Jump to content

పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందే (ఆ.3.80)—

తే.

పొదవి యొండొండ దివియును భువియు దెసలుఁ
బొదవికొని యుండు చీఁకటిప్రోవువలన
మిక్కుటంబుగఁ గాటుక గ్రుక్కినట్లు
కరవటం బన జగదండ ఖండ మమరె.

83

అందే (ఆ.4.32)—

క.

అది యట్ల కాదె నిప్పునఁ, జెద లంటునె దేవదేవు శ్రీరమణీశున్
మది నుంచుకొన్నవానిని, బొదవునె యాపదలు రవిని బొందునె తమముల్.

84

[1]అచ్చునకుఁ జిత్రభారతమునందు (1.16)—

క.

తదనంతరంబు గ్రమ్మఱ, యదువిభుఁడు కృపావిధేయుఁడై వాణీశ
త్రిదశేశుల కాశ్చర్యం, బొదవ మనిచె నుభయసైన్యయోధుల నెల్లన్.

85

ఉద్యోగపర్వమునందు (ఆ.1.9)—

క.

పదపడి దుస్తర మగు నీ, పదమూఁడగునేడు గడపఁబడుట యరిది ద
మ్మెదు రెఱుఁగకుండ నాపద, లొదవఁగ సైరించి రిట్టి యునికుయుఁ గలదే.

86

పొనరె నన్నందుకు నుద్యోగపర్వమునందు (ఆ.2.35)—

క.

ధనమును విద్యయు వంశం, బును దుర్మదులకు మదంబుఁ బొనరించును స
జ్జను లైనవారి కడఁకువ, యును వినయము నివియ తెచ్చు నుర్వీనాథా.

87

అందే (ఆ.3.143)—

చ.

అని నిన్మెచ్చి వృకోదరుం డతఁడు కార్యం బింత తెల్లంబుగాఁ
బొనరం బల్కునె యంచుఁ బేరెలుఁగు సొంపుం జెంద వక్త్రంబుపొ
ల్పున దర్పం బొలయంగ నంగములకుం బొంగారు తద్బృంహిత
ధ్వనియై మించు మహోగ్రసింధురమిచందం బొంది పొల్చెం దగన్.

88

పకారములోని స్వరమే నిల్చినందుకుఁ బ్రబంధపరమేశ్వరుఁడు చెప్పిన [2]అహోబలమాహాత్మ్యమునందు —

క.

నిను నాశ్రయించియును నే, ననఘా కడ లేని వనట యను వననిధిలో
మునుగుదునె ప్రతీకారం, బొనరింపఁగదయ్య దీని కూహించి కృపన్.

89

హరిశ్చంద్రోపాఖ్యానమునందు —

చ.

ధనదునిపుష్పకంబునకుఁ దా నెన వచ్చు నటంచు లోకముల్
వినుతి [3]యొనర్చ బొల్పెసఁగి విద్రుమమౌక్తికనీలవజ్రకాం

  1. హల్లోపమునకు (సూ)
  2. నృసింహపురాణమున కిది నామాంతరము (రా)
  3. యొసంగెఁ (ప)