ఆముక్తమాల్యదయందు (ఆ.1.83) —
| చ. |
కదళిగభీరపుష్పపుటికాచ్ఛటఁ జేతుల నిప్పపిండి పైఁ
గుదురుగ నిల్పి యోపుగతి గూనల నూనియ నించి త్రాట ము
న్నుదినశాటి వ్రేల నది నొక్కటఁ గ్రుం కిడి వత్తు రెంద ఱే
వదలక యాతనింట శనివారమునం [1]బరదేశవైష్ణవుల్.
| 169
|
చిత్రభారతమునందు (1-12) —
| చ. |
చదివినవారికి న్వినిసభ్యుల కున్నతి వాంఛ సేయు బ
ల్లిదులకు గల్గు విప్రులకు లేఁగలతోఁ గనుకట్టు లక్ష పె
న్మొదవుల నిచ్చునట్టి ఫలము న్హయమేధము సేయు పుణ్యమున్
గొదకక రాత్రి యంతయు యకుంఠితదాన మొనర్చు శ్రేయమున్.
| 170
|
కళాపూర్ణోదయమునందు (ఆ.4.56) —
| చ. |
అది శతతాళదఘ్న మను సార్థకనామముతోడ నుత్తమ
హ్రదములలోఁ బొగడ్తఁ గనినట్టిది యందునఁ బడ్డవానికిన్
బ్రదుకులె యంచు...
| 171
|
వసిష్ఠరామాయణమునందు (ఆ.1.7) —
| చ. |
కదిసిన [2]నోరు వోయి మఱి గబ్బపుదొంతుల సత్పదార్థముల్
గదుకుచు నెట్టివారిఁ బొడగన్నను గుఱ్ఱని స్నేహసౌఖ్యముల్
మదికి [3]నసహ్యమౌ శునకమార్గమునం [4]జరియించుచున్న త
త్పదకవు లెల్ల మత్కవిత తప్పులు పట్టక యూరకుండుఁ డీ.
| 172
|
అంతస్థులభేదంబులు
శబ్దానుశాసనమూలసూత్రము
| మూ.సూ. |
లఘవో౽లఘవ శ్చైతి ద్వేధా న్తస్థా న్వదన్తి శాస్తారః,
అన్యే౽న్యవ్యాకరణస్పష్టా రస్త్వత్ర గృహ్యతే ద్వివిధః.
|
|
| క. |
అలఘులఘునామకంబుల, నలరు నిరుదెఱంగు లగుచు నంతస్థము లీ
తెలుఁగున నయ్యెను రేఫము, యలవలు సెప్పఁబడి యుండు వ్యాకరణములన్.
| 173
|
| క. |
ఆద్యంతాంతస్థంబులు, చోద్యంబగు పాణినీయసూత్రమువలనన్
హృద్యములై యాగమసం, [5]వేద్యా లఘ్వలఘువు లన ద్వివిధము లయ్యెన్.
| 174
|
- ↑ బరదేశి (అచ్చు)
- ↑ నోరువోవుదురు; నోరువోయియొరు
- ↑ నసహ్యమై
- ↑ జరియింపకున్న సత్పద; జరియింపుచున్న సత్పద; దుష్పథకవులెల్ల (సూ)
- ↑ వేద్యా లఘులఘువులనఁగ (సూ)