పుట:అభాగ్యోపాఖ్యానము (Abhagyopakhyanamu).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
క.	ధరణి నభాగ్యమహాసుర ।చరితము విన్నట్టిపుణ్యచరితుల కెల్లన్
	బరవనితారతి చెడునని ।పరిహాసకుఁ డానతిచ్చెఁ బాండుసుతునకున్. ౧౧౬

క.	ధరణీజనమందారా ।సురమునిగణనుతవిహార సుగుణాధారా
	పరిభావితరిపువీరా ।దురితనిచయఘనసమీర దుఃఖవిదారా. ౧౧౭

మాలి.అనుపసుగుణసాంద్రా యాదవాంభోధిచంద్రా
	జనఘననుతిపాత్రా సజ్జనాంభోజమిత్రా
	వనధికృతవిహారా వల్లవీచిత్తచోరా
	దనుజచయవిరామా దర్పితారాతిభీమా. ౧౧౮


గద్యము. ఇది శ్రీమత్సకలసుకవిజనవిధేయ కందుకూరి వీరేశలింగ

నామధేయ కల్పితంబయినయభాగ్యోపాఖ్యానంబను

హాస్యప్రబంధంబునందు సర్వంబును

నేకాశ్వాసము. -<•>-



-<<<•>>>-