Jump to content

పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వక్రతమభేదంబులు

పాణినీయసూత్రము

సూ.

తద్ధితే ష్వచా మాదేః.


వృ.

ఞితి ణితి చ తద్ధితే పరే అచా మాదే రచో వృద్ధి స్స్యాత్.


క.

హైయంగవీనమునకున్, నైయంవకశబ్దమునకు నైయ గ్రోధ
[1]స్త్రైయజితాదుల కాదిని, వ్రాయంగా వలయుఁ బ్రథమవక్రతమంబుల్.

104


క.

వైయర్థ్యత్రైయంబక, వైయాకరణాగ్రగణ్య వైయాఘ్రపదీ
వైయాత్యంబుల మొదలను, వ్రాయం దగు బుధులు ప్రథమవక్రతమంబుల్.

105


క.

యౌవనయౌవతకౌస్తుభ, సౌవర్ణకయౌవరాజ్యసౌవీరమహీ
దౌవారికశబ్దంబులఁ, దావుకొను ద్వితీయవక్రతమములు మొదలన్.

106


క.

సౌవగ్రామికశౌవన, [2]సౌవర్చససౌవిదల్ల సౌవస్యలస
త్సౌవరశబ్దములమొదల, వావిరి నిలుచున్ ద్వితీయవక్రతమంబుల్.

107

కౌస్తుభము అనుటకు నృసింహపురాణమునందు (అ.2.37) —

ఉ.

శ్రీస్తనకుంకుమద్రవనిషిక్తభుజాంతరభాగవిస్ఫుర
త్కౌస్తుభనూతనార్కరుచిగర్వితనాభిసరోజసౌరభ
ప్రస్తుతమత్తభృంగరవరాగరసోల్బణభోగిభోగత
ల్పాస్తరణుం దలంచు సుకృతాత్ము లపాస్తసమస్తకల్మషుల్.

108


క.

మెచ్చులగు కబ్బములలో, నచ్చతెనుఁగుపల్కులందు నైత్వౌత్వంబుల్
వచ్చిన నొం డగు రెం డగు, విచ్చలవిడి వలసెనేని విబుధస్తుత్యా.

109


మూ.సూ.

అయిగవుగాదేశౌ స్తఃక్రమేణ సర్వత్ర వక్రతమయోర్వా.


క.

క్రమమున వక్రతమములను, నమరు నయిక్కును నవుక్కు ననియెడు నాదే
శములు వికల్పంబున దై, త్యమదాపహ యాంధ్రభాషయం దెల్లెడలన్.

110


ఆ.

లోకహితముకొఱకుఁ బైకొని దుష్టుల, లయ మొనర్చి శిష్టు లయిన నృపుల
నేల యేల నిలిపెఁ గౌ లిచ్చి నలుదెస, దవిలి కృష్ణరాయఁ డవుర యనఁగ.

111

కవర్గాక్షరభేదంబులు

మూ.సూ.

వా స్యా త్క్వచిద్వకారాో నాదిగతస్వాద్యవర్గసరళస్య.


సీ.

పరుగులు పరువులు పగరంబు పవడంబు పగలుట పవలుట పగలు పవలు
నగుఁబాటు నవుఁబాటు నలుగురు నలువురు తగులాట తవులాట తొగలు తొవలు

  1. స్వైయకృతంబుల (సూ)
  2. సౌవర్చన సౌవిదల్ల సౌదశ్వ (సూ)