పుట:అభాగ్యోపాఖ్యానము (Abhagyopakhyanamu).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
చ.	అటుచని యూరి బైట గలయంజరియించుచు నొక్కతావునన్
	బెటుకున ముందుగాఁ జెవులపిల్లిని గన్గొని కుక్కగుంపులన్
	బటుమతి దానిపైఁ గవియఁబంపఁగ నవ్వియు నేగి క్రమ్మఱన్
	దటుకున వచ్చెఁ గాట్లుపడి తత్పురికుక్కల ధైర్యమేమనన్. ౩౬

ఉ.	అవ్వల నూరఁబందియొక టడ్డమువచ్చినఁ దద్భటావళుల్
	చివ్వకు నీటెలంగొనుచు శీఘ్రమ పర్విడఁ బంది వారలన్
	దవ్వులఁజూచి లో బెదరి దారుణభంగిని ఘర్ఘురింపఁగా
	నెవ్వడిఁ బాఱిరాభటులు నిల్వక దానికిలొంగ కుక్కునన్. ౩౭

గీ.	పందిఁ బొడువంగ చచ్చిన భటచయంబు ।బెండువడి పందితోడనే బెదరియుఱికె
	శశముఁ బట్టంగవచ్చినసార మేయ ।వితతి శశకంబుతోడనే వెనుకఁ దిరిగె. ౩౮

వ.	ఇట్లు భటశ్వాసంబులు బెదరి చెదరిన రాక్షసాధ్యక్షుండు రూక్షవీక్షణుండయి 
	కుర్కుర మర్కట మార్జాల శశకాద్యనేకాక్షుద్రమృగకులంబులఁ బొలియించి 
	మృగయావినోదంబయి సలుపుచుండ నొక్కచో నొకతరుక్షువువీక్షించి తురంగంబు 
	భయాకులాంతరంగంబయి యికిలించుచు నపరాహ్ణసమయంబున సరోవరసమీ
	పంబున బురదనేల నతనిం గూలవైచి చనినయనంతరంబ యంతకుమున్న విట్చ
	రంబుచేఁ దఱుమంబడి యచ్చట డాఁగియున్న భృత్యుండొక్కరుండు చనుదెంచి 
	లేవనేత్తిన. ౩౯

గీ.	బురదతుడిచికొనుచుఁ బొక్కుచుఁజనుదెంచి ।యతని గ్రుచ్చియెత్తి యాదరించి
	పందిచేతఁబడక పఱచివచ్చినయట్టి ।పౌరుషంబుకొంత ప్రస్తుతించె. ౪౦

వ.	అట్లు సేదతేఱి తీరస్థితవటమహీరుహచ్ఛాయం జేరి భృత్యసహితంబుగా నందు 
	విశ్రమించియున్న యవసరంబున. ౪౧

చ.	శునక మురోదనంబుగతి సూకరనాదముభంగి గార్దభ
	స్వనమువిధంబునన్ బ్రబల సైరిభరావముపోల్కి దవ్వులన్
	వినఁబడె రాక్షసాధమునివీనుల కెంతయు విందుసేయుచున్
	ఘననినదంబు భూమిధరగహ్వరజాలము మాఱుమ్రోయఁగన్. ౪౨

శా.	ఆనాదం బతఁడాలకించి మది నాహాయంచు భావించి చి
	త్తానందంబున భృత్యునింబిలిచి నీవాచప్పుడేతెంచుసు
	స్థానంబారసి వేగ మాధ్వని ప్రభూతంబౌటకుంగారణం
	బానందంబునఁ జేరఁబోయి కనిరమ్మా యెవ్వరట్లార్చెరో. ౪౩