పుట:అభాగ్యోపాఖ్యానము (Abhagyopakhyanamu).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఉ.	చారునగంబులన్, ధనువు, సంపెగపూవును, గెంపుఁ గూర్చి, సిం
	గారపుఁజన్నులన్, బొమల, ఘ్రాణము, వాతెఱఁ జేసి, బ్రహ్మ తా
	వారక వానికర్కశత, వంకరఁ, బచ్చన, రక్తకాంతిఁ బెం
	పారఁగఁ దీసి చేసె, మెయి, యారును, గన్నులుఁ, గుంతలంబులున్. ౫౨

చ.	ఘనతరమధ్యభారమునఁ గంపమునొందెడునూచకాళ్లు పెం
	పొనరఁ బిఱుందులుం ఘనతనొందినఁ దాళఁగలేవటంచుఁ దా
	వనరుహగర్భుఁ డెంతయును నంత మదిం దలపోసి సూక్ష్మలో
	చనకుఁ బిఱుందులు న్మిగుల సైకముగానొనరించె నేర్పునన్. ౫౩

గీ.	కొమ్మగాదది మేటి పెద్దమ్మగాని ।బాల గాదది యముచేతికోలగాని
	కన్నె గాదది బలిసినదున్న గాని ।నారిగాదది జనులకుమారి గాని. ౫౪

గీ	అట్టి కన్నియమును నీవు ననఁగి పెనఁగి ।కనరులేనట్టి మమతల గలసిరేని
	యెందునీత చెట్టుపయిఁ గోరెందతీఁగె ।యల్లుకొను రీతిగాదెయోయమరవైరి. ౫౫

చ.	అని చెలికాఁడు తెల్పుటయు నాక్షణ మారజనీచరేంద్రుఁడున్
	మనమున సంతసంబడర మానినిఁజూడఁగ మిత్రువెంటనే
	చనియెను ద్రోవలోఁగలుగుసర్వమహీజలతావిశేషముల్
	గనుఁగొనుచున్ మృగావళులఁగాంచుచు డొంకలముండ్లఁజూచుచున్. ౫౬

చ.	కనుఁగొను సంగడీఁడ యదె గట్టుకుఁజేరువ గచ్చతీఁగ మిం
	చినతమి గట్టిగా ముసిఁడిచెట్టును జుట్టుకయుండె మేలుమేల్
	దనుజుకులాగ్రగణ్య నిను దారుణలీలఁ గవుంగిలించి యా
	వనితయు నట్టులే మిగులవంతలఁ బెట్టి కలంచు మీఁదటన్. ౫౭

క	తెప్పానపకాయలఁగను ।ముప్పులబలంముండ్ల బెచ్చులూడెను సఖుఁడా
	యప్పడఁతిచన్ను తిత్తులఁ ।దప్పక నీవట్లుంచీరి తనరెదు నాథా. ౫౮

క	చూడుమదె గార్దభాంగన ।తాడనమొనరించెఁ దనదుధవుని వయస్యా
	చేడియ నిన్ను నుసరసం ।బాడెడునపు డిట్లుతన్ను నమరవిరోధి. ౫౯

క.	ఇటు లన్యోన్యంబును ము ।చ్చటలాడుచు నేగియేగి చామను గుడిచెం
	గటఁ గని మేనువడంకఁగ ।నటమటతో నిర్జరారి యనియెనుదనలోన్. ౬౦

ఉ.	దీనిని నేనువేఁడినను దిట్టునొ కొట్టునొ లోనికేగునో
	మానిని బల్మిఁబట్టుటయు మంచిదిగాదని యూరకుండి నే
	సూనశ రా ర్తినెక్కరణి స్రుక్కుడు నేవిధినైన నిప్పుడీ
	చానను గూడువాఁడనని చప్పుడు సేయక మెల్ల మెల్లఁ గాన్. ౬౧