పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

డా. గంధం సుబ్బారావు 7901053537


పీవీ నరసింహారావు గారు బహుముఖ శేముష్షీవిలసితుడు. ఆయనలో కవితాగుణాలు, దార్భనికతా లక్షణాలు - రెండూ జంటగా పెనవేసుకొనివున్నాయి. ఆయన వృత్తి రాజకీయాలు. ప్రవృత్తి కవిత్వం. ఆయనలో బాల్యం నుంచి భావావేశం అనే సహజలక్షణం వుండినది. కళాత్మకంగా తాదాత్యానుభవం పొందే చిత్తస్ఫూర్తి అన్వేషణాశీలమైన సూక్ష్మవివేకం, ఆస్వాదనాశీలమైన (గగ్రవాణ ప్రకర్షణలతో పాటు, అవురూవమైన ధీవిభవం, స్వయం్రేరకమైన వక్తృత్వ వైశద్యం వంటి ప్రతిభానైపుణ్యాలు నిబిడీకృతమైవున్నాయి. ఏవీ గారు సహజకవి, రచయిత, భావుకుడు.

“అతడు మహాకవి కాలేదు. గొప్ప నవలారచయితా కాలేదు. సంగీత విద్వాంసుడు గానో, లేదా చిత్రకారుడు గానో రూఢీ చెందలేదు. తత్వవేత్తగానో, శాస్త్రపరిశోధకుడుగానో - లేక విఖ్యాత న్యాయవాది గానో కూడా పేరు పొందలేదు”. పీవీ గారి గురించి ఈ మాటలనే సాహసం చేసిన వ్యక్తి ఆయన ఆప్తమి[త్రుడు, కాకతీయ పత్రిక సంపాదకులు, కీ.శే. పాములపర్తి సదాశివరావు గారు. 1972 మార్చిలో “జనధర్మ” ప్రచురించిన పీ.వీ. నరసింహారావు అభినందన సంచికలో రాసిన వ్యాసంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.

సదాశివరావు గారంటే, బాల్యం నుంచీ శరీరాలు వేరైనా ఆత్మ ఒకటిగా పీవీతో జీవించిన మహానుభావుడు. అందుచేత ఇవి పీవీ గారు తనను తాను అంచనా వేసుకున్న మాటలుగా భావించవచ్చు.

ఈ మాటల్లో గుర్తింపవలసిన ఒక చనత్మారంవుంది. ఇక్కడ “కాలేదు? 'చెందలేదు? “పొందలేదు” - అంటూ చెప్పబడినవన్నీ అట్లా కావడానికి, చెందడానికి, పొందడానికి తగిన ప్రతిభా సామర్ధాలు వీవీలో వుష్కలంగా ఉన్నాయని నిర్ధ్యంద్వంగా తెలియజెప్పటమే.

| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఈ అక్టోబరు-2020 |

పీవీ వ్యాసంగ వైవిధ్యాన్ని వ్యాపకత్వాన్ని సువ్యక్తం చేయడమే. ఆ లక్షణాలన్నింటినీ ఒక చోటికి చేరిస్తే రూపుగట్టిన వ్యక్తిత్వం వీవీ గారిది.

పీవీకి గల పై అన్ని లక్షణాల్లో ఆయనకు రాజకీయ రంగం తరువాత, ఇంచుమించుగా అంతటి గుర్తింపును తెచ్చిన మరొక రంగం ఆయనకు గల సాహిత్యాఖినివేశం. కవిత్వం, కథ, నవలిక, అనువాదం, నాటకం, విమర్శ, వ్యంగ్యం - హాస్యం, జర్నలిజం వంటి దాదాపు అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ ఆయన తన ప్రతిభను సందర్భోచితంగా ప్రదర్శించారు.

కవిత్వం:

ఆనాటి హైదరాబాద్‌ రాజ్య రాజకీయ పరిస్థితిల్లో సంఘాలు పెట్టుకోవడం, రాజకీయ సమావేశాలు నిర్వహించడం నిషేధం. అందుచేత దేవుని పేరిట భజన మండళ్ళను ఏర్పాటు చేసుకుని, భజనల నెవంతో నమావేశాలను నిర్వహించుకోవడం, ఈ సమావేశాల్లో విద్యార్థులకు దేశ సమకాలీన రాజకీయ పరిస్థితులు, జాతీయోద్యమం వంటి అంశాలను బోధించి, వారిలో స్ఫూర్తిని రగిల్చి, చైతన్యవంతులను చేయడం జరుగుతుండేది. (గ్రంథాలయోద్యమం కూడా ఇదే వ్యూహంతో కొనసాగింది.

హనుమకొండ హైస్కూల్లో కూడా ఇటువంటి భజన మందలి ఒకటి ఏర్పాటైంది. ఆ ఏర్పాటులో పీవీ ది ప్రధాన పాత్ర. ఆ మండలి సమావేశాల్లో కవితావఠనం, కథావఠనం, విద్యార్థులు తాము రచించినవి చదవడం మొదలైనవి ఉండేవి. ఆ భజన మండలి, ఒక సమావేశంలో వీవీ “జయచంద్రా ! హైందవ విధ్వంసకా!” మకుటంతో రచించిన వద్యాలూ, వాటిని ఆయన చదివిన ఉద్విగ్నభరితమైన తీరూ అక్కడ వున్నవారినందరినీ ఉత్తేజితుల్ని