పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విధానానికి పార్లమెంటు ఆమోదం లేదుకాబట్టి దానిని అమలు చేయడానికి పార్లమెంటులో అంశాల వారీగా చట్టాలు చేయవలసి ఉంటుంది. పాఠశాల విద్యలో ఇప్పటికే ఒక కేంద్ర చట్టం (విద్యాహక్కు చట్టం 2009) ఉంది కాబట్టి దానిని మారుస్తూ చట్టం చేయవలసి ఉంటుంది. అప్పుడు విషయాలు మరింత స్పష్టమవుతాయి. 1 నుంచి 8 వతరగతి వరకు వర్తించే విద్యాహక్కును ఇటు పూర్వ ప్రాథమిక విద్యకు అటు సెకండరీ విద్యకు విస్తరించాలని కస్తూరి రంగన్‌ కమిటీ చేసిన సిఫారసును ఈ విధాన పత్రం పట్టించుకోలేదు. మరి అట్టి హక్షుపై ఆధారపడిన చట్టాన్ని అలాగే ఉంచి పూర్వ ప్రాథమిక విద్యకు మరియు సెకండరీ విద్యకు క్రొత్త చట్టాలను తీసుకువస్తారా, ఆ చట్టాన్ని రద్దుచేసి పూర్వ ప్రాథమికవిద్య నుంచి 12వ తరగతి వరకు ఒకే కొత్త చట్టాన్ని తీసుకువస్తారా అన్న విషయం ఇంకా తేలవలసి ఉంది. ఎలా చేసినా ఈ నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయాలంటే బోధనా మాధ్యమం విషయంలో ప్రస్తుతం ఉన్న విద్యా హక్కువట్టాన్ని సవరించవలసి ఉంటుంది. ప్రధానంగా 8వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమం అని ఉన్న ప్రస్తుత నిబంధనని 5వ తరగతి వరకు అని సవరించవలసి ఉంటుంది. అంటే ఉన్న చట్టానికి అభివృద్ధినిరోధకమైన సవరణ చేయవలసి ఉంటుంది. మాతృభాషా మాధ్యమం విషయంలో 2010 ఏప్రిల్‌ 1 నుండి అమలు జరుగుతున్న విద్యాహక్కుచట్టం కంటే 'జుతీయ విద్యావిధానం 2020” ఒక అడుగు వెనుకన ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

బోధనా మాధ్యమం ఒక విషయం అయితే, ఈ విధానం ప్రకారం ఏఏ భాషలను పాఠ్య విషయాలుగా బోధిస్తారు అనేది మరొక చర్చనీయాంశం. 1968 నాటి జుతీయ విద్యావిధానంలో ప్రకటించబడి మరియు 1986 నాటి జుతీయ విద్యావిధానంలో కొనసాగించబడిన త్రిభాషా విధానం ప్రకారం తెలుగు విద్యార్థులకు తెలుగు, హిందీ మరియు ఆంగ్లం అనే పద్ధతి ఉన్న విషయం తెలిసిందే. (క్రొత్త విద్యావిధానంలో కూడా త్రిభాషా విధానం కొనసాగుతుందని పేర్కొనబడింది. కాని ఈ జాతీయ విద్యా విధానం 2020 లో 413 విభాగంలో నిర్దేశించిన త్రిభాషా విధానం ఇంత వరకు అమలు అవుతున్న విధానంతో పోలిస్తే పూర్తిగా వేరుగా ఉంది. కస్తూరి రంగన్‌ నివేదికలో హిందీ తప్పనిసరి అని ప్రతిపాదించబడితే హిందీయేతర రాష్ట్రాల నుంచి ప్రధానంగా తమిళనాడు నుంచి వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని విధాన వత్రంలో హిందీ తప్పనిసరి అనే భావనను తొలగించారు. అంతమేరకు మంచిదే. అంత కంటే ప్రధానమైన విషయం ఏమంటే ఈ విధానంలో మాతృభాషగాని అలాగే ఆంగ్లం కాని తప్పనిసరి అని పేర్కొనకపోవడం. ఈ విధానం విద్యార్ధికి చాలా వెనులుబాటు ఇచ్చింది. ఆయా ర్యాష్ట్రాలు, ప్రాంతాలు, ఇంకా ప్రధానంగా విద్యార్థులు తమ అభీష్టం ప్రకారం ఏవేని మూడు భాషలను ఎంపిక చేసుకోవచ్చని, అయితే అట్టి ఎంపికలో కనీసం రెండు దేశ (నేటివ్‌) భాషలు ఉందాలని ఈ చట్టంలో పేర్కొనబడింది. వునాదిలో విద్యావ్యాపారం ఉన్నప్పుడు 'వెసులుబాటులు వివక్షలకు దారితీస్తాయి. ఈ విధానం ప్రకారం విద్యార్థి ఆంగ్లం లేకుందా కూడా మూడు దేశీయ భాషలు నేర్చుకోవచ్చు. అలా దక్షిణాది రాష్ట్రాలలో జరగదు కాని కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో జరగవచ్చు. మరొక వైపు చూస్తే ఈ విధానం ప్రకారం మాతృభాష లేకుందా కూడా మూడు భాషలను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలలో (ఫైవేటు పాఠశాలలలో తెలుగు లేకుండా ఇంగ్లీషుతో పాటు 'స్కోరింగ్‌ సబ్బక్టులైన" హిందీ, సంస్కృతం

ర్తరువాయి 14వ పుటలో.......