Jump to content

పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాఘవపాండవీయము (ఆ.2.108) —

స్రగ్ధర.

ఆ రాజన్యోత్తముఁ డి ట్లనుదితరభసుండై భవర్సత్వరవ్యా
హారం బి ట్లోర్చి యు టన్యముగఁ గొనకు మాత్మాంగనాశుల్కతాదృ
క్సారోగ్రేష్వాస మ ట్లశ్రమజిత మగు టెంచంగ నాచేతికాటం
గ్రూరేష్వాసంబు లే దొక్కొఁడు గలుగునె మద్ఘోరయుద్ధంబు సైపన్.

98

ఒకారము రానందులకుఁ గాశీఖండమున (ఆ.1.108) —

ఉ.

కంటికి నిద్ర వచ్చునె, సుఖం బగునే రతికేళి, జిహ్వకున్
వంటక [1]మించునే, యితరవైభవముల్ పదివేలు మానసం
బంటునె మానుషంబు గలయట్టి మనుష్యున కెంతవానికిన్
గంటకుడైన శాత్రవుఁ డొకండు తనంతటివాఁడు గల్గినన్.

99

విరాటపర్వమునందు (ఆ.4.210) —

సీ.పా.

శక్రాదిసురలతో సంగ్రామ మొనరించి ఖాండవం బేర్చె నొక్కరుఁడు గాఁడె

100

చొటు అనేటందుకు ద్రోణపర్వమునందు (ఆ.2.251) —

క.

కటకట పేరినపె న్నె, త్తుట జొత్తిలి యున్నమోముతోడను గొడు కె
చ్చటఁ బడి యున్నాఁడో య, చ్చొటుఁ జూపెడువారు లేరె చూచెద వానిన్.

101

విష్ణుచిత్తీయమునందు (ఆ.4.145) —

మ.

స్ఫుటభూయోహృతిశంక వార్థి రవిరశ్ము ల్నిన్ను జేర్పం దటి
చ్ఛట [2]లౌర్వంబుగఁ గాఱుకొంచు ఘనమై క్ష్మాఁదీర వర్షింప న
చ్చొటునుం ద్రోచి గ్రసింపఁబోలుఁ గలశీసూనుండు గాకున్న నొ
క్కొటఁ దారాగ్రహభాస్కరేందుమణిశుక్తుల్ వ్యక్తమై తోఁచునే.

102

హ్రస్వము గానందుకు మనుచరిత్రము (ఆ.2.70) —

ఉ.

పాటున కింతు లోర్తురె కృపారహితాత్మక నీవు ద్రోయ ని
చ్చొట భవన్నఖాంకురము సోఁకెఁ గనుంగొను మంచుఁ జూపి య
ప్పాటలగంధి వేదన [3]నెపం బిడి యేడ్చెఁ [4]గలస్వనంబునన్
మీటిన విచ్చు గబ్బిచనుమిట్టల నశ్రులు చిందు వందఁగాన్.

103
  1. మిందునే (పాఠాంతరము)
  2. గార్యంబుగ (పూ.ము.)
  3. నెపంబున నే
  4. గలస్వనంబుతో