహో అని లేచినాడు
కటిక చీకటుల చిమ్మెడు కారడవిని పయనించు
నిజ జఠరాగ్ని జ్వాలల నింగినంత లేపినాడు
అదుగో, హిమనగ మిచ్చిన అశ్రుతర్చణమ్మనగా,
కడుపుమంట సెగ ఆవిరి గంగానది చేసినాడు
యుగయుగాల అన్యాయం నగుమోముల దిగమింగగ
సాంధ్యారుణ రౌద్రక్షితిజముఖుడై చెలంగినాడు
వాడొక విప్లవ తపస్వి, మోడుపడిన కాయముల
వాడిన నెమ్మనముల, సర్వం కోల్పోయిన దళగళముల
వాడి చెడిన చూపుల, బువ్వకు నోచని జనగణముల
వెతల బరువు మోసి మోసి విల్లుకు వంగిన నడుముల
జరాహటములై కృశించు జవ్వనంపు వల్లకాళ్ళ -
అన్నిటినీ కాయకల్పమా తపస్సు చేసినాడు,
నవరసాగర్ధ జీవితాల, నవోన్మేష మానసాలా
నవపల్లవ తరుశాఖల రవళించెడు పూజనాల
నవవిధ భక్తుల, రక్తుల, నవశక్తుల మేళవించి
నవనిర్మిత జుతి సంతరించినాడా విప్లవ తపస్వి,
పావు శతాబ్దము పొడుగున పాలకుల, అర్భకుల మధ్య
విభజన వికృతమైపోవగ, బావురుమనే జీవితాలు -
అటు సమృద్ధి, ఇటు దైన్యము, అటు పెంపు, ఇటు హైన్యము
ఒకడు మింటికెగయ, అసంఖ్యాకు లింకిరి భూతలమున,
అర్భకుని భుజాన మోయు అమ్మ, వాని పడద్రోయ
దారిచూపు కాగడాలు తలకొౌరివిగా పరిణమింప,
ధర్మకర్తలే ధనకర్తలుగా మారిపోయినారు.
పావు శతాబ్దము పొడవున - వెలుగు నీడలలాగాను
దాగిలి మూతలనుచు తలంచ
వెలుగు ముక్కు విదిచెను నీడల నలుపు తిరస్మరించి
తంత్రీనాదముల చెలిమి తరగదంచు భావింపగ
తీగల త్రెంచుచు నాదము తృణీకర మాలపించే
ఈ నిద్రాణ నిశీధిని
ఈ నీరవ వాయుతరంగిణిలో ఒరివిడివడి
దొర్లిన భావస్ఫుల్లింగములు వెలుగునిచ్చునా?
అటులని విశ్వసించునా పథికుడు?
మృగజలమును జలమని నమ్మి చనిన ఆ చిరపిపాసి
శీతోదక సేవనమున సేదతీరునా నేటికి?
మిన్ను మన్ను కలిసి చెలిమిచెన్నారెడు శివసుందర సీమ,
వచ్చెనంచు సంతసించవచ్చునా పాంథుడు?
భూమి దానవగ్రహమైపోవ రోదసిని మధించి
మానవతావాహనకై పూనుకున్న రాజ్యేందిర
జయదుంధుఖి విని ఉత్తేజనము పొందునా పౌరులు?
మోదమలరని చెర అరలో మూల్లిన భావ కిశోరికి
విహరణ స్వేచ్భాంతరిక్షవీధిని లభ్యమ్మవునా?
అవునని, అవునౌనని, అవునౌనౌనని జనవాక్యము
తనువులు పులకెత్త ప్రతిధ్వనితమయ్యె మన కంఠము
శాశ్వతమై నిలచెడు ప్రశ్నాపరంపర ఇది -

| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |